Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 37

        "సారీ సార్... సారీ ఫర్ డ ఇన్ కన్వేనియన్స్... మా రొటిన్ చెకప్ సాధ్యమయినంత పోలయిట్ గా చెప్పాడు. వర్మ లోపలకు నడిచాడు. అక్కడ బందో బస్తు చూసి షాక్ తిన్నాడు వర్మ... ప్రిమినిష్టార్ కు కూడా ఇలాంటి బందో బస్తు ఉంటుందా? అన్నా డౌటు వచ్చింది.

    ఆ భవనంలో ప్రతీ అంగుళానికీ పర్యవేక్షణ ఉందని అర్దమయింది.

                                                                         ***


    విశాలమైన ఆ హాలులో రెండు కుర్చీలు వున్నాయంటే... సావుపాలు, టీపాయ్,టేబుల్ ఏ వస్తువూ లేదు. హాలుకు నాలుగువైపులా వీడియో కేమెరాలు ఉన్నాయి... అక్కడ కూడా కన్నాలు, ఆ కన్నాల్లోనుంచి తుఫకీ మొనలు కనిపిస్తున్నాయి.


    "వేల్ కమ్ ...వేల్ కమ్ మిష్టర్ వర్మా" అన్నా మాటలు ఆ హాలులో వున్నస్పీకర్ లో నుంచి వినిపించాయి. ఆ హాలులో ఓ వైపు వున్న గోడ రెండుగా చీలింది. వర్మకు జేమ్స్ బాండ్ పిక్చర్స్ గుర్తుకువచ్చాయి.
   
                                                ***
    వర్మ మొదటిసారిగా ఓ మాఫియా డాన్ ని చూసాడు... అదీ ప్రత్యక్షంగా డిఫెన్స్ చీఫ్ గా ఎందరో కరడు గట్టిన తీవ్రవాదులను, విదేశీ గూఢచారులనుచూసాడు.... కానీ ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో వున్న షంషేర్ దాదాని తను ఇప్పుడు కలుసుకున్నాడు.


    యాబై అయిదు, అరవైకి మధ్య వుంటుంది వయసు... ఒక బిజినెస్ మాన్ లా ఉన్నడేతప్ప కారుడు గట్టిన డాన్ లా  అనిపించలేదు... పుల్ సూట్  లో వున్నాడు క్కూడా చిక్కని నా ఆచూకీ, మీ పోలీసులకు కూడా దొరకని నా ఆడ్రస్ ఒకేసారి ఇంత సింపుల్ గా దొరికిందని... మిమ్మల్ని అన్ని కోణాల నుంచి అబ్జర్వ్ చేసేకే మీకీ అపాయింట్ మెంట్ లభించింది... మీ ప్రతీ కదలికా రికార్డు చేస్తూనే ఉంటాం...బైదిబై గ్లాడ్ టు మీట్ టు యు" అంటూ చేయి సాచాడు...


    వర్మ అతనికి షేక్ హ్యండ్ ఇచ్చాడు... సామ్యూల్ చేతులు కట్టుకుని నిలబడ్డాడు.


    "కూచోండి..." అంటూ చెయిర్ ఆఫర్ చేశాడు. వర్మ ఓ కుర్చీలో కూర్చున్నాడు... షంషేర్ దాదా మరో కోర్చీలో కూర్చున్నాడు. సామ్యూల్ నేతలు కట్టుకుని నిలబడ్డాడు.


    "చెప్పండి మిస్టర్ వర్మా!" అన్నాడు షంషేర్ దాదా. ఈ లోగా అక్కడ చిన్న చీఫ్ వినిపించింది... సామ్యూల్ బయటకు వెళ్ళి రెండు నిముషాల్లో రెండు గ్లాసుల్లో స్కాచ్ తెచ్చాడు... ట్రేలో చికేంసిక్స్తి ఫైవ్ ముక్కలున్నాయి.


    "హ్యవిట్" అన్నాడు షంషేర్ దాదా.


    "నాకు వర్క్ ముఖ్యం మినిష్టర్ దాదా... నేను చెప్పిన పని ఇంతవరకూ మీరు పూర్తీ చేయలేదు"వర్మ నిష్టూరంగా అన్నాడు.


    "అఫ్ కోర్స్ఆ పని మీదే మావాళ్ళంతా ఉన్నారు... మాములుగా ఇలాంటి డీల్ నేను ఒప్పుకోను.. కేవలం ఓ అమ్మాయిని చంపే డీల్ ఇది. మీకు తెలుసు... నేను ఆడవాళ్ళను హత్య చేసే డీల్ ఒప్పుకోను... అయినా ఇది ఆబ్లిగేషన్ తో చేస్తున్నా పని... ఆ అమ్మాయి హైదరాబాదు నుంచి డీల్లి వచ్చింది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని ట్రేస్ అవుట్  చేస్తాం... అయినా తనకేమి తెలియదని చెబుతోంది... ఆమెను అనఫిషయాల్ గా మా కస్టడీ లోకి తీసుకోవడం మాకు హేడ్డేక్ గానే వుంది.... ఆమెను ఫినిష చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నాను..."


    "అలాంటి పూలిష్  పని చేయకండి... అప్పుడు కేసు మరింత కాంప్లికేషన్ అవుతూంది. వితిన్ ట్వంటీఫోర్ అవర్స్ లో మృదువని ట్రేస్ చేస్తే చేస్తాను... మీరిక నిశ్చంతగా  వెళ్ళొచ్చు."


    "ఆ మృదువని మనం ఎంత త్వరగా ట్రేస్ చేస్తే అంత మంచిది... మృదువని చేయడంకన్నా ముఖ్యమైనది ఆమెను ఫినిష చేయడమే..." వర్మ చెప్పాడు.


    "చెప్పానుగా. మీరు టెన్షన్ పడకండి. మృదువని ట్రేస్ చేసి ముందు ఆమె నుంచి ఆ ప్లాపీ సంపాదించాలి. అది కదా ముఖ్యం..." వర్మ మొహంలోకి చూస్తూ అన్నాడు షంషేర్ దాదా.


    డిఫెన్స్ చీఫ్ ముఖం పలిపావుయిమ్ది.


    "అవునవును..." అన్నాడు తడబాటుగా.


    "మృదువనిని ట్రేస్ చేసి ఆ ప్లాపీ ఎక్కడుందో తెలుసుకుంటాం. అలా వీలు కాకపోతే ఆ అమ్మాయిని ఫోనిష్ చేసే పద్దతిలో వెళ్దాం. అన్నట్టు మృదువనిఇంటి చుట్టూ నిఘా పెట్టారా?" అడిగాడు షంషేర్ దాదా.


    "ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు... మృదువని ఆ ఇంటికి వెళ్ళలేదు."


    "సరే! మీరిక బయల్దేరండీ..." చెప్పాడు షంషేర్ దాదా.


    "దాదా! పని త్వరగా పూర్తవ్వాలి. హోం మినిష్టర్ తో ప్రబ్లంగా వుంది...


    డిఫెన్స్ డిప్యూటీ చీఫ్ రంగనాథ తో కూడా ప్రాబ్లం అయ్యేలా వుంది.... అతనికి మృదువని మీద సాప్ట్ కార్నర్ వుంది."


    "ఆ విషయం  నేను చూసుకుంటాను" షంషేర్ దాదా చెప్పాడు.


    వర్మ లేచి "సామ్యూల్ సర్" అన్నాడు.


    "సామ్యూల్ రాడు ...రాలేడు" చెప్పాడు తాపీగా షంషేర్ ఖాన్....


    "ఏమిటి దాదా మీరంటున్నది?" వర్మ అనుమానంగా అడిగాడు.


    సామ్యూల్ భయంగా చూసాడు.


    షంషేర్ దాదా సామ్యూల్ వైపు చూసాడు.


    "సామ్యూల్! ఈ షంషేర్ దాదా నే డబల్ క్రాస్ చేస్తావా...?" షంషేర్ దాదా చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది. సైలెన్సర్ అమర్చిన ఆ రివ్వైవార్ నుంచి వరుసగా ఆరు బులెట్లు సామ్యూల్ శరీరంలో దిగబడిపోయాయి.


    అంతా స్ప్లింట్ సెకండ్ లో జరిగింది.


    సామ్యూల్ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు.


    "దాదా! వాటీజ్ దిస్" అందోళనంగా అడిగాడు డిఫెన్స్ చీఫ్ వర్మ.


    "పనిష మెంట్... ఈ షంషేర్ దాదాను డబల్ క్రాస్ చేసినందుకు పనిష్మెంట్ సామ్యూల్ డబల్ క్రాస్ చేశాడు... డిఫెన్స్ డిప్యూటీ చెఫ్ రంగనాథ్ కు మన ఇన్ పర్మీషన్ అందిస్తున్నాడు... మన మాటలను తెప చేశాడు..." సామ్యూల్ డెడ్ బాడీ మీదికి వంగి అతని షర్ట్ చివర వున్న స్పీకర్ లాగాడు. లోపల అతి చిన్న సైజ్ టేప్  రికార్డర్.


    డిఫెన్స్ చీఫ్ షాకయ్యాడు.


    "డోంట్ వర్రీ మిస్టర్ వర్మా! మీకు ఏమీ తెలియనట్టే ఉండండి.మీరు నిశ్చింతగా వెళ్లిపోండి... మా డ్రైవర్ వస్తాడు" చెప్పాడు షంషేర్ దాదా.


    వర్మ బయటకు నడిచాడు... ఇంకా అతని గుండె అతి వేగంగా కొట్టుకుంటూనే వుంది.
   
                                                    ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS