డిఫెన్స్ చీప్ వర్మ షంషేర్ దాదా దగ్గరకి బయల్దేరుతున్నాడు. అతను ప్రభత్వ వాహనంలో బయల్దేరడం లేడి. ఓ ప్రైవేట్ వెహికల్ లో వెళ్తున్నాడు. చాలా పాత అంబాసిడర్ అది. మెకానిక్ షేడ్ నుంచి బయల్దేరినట్టు వుంది దాని వాలకం.
డ్రైవింగ్ సీటులో నలబై అయిదేళ్ళ ఓ వ్యక్తి వున్నాడు. ఒకప్పుడు మాఫియాలో పనిచేసి, ఆ తర్వాత పోలీసులకు ఇన్ ఫార్మర్ గా మారిన వ్యక్తి అతను.
మాఫియాకు పని చేస్తూవుంటాడు. కేవలం ప్రభత్వం, పావులేసుశాఖ దృష్టిలో మాత్రమె అతను ఇన్ ఫార్మర్.
స్వార్ధపరులైన పోలీసు అధికారులకు అతను సాయపడుతూ వుంటాడు. షంషేర్ దాదా కు డిఫెన్స్ చీఫ్ కు మధ్య బేరసారాలు సాగించే వ్యక్తి అతను. అతని పేరు సామ్యూల్.
కారు స్పీడుగా వెళ్తోంది. వెనక సీటులో కూచొన్న వర్మ ఏమీ మాట్లాడ్డం లేదు. ఆలోచిస్తున్నాడు. చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
"స్యాముల్... షంషేర్ దాదా మనం అనుకున్న పని పూర్తీ చేస్తాడంటావా?" అడిగాడు మరోసారి.
"మీకందులో డౌట్ వద్దు సాబ్... షంషేర్ దాదా ఒక డీల్ ఒప్పుకున్నాడంటే, అది పూర్తయ్యేవరకూ వదిలిపెట్టడు. నేనే దగ్గరుండి ఎన్నో డీల్స్ కుదిర్చిపెట్టాను. ఏ ఒక్కదాంట్లోనూ షంషేర్ దాదా ఫేయిలవ్వలేదు" చెప్పాడు స్యాముల్.
"ఈ విషయం మన ముగ్గురి మధ్యనే వుండాలి. నేను షంషేర్ దాదాను కలుసుకునే విషయం కూడా ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు.
"నాకు తెలుసుసాబ్... అమ్డుకేకడా ఈపని నేను వేరేవాళ్ళకు అప్పగించనిది. మనం షంషేర్ దాదా దగ్గరకి బయల్దేరిన విషయం మూడో కంటికి తెలియదు సాబ్."
"దట్స్ గుడ్... అన్నట్టు షంషేర్ దాదా నీకు ఎంతకాలంగా తెలుసు?" అతనికి షంషేర్ దాదాకు గోడవైంది. ఆ తర్వాత దావూద్ దూబాయ్ వెళ్ళి, అక్కడనుంచి అండర్ వరల్డ్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. షంషేర్ దాదా ఇక్కడే వుండిపోయాడు.
షంషేర్ దాదా చాప కింద నేరులా పనిచేస్తాడు. తను చేసేపని గుట్టుచప్పుడు కాకుండా చేత్సాడు. నిజం చెప్పాలంటే, ఇప్పుడున్న అన్ని మాఫియా మూఠాల కన్నా షంషేర్ దాదా ముఠా ప్రమాదకరమైనది సాబ్.
మాఫియాలో సాధారణంగా కిందిస్థాయి వాళ్ళు రంగంలోకి దిగుతారు. ఎప్పుడో తప్ప దాన లు రంగంలోకి రారు. కానీ షంషేర్ దాదా అలా దిగుతాడు.
తనో డీల్ ఒప్పుకున్నాక అది పూర్తయ్యేవరకూ మరో డీల్ ఒప్పుకోడు... చూస్తారుగా సాబ్..." సామ్యూల్ చెప్పుకుపోతున్నాడు.
కారు, ఓ చిన్న విధులోకి టర్న్ తీసుకుంది.ఆ తరువాత మరో నాలుగైదు వీధులు దాటేక రోడ్డు నెంబర్ థర్టీ ఎయిట్ వైపు వెళ్ళింది... అక్కడ్నుంచి తీసుకుని లెప్ట్ కు టర్న్ చేసాడు...
పెద్ద బిల్డింగ్ ముందు కారాగింది... వర్మ కారు దిగలేదు... కారు ఆ ప్రదేశంలో ఆగగానే కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ కారును చుట్టుముట్టారు... బ్లాక్ డ్రెస్సుల్లో వున్న వాళ్ళు మెషిన్ గన్లు ధరించి వున్నారు...
వాళ్ల చోక్కాలా మీద జేబు ఉండే స్థానంలో క్వశ్చన్ మార్క్ వైట్ ఎంబ్రాయిడరీతో వుంది... సామ్యుల్ డోర్ తెరిచి వాళ్ళతో ఏదో మాట్లాడాడు. వాళ్ళు పాస్ వర్డ్ అడిగారు. సామ్యూల్ చెప్పాడు.
షంషేర్ దాదాను కలుసుకోవాలంటే ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోవాలి... షంషేర్ దాదా చెప్పిన రూటులోనే రావాలి... అతను చెప్పిన పాస్ వర్డ్ సేక్యూరీటీ దగ్గర చెప్పాలి.
సామ్యూల్ చెప్పిన పాస్ వర్డ్ విని సంతృప్తి చెంది గేటు తెరిచారు...
కారు లోపలకి వెళ్ళింది. అక్కడే ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ దగ్గర ఓ సేక్యూరీటి వ్యక్తి నిలబడి వున్నాడు... సామ్యూల్, వర్మ కారుదిగి ఆ ఎంట్రన్స్ దగ్గరకి వెళ్ళారు...
సామ్యూల్ వర్మకు మాత్రమే వినిపించేలా చెప్పాడు "ఇక్కడ ఇది కామన్ సార్... వెపన్స్ తో లోపలకు వెళ్ళకూడదు..." సామ్యూల్ ని చెక్ చేసి లోపలకి పంపించారు. వర్మను చెక్ చేశారు.
"ప్లీజ్ రిమూవ్ యువర్ రివాల్వర్..." సాధ్యమైనంత మృదువుగా చెప్పాడు సేక్యూరీటీ వ్యక్తి.
వర్మ లాంగ్ కోట్ జేబులో వున్న రివాల్వర్ తీసి అతనికి ఇచ్చాడు.
"థాంక్యూ సార్... మీరు లోపలకి వెళ్ళవచ్చు" అన్నాడు. అప్పుడే అతని చేతిలో వున్న వాకీ టాకీ రింగయింది. అతను అటెన్షన్ లోకి వచ్చి మాట్లాడి "యస్సార్" అంటూ వాకీ టాకీ ఆఫ్ చేసి లోపలకి వెళ్ళబోతూన్న వర్మను పిలచి అతని రివాల్వర్ ఇచ్చాడు.
