Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 37

    విశాలి పిలిచింది.
    మౌన ఆగి, వెనక్కి తిరిగి బిశాలిదగ్గరకు వచ్చింది.
    "నా బిడ్డ నీవల్ల మారగలిగితే, ఈ తల్లి నీకు జెవిట కాలం రుణపడి వుంటుందమ్మా! తల్లిగా నా బిడ్డ ఆకలి తీర్చలేకపోయాను. వాడి బోసి నవ్వులు... తప్పడడుగులు... అమ్మా అనే పిలుపులూ ఏవీ నోచుకోని బిడ్డ వున్న గొడ్రాలి నయ్యానమ్మా." అంది బాధగా విశాలి.
    "భాధపడకండి అంటీ... భస్మ ను ప్రాణాలతో మీ ముందు వుంచుతాను. అతనికేమీ కాదు. ఏదో ఓ రోజు'అమ్మా' అని మీ ఒడిలో చేరి పసి పిల్లాడైపోతాడు..." మనస్పూర్తిగా అంది మౌన.
    "చాలమ్మా... ఈ మాటలు చాలు... అమ్తూమోవ్నాను అక్కున చేర్చుకుంది. ఆ దృశ్యం చూసి భరద్వాజ కళ్ళు చెమర్చాయి.
    కౌశిక్ కూడా ఆ దృశ్యాన్ని కళ్ళార్పకుండా చూసాడు. హంతకులు... కేసులు... ఇన్వెస్టిగేషన్  తప్ప మరో ప్రపంచ తెలియనిఅతనికి, అప్యాయతలు, ఆర్ద్రత కలిగన  యిలాంటి అనుభంధాలు చూసి అతని కళ్ళు చేమర్చ్యి.
    విశాలి ఏదో గుర్తొచ్చినట్టు లోపలకి వెళ్ళి ఐ కొత్త పట్టుచీర ప్లేటులో పెట్టి తెచ్చింది.
    మౌనాను కూర్చోమని బొట్టుపెట్టి ఇచ్చింది.
    "మౌనా! నా ఇంటి కోడలిగా ఆశ్వీర్వదిస్తూ ఇస్తున్నాను కదనకు..." అంది విశాలి అప్యాయంగా.
    మౌన వద్దనలేదు.
    వంగి మనస్పూర్తిగా  ఆశీర్వదించింది.
                                               ***
    "మనమిప్పుడు మౌనాని ఏ విధంగా దేబ్బతీద్దాం..." అడిగాడు కరంజయా ఖాన్ ని.
    "బ్లో_ టెస్ట్  ద్వారా..."
    "బ్లో_ టేస్ట్  ...? అంటే ఏంటి?"
    డ్యూటీలో జాయినయ్యే ఎయిర్ హావుస్తాస్ ప్లయిట్ ఎక్కేముందు, ఆల్కహాల్ తీసుకోకూడదు రూల్స్ ప్రకారం. పైలేట్స్ కూడా ఈ రూలు వర్తిస్తుంది. మామూలుగా ఎయిర్ హావుస్తాస్ ఆల్కహాల్ తీసుకుని డ్యూటీకి వెళ్లరు.
    ఎప్పుడైనా, ఎవరైనా అలా వెళ్ళిన సందర్బాలు తక్కువ.ఇప్పుడు మనం ఎయిర్ పోర్ట్ అథార్టీకీఫోన్ చేసి మౌన ఆల్కహాల్ తీసుకుందని చెబుతాం.
    వెంటనే మౌనకు బ్లో_ టెస్ట్ చేయిస్తారు.ఆ టెస్ట్ లో ఆమె ఆల్కహాల్ తీసుకుందని తెలుస్తుంది. వెంటనే సస్పెండ్ చేస్తారు.
    మౌన లాంటి ఆత్మాభిమానంగల అమ్మతికి అది అవమానమే. ఆ అవమానంతో ఆమె కృంగిపోవచ్చు. లేదా సూసైడ్ చేసుకోవచ్చు. తాత్కాలికంగా భస్మ వెంటపడ్డాం మానేస్తుంది.
    "కానీ... మౌన ఆల్కహాల్ తీసుకోదుకదా!"
    "మనం తీసుకునేలా చేద్దాం..."
    "అదెలా... మనం బలవంతంగా ఆమెచేత ఆల్కహాల్ తాగించినా, ఆమె ఆ వుశయం తెలుసుకుని'డ్యూటీ' కి వెళ్ళాడు కదా."
    "ఆ విషయం ఆమె క్కూడా తెలియదు."
    "అదెలా సాద్యం?"
    "భస్మ వల్ల."
    "భస్మ వల్లనా?"
    "ఖచ్చితంగా, భస్మ ఏం చెప్పినా చేస్తుంది మౌన. భస్మకు మనం సజెషన్స్ ఇస్తాం. భస్మ మౌనకు కూల్ డ్రింక్ ఆఫర్ చేస్తాడు.అందులో ఆల్కహాల్ వుంటుంది. భస్మకోసం ఆ కూల్ డ్రింక్ తాగి డ్యూటీ కి వెళ్తుంది.
    ఈ లోగా మనం కంప్లయింట్చేస్తాం.
    ఆల్కహాల్ తాగిందన్నవిషయం టెస్ట్ లో తెలుస్తుంది. కొంతకాలం ఈ బాధ ఆమెను వేధిస్తుంది.
ఈలోగా మనం ,మన పనులు పూర్తిచేసుకుని ఇండియాకు గుడ్ బై చెబుదాం..."
    "వేరే గుడ్ ఐడియా.. బావుంది. యింతకీ భస్మ ఎక్కడ?"
    "అదిగో, మన సజెషన్స్ కోసం ఆ కుర్చీలో కూర్చున్నాడు."
    భస్మ కుర్చీలో అభావంగా కోర్చున్నాడు.
    వీళ్ళా మాటలు వినిపిస్తూనే వున్నాయి. అతని మనసులో ఏదో కలకలం.
                                                                    ***
    అగర్వాల్ తన చెవులకు హెడ్ ఫోన్ తగిలించుకున్నాడు. అతని ఎదురుగా భస్మ కూచుని వున్నాడు.
    "మిస్టర్ భస్మా... వెంటనే నువ్వు మౌన దగ్గరకి వెళ్ళు. ఆమెకు కూడా డ్రింక్ ఆఫర్ చెయ్... ఆమెతో ప్రేమగా మాట్లాడాలి. ఆమె ముందు నవ్వాలి. కూల్ డ్రింక్ ఆమెతో తాగించే పూచీ నీది.
    ఆ తర్వాత ఆమెను ఎయిర్ ఫోర్ట్ దగ్గర డ్రాప్ చెయ్.
    దిసీజ్ మై ఆర్డర్... ఓవర్" అంటూ హెడ్ ఫోన్స్ తీసేశాడు.
    భస్మ తలకు చుట్టబడిన వైర్లు తొలిగించాడు.
    భస్మ లేచాడు.
                                                                          ***
    "ఏమంటున్నాడు మన భస్మ?" అడిగాడు ఖాన్.
    "అతడేమంటాడు? మనం చెప్పినట్టు చేయక తప్పదు."
    వెరీగుడ్... మన నెక్ట్స్ టార్గెట్ ఏంటి?"
    "ఈ భస్మ మనం అనుకున్న విధంగా తయారయ్యాడు. ఇంకా ఎక్కువ విద్యుత్ భరించే శక్తి అతనికి లేదు. కంకంప్యూటర్ ద్వారా మొత్తం ప్రోగ్రస్ రికార్డ్ చేశాను. మరి కొంత విద్యుత్ అతని బాదీలోకి ట్రాన్స్ ఫర్  చేస్తాం. అలా చేసినా ఎనిమిది గంటల్లోగా తిరిగి విద్యుత్ ని మనం లోడ్ చేసుకోవాలి. లేని పక్షంలో అతని కన్ను తెరుచుకుని విద్యుత్ ఆ పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తుంది.
    పిడుగుపడితే దని ప్రభావం ఆ పరిసర ప్రాంతాల్లో ఎలా వుంటుందీ... అంతకు కొన్ని వేళ రెట్లు వుంటుంది" అగర్వాల్ చెప్పాడు.
    "వెరీగుడ్... భస్మతో మనకు పని వుండదు భవిష్యత్ లో. అతన్తో పాటే అతను చేసిన నేరాలూ సమాధి అవ్వాలి.భస్మ మన పనికాగానే ఫినిష్ అవ్వాలి" ఖాన్ అగర్వాల్ తో చెబుతున్నాడు.
    ఆ మాటలు భస్మకు వినిపిస్తూనే వున్నాయి.
    కానీ, ఏ నిర్ణయమూ, ఏ భావమూ వ్యక్తపరచలేకపోతున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS