Previous Page Next Page 
మహావృక్షం పేజి 37

"ఇంత వేదాంతం ఎక్కడ అలవాటు చేసుకున్నావు?"
"జీవితాన్నుంచి..." నవ్వింది.
మణి కోపంగా చూసింది. "చాల్లే ఆ నవ్వొకటి... ఇట్లా సమాజ సేవ చేసుకుంటూ బతికేస్తావా? ఏం సాధించావు దీనివలన... అంత సాయ చేశావు. మృదుల ఏం చేసిందాఖరికి?"
"ఒకపిల్ల ఏదో స్వార్దంతో ప్రవర్తించిందని, ఆమెనే ఎగ్జాంపుల్ గా తీసుకుని అందర్నీ నిందించడం బాగాలేదు మణీ! చూడూవాళ్ళు కష్టంలో వున్నప్పుడు మానవత ధర్మంగా సాయం చేశాను.... అలాగని వాళ్ళ  జీవితాన్ని శాపింఛలేంకదా! వాళ్ళు మంచి జీవితం వెతుకుంటూ వెళితే కాదనడానికి నేనెవర్ని? సాయం చేశాను కదా! అని నువ్విలా చేయద్దు.... ఇలాగే చేయాలి, ఇలాగే బతకాలి అని శాసించే అధికారం మనకేక్కడుంది? అది నిరంకుళం కదా!"
"నువ్వు చెప్పేది నిజమే అనూ! కానీ, ఇదే లోకంగా బతకద్డంటున్నాను. అ కుర్రాడేవరో ఇష్టపడ్డాట. ఎందుకు కాదంటున్నావు?"
"ఓహొ! వీణ పంపించిందా నిన్ను..." అప్పుడర్డంమైనట్లుగా అడిగింది.
"అదంతా నీకవసరం. నేను చెప్పినట్లు విని ఈ పల్లికి ఒప్పుకో. పెద్దదాన్ని చెబుతున్నా  విను..."
అనూష ఆమె వైపు ప్రమగా చూసింది.
హమ్మయ్య.... మణి మామూలు మనిషైంది చాలు... ఈమెనీ స్టితిలో రచ్చగోట్టకూడదు అనుకుంది, చిరునవ్వుతో అంది.
"కొంచెం ఆలోచించుకోనీ చెప్తాను... అవెస పడకుండా పడుకో. చూడు టైంరెండావుతోంది."
మణి మోహం వికసించింది.
"నిజంగానా?"
"నిజం"
"ప్రామిస్..."
"నీకు నమ్మకం వుంటే  ప్రామిస్."
"హమ్మయ్య.... నాకున్న బాద్యత తీరింది. ఇంకా నేనేమైపోయినా ఫర్వాలేదు" మణి నిశ్చంతగా కళ్ళు మూసుకుంది.
"ఏం మాటలని? ఇంకెప్పుడూ అలా మాట్లాడకు" వణికే స్వరంతో అన్నది అనూష.
"పిచ్చిదానా! ఈ మాత్రానికే ఎందుకలా బాధపడతావు?" మణి అనూష వైపు తిరిగి ఆమె వీపుమీదనుంచి చేయి చుట్టుకుని పడుకుంది.
అనూష కూడా కళ్ళు మూసుకుంది.... ఏంటి వీళ్ళంతా సామూహికంగా తన పెళ్ళిమీద పడ్డారు. ఇదేదో ఉద్యమంలా చేస్తోంది వీణ. రేపు క్లాస్ తీసుకోవాలి.... అనవసరంగా మనికి ఇలాంటి విషయాలు చెప్పి టెన్షన్ పెట్టద్దని.
 కాసీపటికి ఇద్దారూ నిద్రపోయారు.
అనూషకి హాఠాత్తుగా మెలకువ వచ్చింది. సన్నగా మూలుగు విన్పిస్తోంది. అనూషకి కొన్ని క్షణాలు ఏం అర్ధంకాలేదు. చుట్తో చూసింది. మణి మూలుగుతోంది. ఖంగారుగా పిల్చింది. "మణీ!"
"ఊ..." బలవంతంగా మూలిగింది.
"ఏంటి? ఏమైంది?"
"నొప్పి..." గోటు పెగాల్చుకుని నెమ్మదిగా చెప్పింది మణి.
"ఎక్కడ?"
మణి చేయి కొద్దిగా కదిలింది. కానీ, పైకిఎత్తలేకపోయింది.... అనూష గారాభంగా లేచి, లైటు వేసింది. మణి దగ్గరకు నడిచి, పల్స్ చూసింది. అమ౬త ఏ.సి.లో కూడా మణి ఒళ్లంతా చెమటకి చల్లగా అయిపోయింది. మణి గుండెమీద పరీక్షచేస్తూ "ఎక్కడ నొప్పి చెప్పగలవా?" అడిగింది.
"గు... గుండెలో... ఊ..." నొప్పికి బాదాగా అరిచింది.
"మైగాడ్!" ఆ ప్రయత్నంగా అనేసింది అనూష.
"ఎటు పక్క... ఇక్కాడా? ఇక్కడా?" అంటూ చేత్తో మృదువుగా రాస్తూ అడిగింది.
"ఎడం పక్క... వెనకాల వీపులోదాకా వస్తోంది. సూ...సూదులతో సూదులతోగుచ్చుతున్నట్టుగా వుంది... ఆయాసంగా వుంది. అనూ... నేను.. నే.. ను.. చచ్చి పోతానా? నాపిల్లలు కావాలి."
"మణి! ఏం కాదు. ఖంగారుపడకు."
అనూష ఆలస్యం చేయకుండా లేచి, తలుపులు తీసింది. మణిని జాగ్రత్తగా లేపి, పట్టుకుని నడిపించుకుంటూ హాల్లోకి తీసుకొచ్చింది... సోఫాలో కూర్చోపెట్టి, అక్కడే ఓ మూల గాధంగా నిద్రపోతున్న రాజుని లేపింది. వాడు నిద్రకళ్ళతో లేచి, మణి వాలకం,అనిఇష ఖంగారు చూసి. "ఏమైందమ్మా?" అడిగాడు.
"ముందు తలుపులు, కిటికీలు అనీ తెరిచినా" అన్నది.
వాడు వెళ్ళి అన్ని కిటికీలు, తలుపులు తెరిచాడు.... చల్లగాలి వీచింది.
"నువ్విక్కడ కూర్చుని అమ్మని పట్టుకో" అంటూ వాడిని మణి పక్కన కూర్చోమని  చెప్పి, లోపలికి వెళ్ళింది. రెండు నిమిషాల్లో చేతితో మాత్రతో తిరిగివచ్చి, "మణీ! ఇదిగో ఈ టాబ్లెట్ నాలుక కింద పెట్టుకో." అన్నది.
మణి టాబ్లెట్ కోసం కొద్దిగా నోరు తెరిచి, నాలుక పైకిత్తింది. అనూష టాబ్లెట్ నాలుకకింద పెట్టింది. రాజుని పంపించి లోపల్నించి బి.సి. ఆపరేటస్ తెప్పించి బి.ఫై.చెక్ చేసింది.
"మైగాడ్! బి.పి సడన్గా పెరిగింది. టెన్షన్ వద్దంటే వినవు. అన్ని విషయాలూ నీలెండుకూ? పిచ్చిదానిలా సెంట్ మెంటల్ గా బతికితే ఎట్లా? కొంచెం మేతీరియలిస్ట్ క్ గా బతకడం అలవాటు చేసుకోవాలి. కాలంతో పాటు మనమూ మారాలి. పిల్లల గురించి టెన్షన్, నా గురించి టెన్షన్ ఎందుకు?" నీరు చిలకరింస్తున్నట్టుగా చిరు, చిరు మందలింపులతో చిన్న చిన్న పరీక్షలు చేసింది.
కొంచెంసేపటికి చల్లగాలికి మణికి చెమట పట్టటం తగ్గింది. కొంచెం రిలాక్స్ డ్ గా కదిలింది.
"ఏ.సి.లో పడుకున్నా అంత చెమట పట్టిందంటే... ఛ... చాల పొరపాటైంది. నిన్నలా వదిలేయడం" అనూష సణుగుతూ మణి నుదుట చెమటతుడిచింది.
నీకు చాలా శ్రమ ఇస్తున్నాను కదూ! ఆమని బాధగా చూసింది.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS