"పాటించాలి.... కానే ఎలా? కొన్ని సంధర్బాలల్లో పరిస్టితులకి బానిసకాక తప్పదు. సర్లే స్నానంచేసి వస్తా.... కూర్చో" టవల్, నైటి తీసుకుని బాత్ రూంలోకి వెళ్ళిపోయింది.
మణి అనూషని చూస్తుంటే జాలేసింది.
కోరి వంటరితనాన్ని ఆహ్వానిస్తోంది.... ఎంతకాలం ఈ ప్రయాణం తోడు లేకుండా. ఎలాగయినా వీణ తన మీద పెట్టిన బాధ్యత పూర్తిచేయాలి. ఈమేనొక ఇంటిదాన్ని చేయాలి. తల్లీ బతికివుంటే ఈమేనిలా వదిలేసెదా? తనకెంతో సాయం చేసింది. ఈ నాడు ఆమెకి సాయం చేసే అవకాశం తనకి కలిగింది. ఈ అవకాశం సద్వినియోగంచేయాలి.
మణి ఆలోచనల్లో వుండగానే అనూష స్నానంచేసి వచ్చింది.
"రా... బోంచేద్దాం.... జడ విప్పి, జుట్టు వదులుగా వదిలేస్తూ పిలిపించింది మణిని.
మణి లేచింది.
ఇద్దారూ డైనింగ్ హాల్ వైపు వెళ్లారు. అన్నంపప్పు వదిలేసి రెండు చపాతీలు కూరలో తిని, మజ్జిగాతాగారు.
మంచం మీదకి చేరిన అనూష ని అడిగింది మణి.
ఏం చేశావివేళా? ఇంత లేటయింది?"
"మొన్న... అదే మీ ఇంటికి వచ్చిన రోజు ఓ బైపాస్ సర్జరీ చేసి వచ్చాను. చాలా సక్సెస్ పుల్ గా పూర్తీ అయింది. కాబట్టి నిచ్చిటంగా ఇంటికీ వచ్చాను. సడన్ గా ఉదయంనుంచీ కొంచెం ప్రాబ్లం మేటిక్ అయిందిదాంతో బాగా టెన్షన్ వచ్చేసింది."
"ఎవరు" ఆడా? మగా?"
"మగే... వయసు కూడా ఎక్కువలేదు.... నలబై ఐదు."
"ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ రావాడానికి వయసుతో సంబంధం వుండడం లేదు."
ఆవును... ఆ మధ్య ముప్పేయ్ ఐదేళ్ళు వ్యక్తి వచ్చాడు."
"ఎక్కువగా మగవాళ్ళకే వస్తుంది కానూ!"
'మగ వాళ్ళు స్మోకింగ్, డ్రికింగ్ వలన కొంచెం త్వరగా దెబ్బతింటారు.... పైగా టైంకి బోంచేయరు. అంతేకాదు... ఇంకో విషయం ఏంటంటే జీవితంలో బాగా వేగం పెరిగింది.... తద్వారా వత్తిడి పెరిగింది. ప్రతి వాళ్ళూ ఎక్కువగా వాడే పదం టెన్షన్ . కొన్నాళ్ళ తరువాత చిన్న పిల్లలు కూడా అత్త, తాత అనడం మానేసి టెన్షన్ అని నేర్చుకుంటూ రెమో అని భయంగా వుంది. ఆధునిక జీవన విధానం మనిషికి ఎంత సుఖాన్ని, ఎన్ని సౌఖార్యాలను ఇస్తోందో, అంత మానసిక వత్తిడికి కూడా గురిచేస్తోంది."
చిన్న దగ్గర నుంచి, పెద్దవాళ్ళుదాకా ప్రతి వాళ్ళూ జీవనపోరాటం మొదలు పెట్టారు.... పిల్లలకు భవిషత్తుకోసం చదువుల పోరాటం, చదువు లయ్యాక ఉద్యోగాల పోరాటం, పెళ్ళిళ్ళ పోరాటం."
కరెక్ట్ పదం నుంచి వాడావు మణీ! పెళ్ళి అనేది నిజంగా పోరాటం కదూ!"
"ఎందుకలా అంటున్నావు?"
మరికాక.... అదేంటో పెళ్ళి అయినంతసేపు పట్టడంలేదు.... విడాకులకి అప్లయ్ చేస్తున్నారీ యంగర్ జనరేషన్ వాళ్ళు. దానిక్కారణం జీవితంపట్ల సరిన అవగాహాన లేకపోవడం.... మొగుడు తన మాట వినలేదని పెళ్ళాం, పెళ్ళాం తనకి చెప్పకుండా తల్లీ గారింటికి వెళ్ళిందని మొగుడూ గొడవలు పాడడం, ఎవరకి వారె నా వ్యక్తత్వం దెబ్బతింటోంది అని విలవిల్లాడం, విడాకుల చట్టం కూడా అనుకూలంగా వుండటం... దీని వలన కలసి బతికేవాళ్ళకన్నా, విడిపోయేవాళ్ళు ఎక్కువైనారు. నన్నడిగితే అసలు జీవించటం ఎలా? అనే కౌల్సిలింగ్ క్లాసులు పెట్టడం చాలా అవసరం అనిపిస్తుంది."
నవ్వింది అనూష. "గొప్ప ఆలోచన. అందరూ మిగతా పనులన్నీ మానేసి, ఈ క్లాసులకి అటెండ్ అవుతారు. కష్ట పడకుండా జీవించటం ఎలాగో నేర్పిస్తారేమోనని."
మణి కూడా నవ్వింది.
అనూష మంచం మీద పక్కకి ఒత్తిగిలి, మణి వైపు ప్రేమగా చూస్తూ అడిగింది. "నువ్వివాళ నీ స్వీట్ హొమ్ వదిలి, న దగ్గర ఎందుకున్నావో తెలుసుకోవచ్చ్హా?"
"నువ్వు ఇంకా ఎంతకాలం ఇలా వంటరితనంతో బతుకుతావో నేను తెలుసుకోవచ్చా?"
"ముందు ప్రశ్న అడిగింది నేను."
"నా మనసులో ఈ ప్రశ్న వచ్చి కాలాకాలమైంది."
"ఉహూ.... వా ప్రశ్నకే నువ్వు ముందు సమాధానం చెప్పు."
"బాగుంది..." నవ్వింది అనూష.
"పిచ్చి మణీ! మీరంతా నాకుండగా నేను వంటరి దాన్ని ఎలా అవుతాను చెప్పు?"
"మేము వేరు... మేమూ ఉదయం అంతా నీకు తోడుగా వున్నా, రాత్రిపూట తోడుకోసమైనా నువ్వు పెళ్ళి చేసుకోవాలి."
"రాత్రిపూట తోడుగా వుండేవాళ్ళు, పగలంతా డిటాచ్ డ్ గా వుంటారు. అలాంటప్పుడు రాత్రి... నిద్రపోవడానికి తోడు దేనికి?"
"డోంట్ బీ సిల్లీ అనూ! చిన్నపిల్లలా మాట్లాడకు. మనిషినికావా? నీకు కోరికలు లేవా?"
అనూష వెల్లకిలా పడుకుని, బెడ్ లైట్ చూస్తూ అన్నది.
"కోరికలు చాలా వున్నాయి మణీ! కొన్ని కోరికలు తీరాలంటే మరికొన్ని త్యాగం చేయాలి. శారీరక సుఖం కావాలనే కోరిక తీరాలంటే, కొన్ని ఆదర్శాలనూ, కొంత ఆత్మ గౌరవాన్ని త్యాగం చేసేందుకు సిద్దంగా లేను."
"ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి అనూ! ఇప్పటికే చాలా జీవితం గడిచిపోయింది. సాధించింది చాలు. ఇప్పటికైనా జీవితాన్ని అనిభవించు."
"జీవితాన్ని అనిభవించడం అంటే, భర్తతో శారీర సుఖం పంచుకుంటూ, వెన్నెలషికార్లు చేయడమా? అదే నిజమైతే నేనా అనుభవాన్ని కోరుకోవడంలేదు.... నన్నిలా బాతాకానీ మణీ! సగం జీవితం గడిచిపోయింది. ఇంకా శేష జీవితం ఎలా గడిచినా చాలు."
