"నీఅందాన్ని గురించి. అన్నిటినీ శోధించటానికి, అన్వేషించడానికి, అటు తర్వాత ఆపరేషన్."
ఆమె తొడమీద చేత్తో కదిపాడు.
అప్పుడు చూసుకొంది పైకి చెదిరిన చీరని. గభాల్న చీరని కిందకి లాక్కుంది.
"ప్లీజ్ కారాపు."
"ఇంకా గెస్ట్ హౌస్ చాలా దూరం వుంది డియర్" రోడ్డుకేసి చూసింది విజయ. చాలా నిర్మానుష్యంగా వుంది.
"ముందు కారాపు స్టాపిట్" కోపంగా అంది విజయ.
కారు రోడ్డు పక్కగా తీసి ఆపాడు ప్రశాంత్.
ఆమె డోర్ తెరిచి కారు దిగబోతుంటే గబుక్కున ఆమె భుజాన్ని పట్టుకుని లాగాడు. ఆమె సీటులో అతని ఒడిలో పడింది. అలా పడుతుండగా తలకి స్టీరింగ్ తగిలింది.
గభాల్న ముందుకి వంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రశాంత్.
అతని చేతుల్లోంచి విదిలించుకుని కూర్చుని ఈడ్చి అతని చెంప పైన కొట్టింది విజయ.
ఆమె పెదిమలని కొరుక్కుంటూ,
"రాస్కెల్" అంది.
ప్రశాంత్ ఆ మాటని విననట్టుగా సిగరెట్ వెలిగించుకున్నాడు.
"ఇంత దూరం వచ్చాక ఈ మాటనడం చాలా పొరపాటు స్వీట్ హార్ట్. గప్ చిప్ గా స్నానం చేసేస్తే హాయిగావుంటుంది" అన్నాడు ప్రశాంత్.
ఆమాటలకి -
విజయ కళ్లు నిప్పులు కురిసాయి.
"పళ్లూడిపోతాయి. నోరెత్తకు.
నేను నీ అభిమానిని.
నీ గురించి నేను చాలా అసహ్యంగా విన్నాను. విని బాధకలగడం చేత అవన్నీ నిజమో కాదో తెలుసుకోవాలనే నేను నీ దగ్గరికి వచ్చాను. పూర్తిగా తెలుసుకున్నాను" ఈసడింపుగా అన్నది విజయ.
ప్రశాంత్ సిగరెట్ వెలిగించి నవ్వాడు.
ఆ నవ్వులో ఆమె తిట్టిందన్న బాధ లేదు.
ఓసి పిచ్చిముండ అన్నట్టు హేళన ధ్వనించే సరికి ఆమెకి ఉద్రేకం పెరిగిపోయింది.
ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి.
కళ్లల్లో రోషం.
ముక్కుమీద కోపం.
పెదిమల్ని బిగించి ఉద్రేకాన్ని అణచుకొంటానికి ప్రయత్నిస్తూనే వుంది.
ప్రశాంత్ చాలా మామూలుగా అన్నాడు.
"చాలా తక్కువ తెలుసుకున్నావు బేబీ, విషయాన్ని మనసులో పెట్టుకుని నాన్చడం నాకు నచ్చదు. కారుల్లో షికార్లు కొట్టడం, హోటళ్లకి, సినిమాలకి వెళ్లడం, పార్కుల్లో పబ్లిగ్గా జనందృష్టిలో పడడం, ఇలాంటివన్నీ నాకు అసహ్యం.
పైగా టైం వేస్ట్.
పని జలగాలే తప్ప, టైం పాడవకూడదు.
అది నా సిద్దాంతం.
అందుకనే ఇలా నీలా వచ్చే ఆడపిల్లల కేసుల్ని వెంటనే తెల్చేసుకొంటాను.
టైం వేస్ట్ చేయను.
"అది ఇద్దరికీ క్షేమం.
ఓ. కే. అంటే బెడ్ రూం. కాదు అంటే గెటవుట్.
అది పద్దతి.
వెంటపడి తిరగడం, మొహం వాచిపోవడం ఈ ప్రశాంత్ చరిత్రలో జరగదు. ఇష్టంలేని వాళ్లు కారు దిగిపోవడం పద్దతి.
నేను చెప్పకముందే నువ్వే కారు దిగిపోయావు.
నా కోసం, నన్ను చూడాలనీ ఇంత దూరం వచ్చావు కాబట్టి నీ ముచ్చటని తీర్చాలనుకొన్నాను. నేను కూడా మోజుపడ్డాను కనక ముచ్చటని తీర్చుకోవాలనుకున్నాను.
నీకు తెలుసో లేదో, నేను పిల్ల కాలవల దగ్గరనించి మహానదుల్లో స్నానం చేసిన పుణ్యాత్ముడిని.
నా అనుభవాన్ని రుచి చూసే యోగం, నా సరసాన్ని అనుభవించే అదృష్టం నీకు లేకపోయినందుకు నాకెంతో విచారంగా వుంది బేబీ!" అన్నాడు ప్రశాంత్.
"ఏడిశావ్!" ఎక్కడలేని ఉక్రోషంతో ఆమె ముక్కు పుటాలు ఎగిరిపడినయి.
"అభిమాని అంటే అర్దం తెలీని క్రూర్ వి నువ్వు.
నువ్వు రాసి ఏడ్చే బోడి రచనలని చదివి ఇన్స్పైర్ అయి కష్టపడి అభిమానంతో నీకు అభిమానులు ఉత్తరాలు రాస్తే వాటిని గొప్ప అవకాశంగా తీసుకొని ఎస్క్ ప్లాయిట్ చేస్తున్నావో నాకిప్పుడు అర్దం అయింది. "
"సో వాట్?"
కారులో కూర్చుని ఓ చేతిని బయటికి పెట్టి ఆమె గెడ్డం వేలితో చిటిక వేశాడు.
ఆమె విదిలించి కొట్టింది.
అతనికేసి అసహ్యంగా చూసింది విజయ.
