Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 38

    హ్యాండ్ బ్యాగ్ వూపుకుంటూ భస్మ వున్న ప్లాటు వైపు వేగంగా నడుస్తోంది.
    ఆమెకు గాలిలో తేలి పోతున్నట్లు వుండి. ఇది నిజమా? కళా అన్నా భ్రమలో వుండి.
    భస్మ ఫోన్ చేసి తనని పిలిచాడు. ఎవరైనా తానై అత పట్టిస్తున్నారేమోనన్న అనుమానం. కానీ అది భస్మ గంటే... నో డౌట్...
    భస్మ తనని పిలుస్తున్నాడు. కాదు పిలిచాడు. ఇట్నుంచి ఇటే డ్యూటీకి వెళ్ళాలి.
                                             ***
    డోర్ బెల్ ప్రెస్ చేసింది.
    డోర్ తెరుచుకుంది.
    ఎదురుగా భస్మ.
    చిర్నవ్వుతో... కానీ, అ నవ్వులో ఏదో కృత్రిమత్వం కనబడింది.
    అగర్వాల్ ఆదేశాల మేరకు అతని పెదవులు విచ్చుకున్నాయి.
    "భస్మా! ఇది నిజమా? ఒక్కసారి గిల్లు..." అంది.
    భస్మ మాట్లాడకుండా ప్రీజ్ దగ్గరకి వెళ్ళి ప్రిజ్ ఓపెన్ చేసి అందులో నుంచి కోక్ బాటిల్ తీశాడు.
    ఆల్రెడీ అందులో ఆల్కాహాల్ కూల్ డ్రింగ్ తో పాటు కనబడివుంది.
                                               ***
    "హెవిట్..." అన్నాడు ఆల్కహాల్ కలపబడి వున్న కూల డ్రింగ్ ను మౌన కిస్తూ.
    "థాంక్యూ భస్మా... బహుశా ఇది ఎయిట్ వండర్ అనుకుంటాను. అసలు నాకు నమ్మబుద్దెయడం లేదు." అంది ఆనందంగా కూల్ ద్రిమ్గ్ ని చెంపకు అన్చుకుంటూ.
    భస్మ చిరునవ్వు చిందిస్తూ చూశాడు ఆమెవైపు. కానీ మాట్లాడలేదు.
    "మాట్లాడవేంటి భస్మా... నన్ను ప్రేమగా పిలిచింది ఇలా కామ్ గా  వుండటానికేనా?"
    "కూల్ డ్రింగ్ తాగండి ముందు." భస్మ అన్నాడు.
    "నీ కోసం ఈ కూల్ డ్రింకే కాదు, విషమైన తాగుతాను" అంది మౌన.
     ఒక్కక్షణం కలవరపాటు భస్మలో.
    మనసు పొరల్లో ఏదో కదలిక.
    "నీ కోసం వుశామైనా తాగుతాను..." ఆ మాటలు అతని మేడ్సడులో రిజిస్టర్ అయిపోయాయి.
    "తన ఆమెను మోసం చేస్తూన్నననే గిల్టీ ఫీలింగ్..." అతనిలో ఏదో అంతర్ ఘర్షణ.
    "ఏంటీ... నువ్విచ్చిన కూల్ డ్రింగ్ తాగలేదని కోపమా?" అంటూ స్ట్రా తో కూల్ డ్రింగ్ తాగబోతుండగా, ఒక్కసారిగా ముందుకు వచ్చి ఆమె చేతిలోని కూల్  డ్రింగ్ బాటిల్ లాక్కుని నేలకేసి కొట్టాడు.
    అ చర్యతో విస్మయంగా భస్మ వైపు చూసుంది మౌన.
    మౌనాను అన్మానం పాలు చేయాలని ఖాన్, కరంజయ అనడం అతని మెదడు గ్రహించింది. అతనిలోని మంచితనం మెల్లి మెల్లిగా రియాక్టువుతోంది.
    "వాట్ హ్యాపెమ్ద్ భస్మా..." అడిగింది అందోళనగా.
    "అందులో ఆల్కహాల్ వుండి..." తాపీగా చెప్పాడు భస్మ.
    "అ..ల్క..హ..లా? ఎందుకు..." అడిగింది ఆశ్చర్యపోతూ. మరుక్షణమే ఆమె మెదడులో ప్లాష్ అయింది.
    తనని.. తనని సస్పెండ్ చేయించాటానికి...
    డ్యూటీ కి వెళ్ళిన తనని బ్లో టెస్ట్ చేయించి ....
    మైగాడ్... వూహించడానికే భయం వేసింది మౌనకు.
    భస్మ వైపు చూసింది మౌన. అతని కళ్ళలో ఏ భావమూ కనిపించకపోయినా, అతని మనసులో ప్రేమ అర్దమవుంతుంది.
    "భ..స్మా.. ఐ.. లవ్..యు..." అతన్ని వాటేసుకుని అతని పెదవుల మీద ముద్దు పెట్టి అంది.
    కంపనం.. ప్రకంపనమై... వేనవేల భూకంపాలను మనసులో సృష్టించబడిన ఫీలింగ్... ఆ కౌగిలి... ఆ స్పర్శ... అతనికి గమ్మత్తుగా వుండి. అదావులావుమ్ది. తనకేమో జరగబోతోంది.. అని తెలుస్తూనే వుంది. ఆమె దూరం జరిగాడు భస్మ.
    భస్మా... నీలో అంతర్ఘర్ష్ణణమొదలైంది. నువ్వు నన్ను గాధంగా ప్రేమించావు. ఇంతకన్నా గాఢంగా నిన్ను ప్రమిమ్చే అమ్మా వుండి, నన్న వున్నాడు... నాతో వస్తావా?" అడిగింది మెరిసే కళ్ళతో మౌన.
    ఒక్కక్షణం సందిగ్దం.
    "చెప్పు భస్మా... నాతో రాగలవా?" అతని చేతిని తన చెంపలకు అన్చుకుంటూ అంది.
    తనకి తెలియని కొత్త ప్రపంచం అది.
    ఆమె స్పర్శ, ఆమె మాటలు... అతనికి మంత్రాక్షరాల్లా వినిపిస్తున్నాయి.
    ఒక్కక్షణం ఆగి తలూపాడు అలాగేనన్నట్టు.
    'థాంక్యూ భస్మా... ఈ రోజు ఈ హేపీ అకేషన్ పురస్కరించుకుని, నేను నీతోనే స్పెండ్ చేత్సాను...' మనసులో అనుకుంది మౌన.
    అవసరమైతే భస్మ కోసం ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా సిద్దంగా వుండి మౌన.
    ప్రేమకు పునాది ప్రేమే.
                                               ***
    "షిట్.. సమ్ థింగ్ ఈజ్ రాంగ్... ఏదో రాంగ్ జరుగుతోంది..." నుడురూ కొట్టుకుంటూ అన్నాడు అగర్వాల్.
    ఖాన్ అయోమయంగా చూసాడు.
    "ఏమైంది?" కరంజయా దిగాడు.
    "భస్మ మన సజెషన్స్ సరిగ్గా ఫాలో అవ్వడంలేదు. స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కూల్ డ్రింక్ మౌన కు ఇచ్చి ఆ తర్వాత, ఆమె చేతిలో నుంచి లాక్కొని నేలకేసి కొట్టాడు."
    "ఎందుకలా జరిగింది?' ఖాన్ అడిగాడు.
    అతని మనసు పొరల్లో ఏదో కదలిక.
    అతని ప్రేమ.. ఆమె మాటలు... ఆమె స్పర్శ... అతనిలో నిద్ర పోతున్న మనసును, స్తబ్దుగా వుండి కేవలం మన మాటలు మాత్రమే విమ్తొన్న మెదడును కదలించి లేపాయి. అతను మెల్లి మెల్లిగా ఆలోచన జ్ఞానాన్ని పెంచుకుంటున్నాడు. అమనం ఏ మాత్రం ఆలస్యం చేసినా అతను మన చేజారిపోయే అవకాశం వుంది ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS