Previous Page Next Page 
మహావృక్షం పేజి 38

"చాల్లే... పరాయి వాళ్ళు అన్నట్టు ఏంటామాటలు? సరేగానీ కొంచెం నొప్పి తగ్గిందా?"
"ఊ.."
"ఇలా ఇక్కడే పడుకో. నాలుగున్నరయింది. ఇంకో గంటలో తెల్లవారిపోతుంది. నొప్పి తగ్గితే ఆ మాత్ర ఉమ్మేయ్...! లేదంటే మింగేసేయ్."
"అలాగే డాక్టర్" హాస్యంగా అన్నది మణి నీరసంగా నవుఉతూ.
ఆమె నవ్వు చూడగానే అనూషకి హాటిగా అనిపించింది.
"రాజా! నువ్వు పడుకో" అంటూ రాజుని పంపించి, తను కూడా మరో సోఫాలో వాలింది.
"తెల్లవారక హాస్పిటల్ కి వెడదాం... కొన్ని పరీక్షలు చేయాలి."
"సరే!" కళ్ళు మూసుకుంది మణి.
అనూషకి మాత్రం మళ్ళీ నిద్రపట్టలేదు. మణి ఎందుకొచ్చిందో.... తన దగ్గరకి వచ్చింది రాత్రి బహుశా ఇందుకే వచ్చి వుంటుంది? ఇదే నొప్పి మణి ఇంట్లో వచ్చి వుంటే పాపం చిన్నయ్య ఎంత ఇబ్బంది పడేవాడో, ఎంత గాభారా పడేవాడో. కొన్ని సంఘటనలు మంచికే జరుగుతాయి అంటారు. ఇదీ అంతేనా? మణి వైపు చూసింది.... గాడంగా నిద్రపోతుంది.
ఓ  గంటసేపలా ఆలోచిస్తూ పడుకున్న అనూష ఐదున్నర అవుతుండంగా లేచి, ముందు వీణకి ఫోన్ చేసింది. కాసేపు రింగయింది కానీ వీణ తీయలేదు. బహూశా మార్నింగ్ వాక్ కి వెళ్ళి వుంటుంది. అనుకుని ఫోన్ పెట్టేసి రొటిన్ లో మునిగిపోయింది. ఏడుగంటలకల్లా స్నానం చేసి పూజ చేసుకుని తయారై కూర్చుంది. వంటావిడ భారతమ్మ వచ్చింది. ఆవిణ్ణి త్వరగా కాఫీ కలపమని చెప్పి, మణి దగ్గరకి నడిచింది. మణి ఇంకా నిద్రపోతుంది. ఆమెని డిస్టర్బ్ చేయలేదు. నిశబ్దంగా లోపలకి కెళ్ళిపోయింది.
కాఫీ తాగి, ఎనిమిదిన్నరకి మణిని లేపింది. మోహం కడిగించి భారతమ్మగారి సాయంతో స్నానం చేయించి, కాఫీ ఇచ్చింది. అరగంట తరువాత ఇద్దారూ కలసి ఉస్మానీయా హాస్పిటల్ కి బయలుదేరారు.
ఆవిడకి అంతకముందు కూడా అప్పుడప్పుడు గుండెల్లో సన్నగా నొప్పి వస్తుండేది. రాత్రిళ్ళు నిద్రలో కూడా సడన్ గా భయంవేసి, రెస్ట్ లేస్  గా అనిపిస్తుండేది. కొంచెం సేపు బాల్కనీ లో నిల్చుంటే నొప్పి తగ్గటం ఎలా వున్నా,  హాయిగా అనిపిస్తుండేది. ఆ విషయాలన్నీ అనూషకి కారులో కూర్చూన్నప్పుడు చెప్పింది.
అంతా విన్నాక అనూష చేడామడాతిట్టింది.
"డాక్టర్ని అయి ఉండీ, ఇంత నిర్లక్షం చేస్తావా? బుద్దుందా నీకు?"
మనీ నవ్వుతూ అన్నది. "నువ్విలా తిడుతుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా?"
"చాల్లే" విసుక్కుంది అనూష, స్టీరింగ్ మలుపు దగ్గర తిప్పుతూ.
ఆమెనలా చూస్తుంటే మణికి ఎంతో సెక్యూర్ డ్ గా అనిపించసాగింది. అనూష... ఎవరీ అనూష? తల్లా? చెల్లా? స్నేహితురాల? ఇంత ఆప్యాయత, అనురాగం పంచిచ్చే ఈ ప్రేమమూర్తి తనకేమవుతుంది? ఆ మాటల్లో అనురాగామేకాదు, అజ్ఞాపన కూడా వుంటుంది. ఆమె ఆలోచిస్తుండగానే కారు హాస్పిటల్ చేరింది.
లోపలకి వెడుతూనే చకచకా మణికి బెడ్ కేటాయించి చేస్ట్  ఎక్సేరే, ఐ.పి.జి, యూరిన్ అనాలసిస్, బ్లడ్ అనాలసిస్ మొదలయిన ఇన్వెస్టి గేషన్స్ కి ఏర్పాటు చేసింది. అన్ని పరీక్షలయ్యాక ఇక్కడ పడుకుని రెస్టు తీసుకో. నేనీ లోపల రౌండ్స్ కి వెళ్ళి వస్తాను అన్నది.
"అలాగే. అయినా తగ్గిందిగా ఎందుకివన్నీ?"
"చూడూ! నేను కార్డి యాలజిస్టుని, నువ్వు గైనకాలజిస్టు. నీకు తెలుసా గుండె సంగతి నాకు తెలుసా?"
"అబ్బ! కోపం వచ్చిందే" నవ్వింది.
అనూష సిస్టర్ కి మణిని అప్ప చెప్పి, తను రౌండ్స్ కి వెళ్ళింది.
పరీక్షలన్నీ అయ్యాక మణి తనకి కేటాయించిన బెడ్ మీద పడుకుని విశ్రాంతి తీసుకుంది.
దాదాపు రెండుగంటల తరువాత అనూష వచ్చింది. ఆమె వెనకాలే చిన్నయ్య వచ్చాడు. ఖంగారుగా అడిగాడు.
"ఎలా ఉండమ్మా అనూషా!"
"ఖంగారేంలేదు. మీరు ప్రశాంతంగా కూర్చోండి...." అన్నది అనూష.
నాకు తెలుసు ఇలా జరుగుతుంది ఎప్పుడో అని. అబ్బ... రాత్రి మీ దగ్గర వుండటం ఎంత బాగయింది ?" అన్నాడు. గుండెలమీద చేయి వేసుకుని నిస్చంత ప్రదర్శిస్తూ.
మణి ఆయనని "బోంచేశారా?" అని అడిగింది.
"చేశానులే.... నువ్వు ఇహనుంచీ జాగ్రత్తగా వుండాలి మణీ! ఈ పాప లేకపోయి వుంటే ఏమయేది?" అన్నాడు.
అయన అనూషని అప్పుడప్పుడూ పాప అటుంటాడు.
"ఏమికాదు.... ఫోన్ చేస్తే ఎక్కడున్నా రెక్కలుకట్టుకుని వస్తుంది. ఇంతకీ రిపోర్ట్స్ వచ్చాయా అనూ!" అడిగింది.
"వస్తాయి. అప్పుడేనా?"
చిన్నయ్య ఖంగారుగా ఏదో మాట్లాడుతుంటే చెప్పింది. "మీరు వెళ్ళి ఇడ్లీ తీసుకురండి.  మణికి ఏం ఫర్వాలేదు. నేను చూసుకుంటాను."
"అలాగే" వెళ్ళిపోయాడు.
అనూష ఏం మాట్లాడలేదు. తినాలి. ఆకలేస్తోంది అనుకుంది.
సాయంకాలానికి రిపోర్ట్స్ వచ్చాయి.
"రక్తంలో కొలెస్టరాల్ పెరిగింది. నూనె వాడకం మానేయాలి. రోజూ మార్నింగ్ వాక్ చెయి. పచ్చి కూరలు,పళ్ళు తీసుకోవాలి.ఈ టెన్షన్ లు, అయాసాలు, ఆలోచనలు, మానేసి మెడిటేషన్ చేయి. నిజంగా రాత్రి నా దగ్గర వుండటం చాలా అదృష్టం" అన్నది.
"లేకపోతే పోయేదాన్నికదూ!"
కోపంగా చూసి మందులిచ్చింది.
వీణ, శ్యామల హడావిడిగా వచ్చారు.
కూలసాగా ఉన్న మణిని చూసి, హాయిగా నిట్టూర్చారిద్దారూ.
"చాలా ఖంగారుపడ్డాను అనూ! ఎలా వుంది ఇప్పుడు....?" మణి నుదుటిమీద చేయి వేస్తూ అడిగింది వీణ.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS