ధీరజ మాటలు అతని చెవిన పడిన క్షణం నుంచీ అతని హృదయము దహించుకుపోతుంది.
'అమ్మా.... నువ్వు పతితవా ...నిజం కాకూడదు' అని ఆక్రోశిస్తుంది అతని అంతరంగం!
ఆమె తనకు శత్రువే కావచ్చు....
తనంటే ఆమెకు ద్వేషయం వుండివుండవచ్చు. అయినప్పటికీ అలాంటి అబద్దం చెప్పవలసిన అవసరం ఆమెకు ఎందుకు వుంటుంది? అంతే, తన తల్లి కళంకిత అనేది నిజమేనా?
జోరుగా తాగుతున్న అతని వాలకాన్ని గమనించి లోపల గదిలో అతనికోసం వచ్చివున్న యువతి అతనిని లేపి బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్ళి ఫోం బెడ్ మీద పడుకోబెట్టింది.
షూ వూడతీసి, అతని బట్టలను కూడా తొలగించి..... ఏ.సి అన్ చేసి మెల్లగా అతని పక్కలో చేరి దుప్పటిని పైకి లాగింది ఆమె!
అభినయ్ సంగతి ఆమెకు తెలుసు.
అ సమయంలో అతనికి ఆడది కావాలి. అందుకే అతనికి దగ్గరగా జరిగింది.
అతనికి అంతా తెలుస్తూనే వుంది. అయినా ఆమె చర్యలను వారించలేదు అతను!
మెడపక్కన, చెవుల మీద, పెదవుల మీద ముద్దలను కురిపిస్తున్నది ఆమె.
ఇక అతను ఆగలేకపోయాడు. తమకంతో ఆమె పెదవులను అందుకున్నాడు.
మందు మత్తుమీద వుండడం వలనూ..... మనసు కకావికలమై వున్నందువలనూ ఆ కోపం... తాపం అన్నీ ఆమె మీద చూపించసాగాడు.
కాస్సేపటికి వాళ్ళ శరీరాలు చల్లబడ్డాయి.
ఆ వెంటనే ఆమె నిద్రలోకి జారిపోయింది.
అభినయ్ నిద్రపోలేదు.
విస్కీ మత్తు కూడా అప్పుడు అతని మెదడు మీద పని చేయడము లేదు.
పక్కలో కిరాయి యువతి ఆదమరచి నిద్రపోతుంది. జీర్ వోల్ట్ బల్బ్ వెలుగులో ఆమె నగ్న శరీరాన్ని చూశాడు.
అప్పటి వరకూ తనకు సుఖాన్ని పంచి ఇచ్చింది ఆమేనన్న విషయాన్ని మనసులో నుంచి చెరిపేశాడు. ఏహ్య భావం తొంగి చూసింది అతనిలో.
కించిత్ అసహ్యం!
'ఆడది... అందంతో అడ్డదారులు తొక్కుతుంది' అనిపించింది ఆ సమయంలో!
అందుకు కారణం... ధీరజ అతని తల్లిపై వేసిన అభాండం కావచ్చు... లేదా నగ్నసత్యం కావచ్చు... ఎటువంటి నిజాన్ని అయినా భరించవచ్చేమో కానీ తన తల్లి పతిత అనే నిజాన్ని ఏ బిడ్డా భరించి లేడు!
అభినయ్ మనసు మీద సమ్మెట పోటు వంటి వాస్తవం... అతని అశాంతికి కారణమైంది.
అప్పటికప్పుడు యింటికి వెళ్ళి తల్లిని నిలదీసి ప్రశ్నించాలనుకున్నాడు.
అమ్మా నువ్వు నా తండ్రికి ద్రోహం చేశావా?"
"నువ్వు పతితపు కాదు అని చెప్పమ్మా!"
ఈ ప్రశ్నలు తల్లిని అడిగినప్పుడు అవి నిజం కాకపోతే అ మాత్రు హృదయం ఎంత బాధ పడుతుంది?
విని సహించగలదా?
ఏమిటి ఈ విషమ పరిస్థితి?
తన మనసులో పెను తుఫాను రేపిన ఈ అపవాదు నిజం కాకపోతే ఎంతహాయిగా వుంటుంది?
అభినయ్ ఆ రాత్రి అంతా ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు.
తల్లిని గురించి నిద్రలో సయితం అతను కలవరిస్తూనే వున్నాడు.
* * * *
జయచంద్ర అర్దాంగి వసుమతి....
అభినయ్ ఒకాగానొక్క కొడుకు కావడం వలన కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రేమను పెంచుకున్నది. మమకారాన్ని పంచి ఇచ్చింది. ఆమె ఆశలు అన్నీ కొడుకు మీదే!
ఉన్నతుడిగా తీర్చిదిద్ది, గొప్పవాడిని చేయాలని ఆ తల్లి కోర్కె- అయితే అందుకు భిన్నంగా పెరిగాడు అభినయ్.
అతని పెంపకం మీద తండ్రి ప్రభావం ఎంతో వుంది. భార్య ఆశయాలకు భిన్నంగా తనకు నచ్చేరీతిలో జయచంద్ర అతనని పెంచుకున్నాడు.
బిడ్డా చెడ్డ నడత గురించి అహర్నిశలూ అనేక రకాలుగా ఆలోచించి మానసికంగా ఆ మాతృ హృదయం కుంగిపోయింది.ఒకే ఇంటిలో వున్నా ఆవిడకు కొడుకుతో మాట్లాడాలంటే అసలు అవకాశమే కుదరదు.ఎక్కువ సమయం స్నేహితులతో సరదాలకు.... తండ్రి కార్యకలాపాలలోనూ అభినయ్ మునిగితేలుతున్నాడు.
ఏదో ఒక సమయంలో వచ్చి చేతి భోజనం తిని వెళుతుంటాడు. తను ఎలాంటి పనులు చేస్తున్నా తల్లిపట్ల ప్రేమ, అభిమానులు ఉన్నాయి అతనికి.
అభినయ్ పుట్టి రేపటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తీ అవుతాయి. పుట్టినరోజు అయినా ఇంటిపట్టున తన కళ్ళెదుటే ఉండాలని ఆమె కోరిక. ప్రతి సంవత్సరం పుట్టినరోజున బిర్లామందిర్ కు వెళ్ళి కొడుకు పేరున అర్చన చేయించిరావడం ఆ తల్లి ఇంతవరకూ ఎప్పుడూ మరచిపోలేదు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే అతనికోసం రాత్రి అంతా ఎదురు చూస్తూ గడిపిన వసుమతికి నిద్రపట్టలేదు. గత మూడురోజులుగా అసలు ఇంటికే రాకపోవడం వల్ల పుట్టినరోజు నాడు అయినా వచ్చి తన ఆశీర్వాదం తీసుకుంటాడులే అనే నమ్మకం పటామంచలై పోయింది.
అభినయ్ ఎప్పుడూ ఒంటరిగా గడిపే గెస్ట్ హౌస్ కు ఫోన్ చేసిందామె.
సమాధానం విన్న వెంటనే వసుమతి కారులో గెస్ట్ హౌస్ కు వెళ్ళింది. వాచ్ మెన్ గేటు తెరిచాడు. నైట్ ఇన్ ఛార్జ్ పరుగున వచ్చి నమస్కారం పెట్టాడు.
"అబ్బాయిగారు లోపల వున్నారమ్మా.... లేపమంటరా?"
అతని మాటలను వినిపించుకోకుండానే వసుమతి తలుపు తెరుచుకుని లోనికి అడుగు పెట్టింది.... ఫోం బెడ్ మీద చూడరాని దృశ్యం కనిపించింది!
అభినయ్ కౌగలించుకుని పడుకుని వున్న యువతి తలుపు చప్పుడుకు చటుక్కున లేచి, చీరను అందుకుని బాత్ రూమ్ లోకి పరుగుదీసింది.
