Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 38

   
    మాధవ్ గురుదేవ్ తమాషాగా నవ్వాడు.    
    "వయసు పొంగు" ఆనందమూర్తి అన్నాడు.    
    "వయసు పొంగు కాదు. వళ్ళు బలిసిన వికారం, పిల్ల ఎర్రి బాగులదే కావచ్చు గుర్రంలా ఎదిగిందికదా మధపిచ్చి పట్టుకుని వుంటుంది. వెర్రివాళ్లకి, పిచ్చి వాళ్ళకీ కోరికలుఎక్కువగావుంటాయిట. ఇదీ అదే జాతిది. ఓ సారి ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఓ పిచ్చిదాంతో...."    
    మాధవ్ గురుదేవ్ ఆ సంఘటనని వల్గర్ గ చిత్రీకరిస్తూ బూతులతో సహ సంగయ్యకి ఆనంద్మూర్తికి వివరించాడు. ఆ తర్వాత ముగ్గురూ వేరే మాటల్లో పడ్డారు.    
    మరికొద్దిసేపు అక్కడే నుంచుని ఆ తర్వాత కీర్తి యివతలికి వచ్చింది.    
    వాళ్ళు తనకి మధపిచ్చి అనుకోటం ఒకవిధంగా మంచిదే తన ప్రవర్తనని వేషాన్ని నమ్మరు. మరో విధంగచెప్పాలంటే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తమ వెర్రి బాగులది అనుకుని ఓ అడుగు ముందుకు వేసి ఏదో ఒక పాడుపని చేయటానికి ప్రయత్నించవచ్చు. అప్పుడు తాను చాలా యిరకాటంలో పడుతుంది. కనుక అందాకా రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే తెలివిగ తప్పించుకోవాలి."    
    కీర్తి ముందు జాగ్రత్తతో ఆలోచించింది.    
    ముందు జాగ్రత్తలుకూడా ఒక్కోసారి పనిచేయకపోవచ్చు. అది వేరే విషయం.    
    కీర్తి ఆ యింటికి వచ్చిన రెండు రోజుల్లోనే తనరహస్య పరికరాలు చిన్నచిన్నవి దాచుకోవటానికి ఓ మంచి చోటు చూసుకుంది. బాత్ రూం కి ఆనించి చిన్న పాత సామానులు పడేసే గది వుంది. దాని మీద అటక కూడా వుంది. అక్కడ దాచింది రహస్య పరికరాలని.    
    "తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, ఇంకా విషయాన్ని బైటికి లాగాతమే తరువాయి." అనుకుంది కీర్తి.    
    కిటికీ దగ్గర నుంచి బయలుదేరిన కీర్తి నెమ్మదిగనడుస్తూ సతీదేవి గదిలోకి వెళ్ళింది.
    
                                    27
    
    రంగమార్తాండ రాఘవేంద్ర గురుదేవ్ ఆయన పూర్తి పేరు. ఆయన్ని అందరూ రంగమార్తాండగారనే పిలుస్తుంటారు,    
    రంగమార్తాండగారికి దాదాపుతొంభై ఏళ్లువుంటాయి వృద్దాప్యానికి తోడు చూపు కొద్దిగ మందగించింది. ఒకానొక రోజుల్లో జానకీపురం జమిందారు ఆయన. జమిందారి గిరీపోయింది అయినా పాతకాలం వాళ్ళు రంగమార్తాండగారిని జమిందారుగారూ అనే పిలుస్తుంటారు.    
    రంగ మార్తాండగారికి మాధవ్ గురుదేవ్ వక్కడేకొడుకు.    
    రంగమార్తాండగారు ఈ మధ్య మంచం మీదనుంచి బొత్తిగ కిందకి దిగలేకుండా వున్నారు దాదాపు అన్నీమంచంలోనే. మనిషిని పెట్టారు. ఎల్లవేళలా ఆయన్ని కనిపెట్టుకుని వుంటూ ఓ నౌకరు ఆ గదిలో వున్నాడు.    
    రంగమార్తాండగారి గదిలోకి రోజుకి ఒక్కసారిఅయినా కొడుకు వెళ్లి మాట్లాడి రావాలి. కోడలు పిల్లవాడినితీసుకెళ్ళి ఆయనకీ చూపించిరావా రోజూ అలా జరిగిపోతూవుంది.    
    సతీదేవి పిల్లవాడిని తీసుకుని రంగమార్తాండగారి గదిలోకి వెళుతుంటే కీర్తి కూడా వెనుకనే వెళ్ళింది.    
    రంగమార్తాండగారి మంచం దగ్గర కుర్చీలో మాధవ్ గురుదేవ్ కూర్చుని వున్నాడు.    
    అక్కడ కూర్చున్న భర్తని చూసి సతీదేవి నుదురు చిట్లించింది. కళ్ళు మూసి తెరిచేలోగా మళ్ళీ సర్దుకుని ముఖం లోకి చిరునవ్వు తెచ్చుకుంది.    
    సతీదేవి మామగారి పాదాలకి నమస్కారం పెట్టింది.    
    కీర్తి భయ భక్తులు నటిస్తూ తను కూడా నమస్కారం పెట్టి సతీదేవి వెనుకగ వదిగి నుంచుంది.    
    "తాతగారు" అంటూ చంద్రజిత్ పరుగున ఆయన మంచం దగ్గరకు వెళ్లి "మంచంఎక్కించు" అన్నాడు నౌకరుతో.    
    రంగ మార్తాండ గారు పడుకున్న మంచం పూర్వకాలం పందిరి మంచం, ఎత్తుగ వుంటుంది.    
    చంద్రజిత్ ని మంచం మీద కూర్చోబెట్టాడు నౌకరు.    
    రంగమార్తాండగారు కళ్ళు పెద్దవి చేసి గుచ్చిచూస్తూ మనవడి వళ్ళంతా ప్రేమగ నిమురుతూ "కన్నా! తాతయ్య అంటే నీ కెంత ప్రేమరా నేను బాగున్నానా!" అన్నాడు.    
    "ఓ...తాతయ్య మంచివాడు." చంద్రజిత్ ముద్దు ముద్దుగ అని రంగమార్తాండగారి ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు.    
    "ఎంత కమ్మగావుందిరా కన్నా నీ ముద్దు- పాలబువ్వ కన్నా పంచదార అరిశలకన్నా మళ్ళీ మాట్లాడితే అమృతం కన్నా మిన్నగ నీముడ్డు వుంది. మొన్న మొన్నటిదాకా కాస్తో కూస్తో చూపు కనిపించేది, యిప్పుడు పూర్తిగపోయింది. దూరంగ అయితే పూర్తి చీకటిలో చూసి నట్లే దగ్గరవిఅయితే లీలగ ఆకారం తప్ప ఏదీ కానరావటంలేదు. "బాధగ చెపుతూ "మాధవ్!" అనిపిలిచారు రంగమార్తాండగారు.    
    "ఏమిటి?" కూర్చున్న కుర్చీలోంచి కదలకుండానే అడిగాడు మాధవ్గురుదేవ్.    
    "మరికొద్ది రోజుల లోనే నాచూపు పూర్తిగా పోయేటట్లు వుంది. ఎప్పుడూ లేనిది పడుకుంటే తలతిరగటం కాళ్ళూ చేతులు తిమ్మిరిలు ఎక్కటం గంటకోసారి చెవిలో హోరు నా పరిస్టితి నాకే అయోమయంగ వుంది. పట్నం నుంచి డాక్టరుని పిలిపిస్తే...    
    రంగ మార్తాండగారు సాంతం మాట పూర్తి చేయకముందే మాధవ్గురుదేవ్ చిరాకుగ ముఖం పెట్టి "మీ వయసు నాలుగు పదుల్లో లేదు. ఈ వయసులో కళ్ళు కాళ్ళు రావటం ఎక్కడా జరగదు. పట్నం నుంచి కాదు కదా ఫారెన్ నుంచి డాక్టర్ ని పిలిచినా ఏంప్రయోజనం వుండదు. అన్నీ తెలిసినమీరు డాక్టర్ ని పిలిపించమంటారేమిటి! మీ అవసరాలకి నౌకర్లు వున్నారు. ముఖ్యమైన విషయం అయితే నేను చూసుకుంటా కదా!" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS