Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 38

 

        కవిరాజు కంఠంబు కౌఁగిలించెను గదా!
            పురవీధి నేదురెండ పొగడదండ
        ఆంధ్రనైషధకర్త యంఘ్రియుగ్మంబునఁ
            దగిలి యుండెను గదా నిగళ యుగము
        వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత
            వియ్యంమందేనుగదా వెదురు గోడియ
        సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా
            నగరి వాకిట నుండు నల్లగుండు
    
    గీ. కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
        బిలబిలాక్షులు తినిపోయేఁ దిలలు పెసలు
        బొడ్డువల్లెను గొడ్డేఱి మోసపోతి
        నెట్టు చెల్లింతుఁ డంకంబు లేడు నూర్లు        369

    అవసాన కాలమున శ్రీనాధ మహాకవి సార్వభౌముఁడు చెప్పి కొన్న పద్యము.
    
    సీ. కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి
            రత్నాంబరంబు లేరాయఁ డిచ్చు?
        రంభఁగూడెఁ దేనుంగురాయరాహుత్తుండు
            కస్తూరి కేరాజుఁ బ్రస్టుతింతు?
        స్వర్గస్థూఁడయ్యె విస్సనమంత్రి మఱి హేమ
            పాత్రాన్న మెవ్వని పంక్తిఁ గలదు?
        కైలాసగిరిఁ బండే మైలారువిభుఁ డేఁగి
            దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు?

    గీ. భాస్కరుఁడు మున్నె దేవుని పాలి కరిగేఁ
        గలియుగంబున నిఁక నుండఁ గష్టమనుచు
        దివిజకవివరుగుండియల్ దిగ్గు రనఁగఁ
        నరుగుచున్నాఁడు శ్రీనాధుఁ డమరవురికి.    370
    
    శ్రీనాధ కవి సార్వభౌముడు కర్ణాటధీశ్వరుఁడగు ప్రౌడ దేవరాయల దర్శింపఁబోయినప్పుడు చెప్పిన పద్యము లీ క్రిందివి క్రొత్తగాఁ జేకూరినవి. దేవరాయల యస్తానమున ధర్మాదికారిగా ముమ్మకవి యనుపేరి విద్వత్కవి యుండేనట! ముందుగా శ్రీనాధుఁ దాకవీశ్వరుని దర్శించి యీ క్రింది పద్యములు చెప్పెనాట!

    సీ||  పంపావిరూపాక్ష బహూజటాజూటికా
            రాగ్వధ ప్రసవ సౌరభ్యములకు
        తుంగభద్రా సముత్తుంగ వీచీఘటా
            గంభీరఘుమఘుమారంభములకు
        కళసాపురప్రాంత కదళీవనంతర
            ద్రాక్షాలతాఫల స్తబకములకు
        కర్ణాటకామినీకర్ణ హాటకరత్న
            తాటంకయుగ ధాళధళ్యము లకు
    
    గీ||  నిర్నిబంధనిబంధమై నెనయుకవిత
        తెలుఁగునను సంస్కృతంబునఁ బలుకనేర్తు
        ప్రౌడదేవేంద్రరాయ భూపాలవరుని    
        సమ్ముఖంబున దయఁజూడు ముమ్మసుకవి!    371

    చ|| తరుపున గాండీవం బిడఁడే ధర్మజునానఁ గిరీటి యేను వా
        క్సరసిజనేత్రయానతి విచారము చొప్పున గర్వహీనత
        మరలి తెలుంగువ్హూమి కసమానగతిం గొనిపోవు వాఁడనై
        బిరుదులు నారివాఁగుకడఁ బెట్టితి సత్కవిసార్వభౌముఁడ      372

    ముమ్మ కవి యెడ నీవిధముగా నార్జవము నెఱపెను. పిదప రాయల సందర్శన మునకు జాగగుచుండఁగా రాయల కిట్లు వార్త పంపెను :-

    సీ|| డంబు సూపి ధరాతలంబు పైఁ దిరుగాడు
            కవిమీఁదఁ గాని నాకవచ (?) మేయ
        దుష్ప్రయోగంబుల దొరకొని చెప్పేడు
            కవిశిరస్సునఁగాని విద్యల నేర్చు
        కవులఱొమ్ములు గాని కాల్చి విడువ
            చదివి చెప్పఁగ నేర్చి సభయందు విలసిల్లు
        కవినోరుఁగాని ప్రక్కలుగఁ దన్న

    గీ|| దంటకవులకు బలువైన యింటిమగఁడఁ
        గవులవాదంబు విన వేడ్క గల్గెనేని
        నన్నుఁ బిలిపింపు మాస్థానసన్నిధికిని
        లక్షణొపెంద్ర ! ప్రౌడిరాయక్షి తీంద్ర!        373

    రాయల సమదర్శనము సమకూరెను. డిండిమభట్టు ప్రత్యర్ధి పండితుఁడుగా నేర్పడెను. బాలను యువతినిఁ బ్రౌడను లోలను గూర్చి రాజు నాల్గుసీస పద్యములు చెప్పఁగోరెను. శ్రీనాధుఁడు చెప్పెను. అందొకటి:-

    సీ|| కమనీయాకర వల్లవము మేను గదియంగ
            నొయ్యన చాఁచిన నులికిపడును
        ఆలింగనమునకు నక్కునఁ జేర్చినఁ
            జేదోయి యురముపైఁ జేర్చి కొనుచు
        చుంబనమ్మున కొష్టబింబంబు గమకింప
            వదన మొయ్య నొకింత పంచుకొనుచు
        గిలిగింత సేఁతకుఁ గినుకయు సిగ్గును
            మొలవంగఁ గన్నులు మోడ్చుకొనును
    
    గీ||  అట్టిబాల రతిక్రీడ ననువుపఱువ
        నేర్పుగల్గునె పరులకు నీకుఁగాక
        రాజవరమేశ! రాజదిరాజవిభవ!
        లక్షణోపేంద్ర! ప్రౌడరాయక్షితీంద్ర!        374

    డిండిమభట్టారకునితోడి వివాద మీనందర్భమందలిది. ప్రత్యర్ధిని జయించిన పిదప శ్రీనాధుఁడు చెప్పినపద్యము లివి చెకూఱినవి.

    మ|| జననాధోత్తమ! దేవరాయనృవతీ! చక్రేశ! శ్రీవత్సలాం
        ఛనసంకాశ! మహాప్రభావ! హరిరక్షాదక్ష! నాబోఁటికీ
        గునృవస్తోత్రసముద్భవం బయినవాగ్దోషంబు శాంతంబుగాఁ
        గనకస్నానము చేసి కాక పొగడంగా శక్యమే దేవర.      375

    కనక స్నానమహోత్సవము జరగినది.

    శా||    జోటీ! భారతి! యార్భటి మెఱయుమీ! చోద్యంబుగా నేను గ
        ర్ణాటాదీశ్వరుఁ బ్రౌడదేవనృవతి  నాసీరధాటీచమూ
        కోటీ ఘోటకధట్టికా ఘుర పుటీకుట్టాక సంఘట్టన
        స్పోటీ ధూతధరారజశ్చుళుకితాంభోటి బ్రశంసించెద.     376

        ఇత్యాది పద్యముల దేవరాయలను స్తుతింఛినాఁడు.

                              భృంగపంచకము
                              ఇది శ్రీనాధ కృతి యందురు.

    సౌందర్యశాలిని యగు నొకనరపాలునిదేవేరి యమాత్యునకుఁ జనవు వడి యుండెను. ఒకప్పుడా భూపతి కార్యవశమున స్థలాంతరమున కరుగుడు నామంత్రి యంతిపురమునఁ జేరుకొని రాజమహిషితోఁ గేరింత లాడుచుండెను. పుడమిఱేఁడును నాఁటి రేయికే మరలఁ దిరిగి వచ్చుటయుఁ గొటలోనికి వచ్చిన తోడన కవాటము లెల్ల బంధింపఁబడుటయు నెఱిఁగి దూతికయొక ర్తీవృత్తాంత మమాత్యునకుఁ దెలిపి దాఁకొనుటకు భృంగపదేశమునఁ జెప్పినది.

    ఉ|| మాయురే! భృంగమా! వికచమల్లికల  విడనాడి తమ్మిలో
        నీయెడఁ బూవుఁదేనియల నింపుజనింపఁగఁ గ్రోలి సొక్కియు
        బోయెద నన్న భ్రాంతి నినుఁ బొందురు రా జుదయించే నిప్పుడీ
        తోయజవత్రముల్ వరుసతో ముకుళించెఁ జలింపకుండుమా!    377


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS