ఇంకా మంచు కురుస్తూనే వుంది... పూర్తిగా తెల్లవారనేలేదు. మెల్లగా కళ్ళు తెరిచాడు జేమ్స్... తనేక్కడున్నడో అర్ధం కాలేదు.
"నేను... నేను ఎక్కడున్నాను?" నీరసంగా తనలో తనే గొణుక్కున్నాడు... ఆ మాటలతో గోడకు చేరగలపడి నిద్రలోకి జారుకున్న మృదువని ఠక్కున కళ్ళు తెరిచింది.
"జేమ్స్!" అని పిలిచింది.
మృదువని వైపు ఆశ్చర్యంగా చూసి "మృదువనీ! మీరా?" అన్నాడు.
ఒక్కసారిగా ఆనందంతో గెంతులు వేయాలనిపించింది మృదువనికి.
జేమ్స్ సృహలోకి వచ్చాడు... అది చాలు తనకు.
"జేమ్స్! మీరు నన్ను గుర్తుపట్టారా?" ఉద్వేగంతో మరోసారి అడిగింది మృదువని.
మిమ్మల్ని గుర్తుపట్టాపోవడమేమిటి?" తలను రెండు చేతులతో పట్టుకుని అన్నాడు...
"ఆర్యూ అల్ రైట్ నౌ" అడిగింది మృదువని.
"అయాం అల్ రైట్. నేను... నేను ఇక్కడకి ఎలా వచ్చాను? మీరు... మీరు..." మెల్ల మెల్లగా అతనికి గుర్తుకు వచ్చింది.
"శరణ్యా! శరణ్య ఏమైంది జేమ్స్?" అతడ్ని పట్టి కుదుపుతూ అడిగింది మృదువని.
"అయా డిఫెన్స్ చీపే ఏదో చేసాడు. నా శరణ్యను వాడు ఏం చేసాడో?" జేమ్స్ గొంతులో విషాదం.
"అంటే శరణ్యను అరెస్టు చేసారా?" మృదువని భయంగా అడిగింది.
"అరెస్ట్ చేయలేదంటున్నాడు డిఫెన్స్ చీఫ్" చెప్పాడు జేమ్స్.
"మీరు డిఫెన్స్ చీఫ్ ను కలిసారా?"
జేమ్స్ కళ్ళు మూసుకున్నాడు.
"వెళ్ళాను. శరణ్య ప్రమాదంలో వుందని, ఆమె ఫోన్ టాప్ చేసారని, ఆమెను అరెస్ట్ చేయబోతున్నారని ముందు చెప్పింది నేనే. ఆ తరువాత శరణ్య ప్లాట్ కు వచ్చేసరికి ఆమె వెళ్ళిపోయింది.
నాకు డిఫెన్స్ చీఫ్ మీద అనిమానం వచ్చింది. ఏం చేయాలో తోచలేదు. వెంటనే డిఫెన్స్ చీఫ్ ఆఫీసుకు వెళ్ళాను. నన్ను తన సెక్యూరిటీతో గెంటించాడు. నేను అక్కడ్నుంచి కదలననీ, భీష్మించుక్కూచున్నాను.
ఓ అర్ధరాత్రివేళ గుండాలతో నన్ను ఎవరో కొట్టించారు. అది ఆ చీఫ్ పనే అయ్యుంటుందని అర్దమైంది. అయినా నేను భయ పడదల్చుకోలేదు. దాంతో నాకు కన్ ఫర్మ్ అయింది. శరణ్య ను చీఫే ఏదో చేసి ఉంటాడు.వెంటనే నేను స్థానిక ఫోలీసు స్టేషన్ లో కంప్లేయంట్ ఇచ్చాను.
ముందు ఫోలీసులు ఆ కంప్లెంట్ తీసుకోలేదు. నేను చాలా గొడవ చేశాను. ఆ తరువాత మొక్కుబడిగా కంప్లెయింట్ తీసుకుని డిఫెన్స్ చీఫ్ దగ్గరకు నన్ను తీసుకువెళ్ళారు.
అఫీషియల్ గా శరణ్య ను అరెస్ట్ చేసిన రికార్డ్ లేదు. ఏం చేయాల్లో తోచలేదు. ఎవర్నీ సంప్రదించాలో తెలియలేదు. తిరిగాను. పిచ్చివాడిలా తిరిగాను. శరణ్య లేకుండా బ్రతకలేకపోయాను. అప్పుడే తాగడం మొదలుపెట్టాను.నన్ను నేను మరచిపోవడానికి... కాదు... శరణ్యను అనుక్షణం గుర్తుకు తెచ్చుకోవడానికి"
"మీరు తాత్కాలికంగా శరణ్యను మరచిపోయి శాశ్వితంగా తనను కోల్పోతారా?"
"మృదువనిగారూ!"
"అవును! శరణ్య ఎక్కడుందో తెలుసుకోవాలంటే అసలేం జరిగిందో తెలియాలి. అప్పుడే మనం శరణ్యను కాపాడుకోగలం. నావల్ల ఇబ్బందులపాలైన శరణ్యను కాపాడ్డం నాభాద్యత" అంది మృదువని.
జేమ్స్ ఓ నిట్టూర్పు విడిచాడు.
"నాకు తెలిసి శరణ్యను డిఫెన్స్ చీఫే అరెస్టు చేసి ఉండాలి. ఈ విషయంలో నేను దీప్యూటీ చీఫ్ రంగనాథ్ గారిని కలుసుకున్నాను. అతను పాజిటివ్ గా రియాక్ట్ అయినా లాభం లేకపోయింది." చెప్పాడు జేమ్స్.
"ఏమిటి...మీరు దీప్యూటీ చీఫ్ రంగనాథ్ గారిని కలుసుకున్నారా?"
"అవును. అధారలేకుండాతానేమీ చేయలేనని చెప్పాడు" విచారంగా చెప్పాడు జేమ్స్.
మృదువని ఆలోచిస్తుంది. శరణ్యను కాపాడుకోవడం ఎలా?
"మృదువనిగారూ! శరణ్య ప్రాణాలతోనే ఉందంటారా?" అలా అమ్తుమ్న్నప్పుడు జేమ్స్ గొంతు వణికింది.
"అలా మాట్లాడకండి జేమ్స్. శరణ్య బ్రతికే వుంది. ఖచ్చితంగా బ్రతికే వుంటుంది" నాకోసం శరణ్యను ఎరగా వేసారు... మనసులో అనుకుంది మృదువని.
"ఇప్పుడేం చేద్దాంమంటారు?" జేమ్స్ అడిగాడు.
"ముందు మీరు కాస్త రిలాక్సవండి... మనం సిరక్షతమైన ప్రాతంలో వుండాలి."
"మా ఇంటికి వెళ్దామా?"
"వద్దు... డిఫెన్స్ చీఫ్ మిమ్మల్ని అనుమానించాడు. మీమీద అతను నిఘాపెట్టినా ఆశ్చర్యంలేదు."
"అయితే. ఎవరైనా ప్రెండింట్లో!"
"వద్దు... కొన్నిరోజులు ఎవ్వరికీ దొరక్కుండా ఉండటమే మంచిది" వాళ్ళు అలా మాట్లాడకుంటు ఉండగానే ఓ జీపు ఆ ఏరియాలోకి ప్రవేశించింది. మావుమ్దిగావుదల మీదుగా తలను కొద్దిగా పైకెత్తి చూసింది మృదువని.
ఆమె గుండె ఒక్కక్షణం కొట్టుకోవడం మేనేసిన ప్కీలిమ్గ్. ఆ జీపు షంషేర్ దాదాకు సంభందించింది. బ్లాక్ కలర్ జీపు, ఈ స్లమ్ ఏరియాలోకి కూడా వచ్చిందంటే తన గురించి అంగుళం అంగుళం గాలిస్తున్నరన్నమాట!
మృదువని మొహంలో కనిపిస్తున్న అమ్డైలన గమనించి అడిగాడు జేమ్స్ "ఏమైంది మృదువనిగారూ!"
'ష్! మాట్లాడొద్దు' అన్నట్టు సైగ చేసింది... రెండు నిముషాల తరువాత ఆ జీపు శబ్దం కనుమరుగైంది.
"జెమ్స్! పదండి... మనం మరో ప్రాంతానికి వెళ్దాం...ఈ క్షణం నుంచీ మన పరుగు పందెం మొదలవుతుంది. ఇరవై నాల్గుగ్గంటల్లో ఈ సమస్యకు ఓ పరిష్కారం ఆలోచిస్తాను" అంది మృదువని.
***
న్యూఢిల్లీ!
రైల్వేష్టేషన్!
అంకిత్, ప్రద్యుమ్న, రాహుల్, చేతన్ లు రైల్వేస్టేషన్ నుంచి బయటకు వచ్చారు.
