Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 38


    "వింటున్నాను."


    "సింధు, విపాశ, శతద్రు, ఇరావతి, చంద్రభాగ, వితప్త అనే ఆరు నదుల మధ్యగల ప్రాంతంలో పుట్టిన ఆడవాళ్లు మామూలు ప్రణయంతో సంతృప్తిపడరని, వాళ్లది ఎప్పుడూ రగులుతూ వుండే హిమం లాంటి కామం అని రాసి వుంది 'కామసూత్రం' లో నేను విపాశ నదిలాంటి దాన్ని."


    "విపాశ అంటే?"


    "ఇప్పటి బియాస్ నది..." లాలనగా జవాబిచ్చింది. "పూర్వం విశ్వామిత్రుడి టార్చర్ కి తట్టుకోలేని వశిష్టుడు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతే ఆ మహర్షి తేజస్సును భరించలేని నది భయంతో సూర్యుడే దిక్కులా పరుగెత్తింది. అందుకే ఆ నదికి 'శతద్రు' అని పేరువచ్చిందట. అదే ఇప్పటి సట్లెజ్ నది. అయితే అక్కడితో ఆగని వశిష్టుడు మరోసారి తన కాళ్లకీ, చేతులకీ తీగలు కట్టుకుని మరో నదిలో దూకాడట ఎలా అన్నా చావాలని... ఆ నదికీ భయం వేసిందో లేక ఇష్టంతో చేసిందోకాని ఆ బంధాల్ని తెంచి జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చింది. అందుకే పాశాలని తొలగించి రక్షించింది కాబట్టి ఆ నదికి 'విపాశ' అని పేరొచ్చింది..."


    అప్పటికి బోధపడింది తనను తాను 'విపాశ' అని ఎందుకు ఎడ్రస్ చేసుకున్నదో..."


    ఇలాంటి ఆడవాళ్ళు వుంటారని తెలీని శశాంక నిజానికి ఆమెలో ప్రసక్తిని ఎప్పుడో తెంచేవాడు. కాని తనకూ ఓ అవసరముంది. అందుకే అన్నాడు రక్షించడానికి నువ్వు విపాశవైనా నేను వశిష్టుడ్ని కాను."


    "కాని నాకు ఇష్టుడివి" దృఢంగా పలికి "సో మిష్టర్ వాత్స్యాయనా... గోదాలోకి మనమెప్పుడు దిగుదామో కాస్త చెప్పు" అంది మరింత మత్తుగా.


    జుగుప్సగా వుంది వినడానికి. అయినా తనను తాను సంభాళించుకుంటూ "ఆ వివరాలు చెబుతావా సోఫియా" అన్నాడు.  


    అది చెప్పుకోవడం కన్నా అనుభవంలో ఎక్కువ తొందరని గెస్ చెయ్యొచ్చు" పరిహాసంగా అంది.


    "నేనడిగేది నా భార్యని హత్యచేసిన వ్యక్తుల గురించి."


    "తెలుసుకునేవరకు విశ్రమించేట్టు లేవే."


    "అవును... తెలుసుకుని దెబ్బతీసిననాడుగాని నేను సంతృప్తిగా బ్రతకలేను".


    "ఇచ్చిపుచ్చుకోవడంలోనే సంతృప్తి అన్న సూక్తి సెక్స్ కీ వర్తిస్తుంది" అని నువ్వంగీకరిస్తే నేనా రహస్యం చెప్పినప్పుడు అది నేను 'ఇచ్చినట్టు' అవుతుంది. మరి పుచ్చుకునే దెప్పుడు.


    అప్పుడుగాని నాకూ సంతృప్తి వుండదుగా... ఇది వ్యాపారం కాదు. ఓ వ్యవహారం అని నువ్వన్నా నాకు అభ్యంతరం లేదు... కాని నువ్వు నన్ను మరుక్షణం తృప్తిపరచాలి...సిద్ధమేనా."


    ఒక లిప్తపాటు నిశ్శబ్దం. వెనువెంటనే "వెల్ నేను సిద్ధమే" అన్నాడు.


    "నిజంగా" రెట్టించింది ఉత్సాహంగా.


    "యస్."


    "మాట తప్పవుగా."


    "నో..." బలంగా నమ్మించాడు.


    "రగులుకుంటున్నాను వాత్స్యాయనా! ఆ తరువాత నన్ను నిరాశపరచకూడదు."


    "చిన్న సవరణ..." రిసీవర్ తిప్పుతూ దీనంగా ఓ మారు చూశాడు. నువ్వు తెలియపరిచిన వెంటనే కాదు. నేను వాడిపై దెబ్బతీసిన మరుక్షణం.


    "చాలా వ్యవధి కావాల్సిరావచ్చునేమో."


    "ధనుష్కోటి విషయంలో నేను ఎంత త్వరగా గెలుపు సాధించేదీ నీకు తెలీనిది కాదు."


    "కావచ్చు వాత్స్యాయనా" నిశ్చలంగా పలికింది సోఫియా గొంతు."


    "నివ్విప్పుడు డీల్ చేయబోతున్నది ఈ రాష్ట్రాన్ని తిరుగులేని పరపతితో శాసిస్తున్న 'జయచంద్ర' అనబడే 'గాడ్ ఫాదర్' ముఠాకి చెందిన ఓ సామంత రాజుని.


    శశాంక ఆలోచనలు వేగంగా వెనక్కి వెళ్లాయి.


    గుర్తుకొచ్చింది ధనుష్కోటి రాసిన పేరది..


    "హత్య చేయించింది ఎందుకో నాకూ తెలీదు. కాని చేసింది ఆ సామంతరాజే"


    "వాడి పేరు.."


    "రాజ్ కుమార్.."


    వింటున్నాడు ఆమె చెబుతున్న వివరాల్ని.


    వాడు తన ప్రాంతానికి మకుటంలేని చక్రవర్తి. పేరుకి తగ్గట్టు ఎందరో గూండాల్ని పోషిస్తూ రాజులా బ్రతుకుతుంటాడు. వాడి వృత్తి బయట ప్రపంచానికి ఆటో వర్క్ షాప్... అసలు వృత్తి కార్లను తన ముఠా చేత దొంగతనం చేయించడం, రంగు మార్చి వేరే రాష్ట్రాలలో అమ్మించడమూ.. చాలా చాలా ప్రమాదకరమైనవాడు. వాడ్ని నిలదీయగలిగితే ఎందుకు హత్యచేసిందీ తెలుస్తుంది. కాని అది అంత సులభం కాదు."


    "ఆ విషయం నా కొదిలెయ్."


    "కాని నా విషయం" ఆమె అడుగుతున్నది పూర్తిగా వినక సహనం లేనట్టు అప్పటికే ఫోన్ క్రెడిల్ చేసి బయటికి కదిలిన శశాంక వూహించి వుండడు.


    అనుకున్నది ఆ క్షణంలో అమలు చేయించడంలో ఇప్పుడు జయచంద్రకి అసలైన పోటీ రాష్ట్రంలో సోఫియా ఒక్కడేనని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS