Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 39



    "మిస్టర్ ప్రశాంత్.

     నీ రచనలని అభిమానించే అభిమానులందరూ నీ దగ్గర పడుకో డానికి, నీచేత శోధించబడాలని పడి చచ్చిపోతున్నారని నువ్వు కలలు కంటూ వుంటే అది నీ తెలివి తక్కువ తనమే అవుతుంది."

    "నా తెలివి తేటలమీద నకు అమోఘమైన నమ్మకం వుంది బేబీ!

    నా దృష్టిలో ఆడదంటే ఓ విలాసమైన వస్తువు. ఆడుకోడానికి ఉపయోగించుకొనే ఆటబొమ్మగా నేను భావిస్తాను.

     కలుసుకో!

     విడిపో!

    దట్సాల్"

    ఆమె నిప్పులు కురిసే కళ్లతో అతనికేసి చూసింది.

     "ఆడదంటే ఎంత లోకువైపోయింది నీ దృష్టిలో. ఒకటి అరా తెలివి తక్కువతనంతో నీ ట్రాప్ లో చిక్కుకుని వుండొచ్చు.

     అంతమాత్రం చేత ప్రతి ఆడపిల్లని పడక గదిలోకి నడిపించడానికి ప్రయత్నించకు.

     ఆడపిల్లని కేవలం ఆడపిల్ల అనుకోవద్దు.

     ఆడపిల్లని సింహాలుంటాయి.

     ఆడపిల్లల్లో పులులుంటాయి.

     ఆడపిల్లల్లో కాలనాగు లుంటాయి.

     ఆడపిల్ల ఎదురు తిరిగితే దేవుడు కూడా సమాధానం చెప్పలేడు.

     ఆడపిల్ల కోపం కాలనాగు విషంకన్నా ప్రమాదమైంది.

      ఆడపిల్ల కన్నీరు తరతరాలు వెంటాడుతుంది."

    ప్రశాంత్ కోపంతో రెచ్చిపోలేదు.

     ఆమె మాటలు విని చిరునవ్వుతో ఆమెకేసి చూస్తున్నాడు.

     "ఇంత ఉపన్యాసం దంచి తిరిగి నువ్వు ఆడపిల్లని కన్నీరు దగ్గర చేర్చావు.

     ఎంత చెప్పినా కన్నీరు లేకుండా ఆడది,

     ఆడదిలేకుండా కన్నీరు వుండలేదు."

    "నీకు తెలిసింది అంతవరకే. కానీ అనుభవిస్తావు."

    "న్నో. నేను ఇలాంటి బెదిరింపులకి లొంగేదాన్ని కాదు.

     నాకు సెంటిమెంట్స్ లేవు.

     నేను జరిగిన దాన్ని గుర్తు పెట్టుకోను.

     జరగవలసిన దాన్ని గురించే ఆలోచిస్తాను.

     అది మనకి లాభించదు అనిపించినప్పుడు దాని గురించి క్షణం కూడా ఆలోచించను."

     బేబీ!

    పడక గదిలోంచి అడుగు బయట పెట్టిన మరుక్షణం ఆ ఆడదాన్ని నేను గుర్తుపెట్టుకోను.

     ఆ విధంగా వాళ్ల రహస్యాలని నేను కాపాడతాను.

     నువ్వు అలిగి  బెట్టు చేస్తున్నావే కానీ నా చేతులతో ఒక్కసారి దగ్గరికి తీసుకొంటే వద్దన్నా నువ్వే నా మీద పడిపోతావు. నాతో అనుభవాన్ని పొందిన ఏ ఆడదీ జీవితంలో నన్ను మర్చిపోదు!"

    విజయకి వంటిమీద చీమలు, జెర్రులు పాకుతున్నట్టుగా అనిపిస్తోంది.

     "నువ్వెంత పేలినా ఒక్క విషయం మరిచిపోకు.

     దేవుడు నోరు ఇచ్చింది మంచిని మాట్లాడ్డానికి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. ఫినాయిల్  పోసి కడిగించాల్సి వస్తుంది.

     కొంగ ఎండ్రకాయ కథ నీకు తెలుసో తెలీదో!తెలీకపోతే ఓసారి  చదువు.

     దాని నీతి పాఠం తెలుసుకొంటే జీవితంలో జాగ్రత్తపడొచ్చు. లేక పోతే "ఆడపిల్లలు" అనితేలిగ్గా తీసిపారేస్తున్న నిన్ను ఏ ఆడదో నీ పీకకి కత్తి దించేస్తుంది జాగ్రత్త" అంది.

    ప్రశాంత్ ఒక్క విషయం గురించే ఆలోచిస్తున్నాడు.

     విజయ రావడం, తనకి టెలిఫోన్ చేయడం, తను వెళ్లి కలుసుకోవడం, మాట్లాడుకోవడం, అంతే అతను ఎప్పుడూ కొత్త ఆడపిల్లలతో నడిసినట్టే చేశాడు.

     హోటల్లో విజయతో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ ఆమె ఆ  విధంగా ఎదురు తిరిగే స్వభావం అతనికి కనిపించలేదు.

     విజయని చాలా తేలికగా లైన్ లోకి తీసుకున్నాననే అతనప్పటి వరకూ అనుకొన్నాడు.

     అయితే...

     తన గురించీ, తనలోని బలహీనతల గురించి ఆమె విన్నమాటలని, నిజాలని తెలుసుకోవడానికి ఇంత చాకచక్యంగా నాటకం ఆడుతోందని అతను పసిగట్టలేకపోయాడు.

     ఆ విధంగా ఓ ఆడపిల్ల తన గాలి తీసేసేసరికి కోపం క్రమంగా పెరిగిపోసాగింది.

     అయినా కోపాన్ని అణుచుకోడానికి అతను ప్రయత్నిస్తున్నాడు.

     "బై!" అని కారు స్టార్ట్ చేశాడు ప్రశాంత్.

     "ఆగు!" పులిపిల్లలా గర్జించింది.

     కారు ఇంజన్ ఆపకుండానే ఆమెకేసి చూశాడు ప్రసాంత్.

     ఆమె చేతిలో ఓ రాయి వుంది.

     ఆమె ముక్కు పుటాలు ఎగిరి పడుతున్నాయి.

     "పిచ్చివేషాలు వేయకు.

     నన్నింతదూరం తీసుకొచ్చి దిక్కు దివాణంలేని రోడ్డుమీద విడిచి పెట్టడానికి సిగ్గు లేదూ!"

    "సెంటిమెంట్లు, సిగ్గూ ఈ రెండూ నాకు లేవని ఈపాటికే నువ్వు తెలుసుకొని వుండాలి."

     "అది పశువులకి కూడా వుంటాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS