అతని చేయి ఆమె భుజం మీదనించి వీపుమీదకి పాకింది.
ఆమె కొంచెం ముందుకి జరిగింది.
ఆమెని మాటల్లో పెట్టి ఆమెలో నిక్షిప్తమై వున్న శిఖరాలని, లోయలని, ఎత్తు పల్లాలని, తడివి చూడడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఏమాత్రం అభ్యంతరం పెట్టకపోయినా ఆమెలో దాగివున్న జలపాతంలో స్నానం చేయాలని ఉవ్విళ్లూరి పోతున్నాడు.
"అంత పవెద్ద రైటర్ వి. నీకు చెప్పడమేమిటి? నీకు తెలీదా?"
"నచ్చితేనే కదా ఇష్టపడేది!"
ఆమె నవ్వింది.
అప్పుడు చూశాడు తళుక్కుమన్న పలువరసని.
"చూడు విజయ, రైటర్ని అయినంత మాత్రం చేత అన్నీ తెలియాలని లేదు. నువ్వు నేర్పితే నేర్చుకోవాల్సినది కూడా చాలా వుండచ్చు!"
అతని చేయి ఆమె నడుం మీదకి జారి చుట్టూ తిరిగి పాములా పొట్టమీదకి పోయింది.
నున్నని పొట్టమీద నడుం పక్కగా పడిన ముడతని సవరదీస్తున్నాడు ప్రశాంత్.
విజయ మెల్లగా అతని చేతిమీద చేతిని వేసి కదలకుండా పట్టుకొంది.
అతను అడ్వాన్స్ కావడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని ఆమెకి అర్దం అయిపోయింది.
"స్టీరింగ్ ని ఓ చేత్తో పట్టుకుంటే సరిపోదు. గేర్ లో మార్చడానికి రెండో చేయి కూడా స్టీరింగ్ ని పట్టుకుని వుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు"
నవ్వుతూనే అతని చేతిని తోసేసి తిరిగి అతని చేతిని స్టీరింగ్ మీద వుంచింది విజయ.
కారు స్లో చేసి సిగరెట్ వెలిగించాడు ప్రశాంత్. అతని పెదాల మధ్య సిగరెట్ పొగలు కక్కుతూ వెలుగుతోంది.
"విజయ!"
"ఏమిటి?"
"నువ్వీరోజు వెళ్లక తప్పదు?"
"అంకుల్ తో వెళ్లిపోవాలి."
"మధ్య ఈ అంకుల్ ఎందుకొచ్చినట్టు?"
"ఇది మరీ బాగుంది. ఆయన రాబట్టే కదా నేను వచ్చాను."
ప్రశాంత్ చేతిని ఆమె తొడమీద వేశాడు. నున్నగా ఆమె కట్టుకున్న సిల్క్ చీరకింద తొడ అతని చేతికి ఎంతో సుఖాన్నిస్తోంది.
చేత్తో రాస్తున్నాడు.
"నా కోసం వచ్చేవాళ్లిలా అంకుల్స్ తోనూ, ఆంటీలతోనూ రావడం నాకు బాగోదు."
"బాగోదంటే ఎలా? అసలు అవకాశం రావటమే గొప్ప. నిన్నో మాట అడగనా?"
"అడుగు"
"నామీద నీ అభిప్రాయం ఏమిటి?"అడిగింది విజయ.
ప్రశాంత్ తల తిప్పి ఓసారి ఆమె మొహంలోకి చూసి,
"ఆడపిల్లవి" అన్నాడు.
ఆమె బుంగమూతి పెట్టింది.
"వెన్నెల్లో ఆడపిల్లో, చీకట్లో ఆడపిల్లో చెప్పచ్చుగా!"
"నేనలా చెప్పను"
"ఎందుకని? నేను అందంగా లేనా?" అడిగింది విజయ. ఆ తొడమీద గట్టిగా చేత్తో అదిమాడు.
ఆ స్పర్శకే అతనికి మత్తెక్కిపోతోంది.
"నీ కళ్లల్లో మెరుపుని, చెంపల్లో నునుపుని, పెదవుల్లో తీయదనాన్ని, గుండెల ఎత్తు పల్లాలని, లోయలని, గుట్టలని, మెట్టలని, శిఖరాలనీ, జలపాతాలనీ, సముద్రాలనీ, నిధి నిక్షేపాలను క్షేదించి, అన్వేషించి, పరీక్షించి అనుభవాన్ని పొందిన తర్వాత కదాచెప్పాల్సింది. దానికోసం నేను ఎంత తపస్సు చేయాలో తెలుసా?"
"ఛీ! అన్నీ కొంటె మాటలు.
ఆడపిల్ల అందాన్ని చూడగానే చెప్పచ్చు."
"తాకి, శోధించకుండా, శ్రమించకుండానేను చెప్పలేను. నీకు తెలీదు కదూ! నేను ఆడపిల్ల అందం గురించి పడక గదిలో మాత్రమే చెప్పగలను."
విజయ అతని మాటలకి ఉలిక్కిపడింది.
"ఐమీన్ ... అంటే?" అంది.
అప్పటికే ఆమె చెక్కిళ్లు ఎర్రబడిపోయినయి.
ముక్కుమీద చిరుచెమట పోసింది.
"నీ అందం ఎంత గొప్పదో చెప్పడానికి తీసుకెళ్తున్నాను" అన్నాడు.
అప్పటివరకూ ఆమె గమనించలేదు.
ఆమె కాలి పిక్కలమీదనించి చీర మొకాలివరకూ పైకి జరిగింది.
కారు సిటీ పొలిమేరల్ని దాటి నేషనల్ హైవేలో పోతున్నట్టు విజయ గ్రహించింది.
"నీ కుటీరం చూపిస్తానని ఇటెక్కడికి తీసుకెళ్తున్నావు"
"గెస్ట్ హౌస్ కి."
"దేనికి?"
ఆమె గుండెలు ఎగిరిపడుతున్నాయి. కోపం వస్తోంది అతనలా అర్దం కాకుండా మాట్లాడుతుంటే!
"ఇన్ వెస్టిగేషన్ కోసం!"
"ఇన్వెస్టిగేషనా! దేన్ని గురించి?"
