క|| ఆకదురునఁ బికరవము
ఆకదురున భృంగరవము నాత్మరవంబు
ఏకీకృతముగ నేకు ల
నేకులు విన వడికే ముదిర యేకుల ముదిరా! 357
ఉ|| గుబ్బలగుమ్మ లేఁజిగురుఁగొమ్మ సువర్ణపుఁగీలుబొమ్మ బల్
గబ్బిమిటారి చూపులది కాఁపుది దానికిఁ నేల యొక్కనిం
బెబ్బులి నంటఁగట్టితివి పెద్దవు ని న్ననరాదు రోరి దా
నబ్బ! పయోజగర్బ! మగనాలికి నింతవిలాసమేటికి? 358
శా|| దాయాదుల్వలే గుబ్బచన్ను లొఱయ ధావళ్య నేత్రాంబుజ
చ్చాయల్ తాండవమాడఁ గేరి పురుషస్వాంతమ్మున మన్మధుం
డేయం జంగమువారి చంద్రముఖి విశ్వేశార్చనా వేళల
వాయించెం గిరిగిండ్లు బాహుకుశ లవ్యాపార పారీణతన్ 359
ఉ|| పువ్వులు కొప్పునం దురిమి ముందుగఁ గౌ నసియాడుచుండఁగా
జేవ్వునఁ జంగసాఁచి యొక చేతను రోఁకలి వూని యొయ్యనన్
నవ్వుముఖంబు తోడఁ దననందనుఁ బాడుచు నాధుఁ జూచుచున్ 360
సీ|| బొమవింటఁ దొడిగిన పూవింటి దొరముల్కి
పోల్కిఁ గస్తురి సోఁగ బొట్టు దిద్ది
చకచక లీను తారకల రేకలు వోలెఁ
గొలుకులు వెడలఁ గజ్జలము దీర్చి
పొడుపుగుబ్బలి మీఁద బొడము నీరెండ నా
రంగుచందురుకావి రైక దొడిగి
పిఱుఁదు పొక్కిలి యను మెఱక పల్లము గప్పఁ
బాల వెల్లువవంటి చేల గట్టి
గీ|| అంచకొదమలగమి బదరించుపోల్కి
నందేచప్పుళ్ళు ఘల్లు ఘల్లనుచు మొరయ
నడుము జవజవలాడిఁ గీల్జడ ఘటించి
వచ్చే ముక్కంటి సేవకు మచ్చేకంటి. 361
సీ|| తాటంకయుగధగద్దగిత కాంతిచ్చటల్
చెక్కుటద్దములపై జీరువార
నిటలెందుహరినీల కుటిలకుంతలములు
చిన్నారిమోమునఁ జిందు ద్రొక్క
బంధురమౌక్తిక ప్రకటహారావళుల్
గుబ్బచన్నుల మీఁద గునిసియాడ
కరకంకణక్వణక్వణ నిక్వణంబులు
పలుమాఱు రాతి పైఁ బరిడవిల్ల
గీ|| ఓరచూపుల విటచిత్త మూఁగులాడ
బాహుకుశలతఁ జక్కని మోహనాంగి
పాటఁబాడుచుఁ గూర్చిండి రోటిమీఁదఁ
బిండిరుబ్బంగఁ గన్నులపండు వయ్యె. 362
సీ|| శ్రీరస్తు భవదంఘ్రిచికరంబులకు మహా
భూర్యబ్ధములు సీతాంభోజనయన!
వరకాంతిరస్తు తావకముఖనఖముల
కాచంద్ర తారకం బజ్జవదన!
మహిమాస్తూ నీకటిమధ్యంబులకు మన్ను
మిన్ను గలన్నళ్ళూ మించుబోఁడి!
విజయోస్తు నీగానవీక్షల కానీల
కంఠ హరి స్థాయిగా లతాంగి!
గీ|| కుశల మస్తు లసచ్చాతకుంభకుంభ
జంభభిత్కుంభికుంభాభిజ్రుంభమాణ
భూరిభ వదీయవక్షోజములకు మేరు
మందరము లుండపర్యంత మిందువదన! 363
సీ|| చక్కని నీముఖచంద్ర బింబమునకుఁ
గళ్యాణ మస్తు బంగారు బొమ్మ!
నిద్దంపు నీచేక్కుటద్దంపురేకకు
నైశ్వర్య మస్తు నెయ్యంపుదేవి!
మీటినఁ బాగులు నీ మెఱుఁగుఁబాలిండ్లకు
సౌభాగ్యమస్తు భద్రేభయాన!
వలపులు గులుకునీ వాలుఁగన్నులకు న
త్యధికభోగోస్తూ పద్మాయతాక్షి!
గీ|| మధురిమము లోల్కునీ ముద్దుమాటలకును
వైభవోన్నతి రస్తు లావణ్యసీమ!
వన్నెచిన్నెలు గల్గు నీమన్ననలకు
శాశ్వతస్థితి రస్తు యోషాలలామ! 364
సీ|| సొగసుకీల్జడదాన! సొగకన్నులదాన!
వజ్రాలవంటి పల్వరుసదాన!
బంగారుజిగిదాన! వటువుగుబ్బలదాన!
నయమైనయొయ్యారి నడలదాన!
తోరంపుఁగటిదాన! తొడలనిగ్గులదాన!
పిడికిటనడఁగు నెన్నడుము దాన!
తళుకుఁ'జెక్కులదాన! బెళుకు ముక్కరదాన!
సింగాణికను బొమ చేలువుదాన!
గీ|| మేలిమివసిండిరవకడియాలదాన!
మించిపోనేల రత్నాల మించు దాన!
తిరిగి చూడవే ముత్యాలసరుల దాన!
చేరి మాటాడు చెంగాని చీర దాన! 365
క|| కుంకుమ లేదో మృగమద
వంకము లేదో వటీరపాంసువు లేదో
సంకుమదము లేదో యశు
భంకర మగుభస్మ మేల బాలా! నీకున్. 366
శ్రీనాధుని బావమఱఁది రామయమంత్రి యనునతఁడు మంచిభోజనపుష్టి గలవాఁడట! అతఁ డొకయూరికరణము. పాఁడి పంటలు గల సంసారి. ఒకసారి బంతిని గలసి భుజించుచు శ్రీనాధుఁ డాతని నీపద్యము చెప్పి గేలికొనెను.
ఉ. గ్రామము చేతనుండి వరికల్పితధాన్యము నింటనుండి శ్రీ
రామకటాక్ష వీక్షణ పరంపరచేఁ గడతేఱేఁ గాక మా
రామయమంత్రిభోజనపరాక్రమ మేమని చెప్పవచ్చు? నా
స్వామియేఱుంగుఁ దత్కబళచాతురి తాళఫలప్రమాణము. 367
వేఱొక బంధుజనుని పైఁ జెప్పినది.
ఉ. మా కలిదిండి కామయకుమారకుఁ డన్నిటఁ దండ్రివైఖరే
కాక తదన్యుఁ డేట్లగును? గాడిదకుం దురగంబు పుట్టునే?
చేకొని కొంకినక్కకును సింగము పుట్టునే? మాలకాకికిం
గోకిల పుట్టునే? చిఱుతకుక్కకు మత్తగజంబు పుట్టునే? 368
తన యెడ నత్యం తాదరము సూపిన రాజులును , రాజమంత్రులును స్వర్గస్టులైరి. కడుపు కక్కుర్తిచే ఁ గృష్టతీరమున బొడ్డువల్లెను గుత్తకుఁ గొని శ్రీనాధుడు కృషి చేయ మొదలిడెను. కృష్ణవరదవలనఁ బైరు ముఱీఁగి పోయినది. అప్పుడు తన్నాధరించిన రెడ్డిరాజులకు గర్భశత్రువులగు నోడ్డే రాజులు రాజ్యమేలుచుండిరి. విద్యాగౌరవములేక యాయోడ్డేరాజులు శ్రీనాధునిఁ బలుసిలుఁగులకుఁ బాల్పఱిచిరి. శ్రీనాధకవి సార్వభౌముఁ డీ క్రింది పద్యమును జెప్పి యాంధ్ర వాజ్మయ మున్నంతకాలమును శాశ్వతమగున ట్లారాజుల కవకీర్తిని నెలకొల్పేను.
