"బామ్మ... నువ్వెంత మంచిదానివే" అంది మౌన.
"నా మంచితనం రోజూ కొద్దికొద్దిగా చూపిస్తాకానీ, ఈ సామానంతా సర్దు..." అంది బామ్మ.
***
"అల్ రైట్ మౌనా... మీ ఇంటికి దగ్గర ఓ కానిస్టేబుల్ ని పెడతాను. వాళ్ళు నీ మీద ఎటాక్ చేసారంటే, భస్మ గురించి వాళ్ళు భయపడుతున్నారన్న మాటే...
భ్స్మలో రియాక్షన్ రావడం మంచి మార్పు..." చెప్పాడు అభినందన పూర్వకంగా కౌశిక్.
భరద్వాజ కూడా అదే అభిప్రాయంతో వున్నాడు.
"సైన్స్ ఎంత డెవలప్ అయినా మనసును శాపిమ్చాలరని, దీన్ని బట్టి అర్దమవుతుంది. ఈ ప్రేమ వాళ్ళ భస్మ మెల్లిమెల్లిగా తనను తెలుసుకోగలిగితే మంచిదే..." అన్నాడు భరద్వాజ.
ఇక్కడ వీళ్ళ సంభాషణ కొనసాగుతుండగా... అక్కడ ఖాన్ తీవ్రమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు.
***
భస్మ లో మార్పులు వస్తున్నాయి. ఈ మధ్య మూడీగా వుంటున్నాడు. మధ్య మధ్య 'హాలో... అయాం భస్మ...' అని తనలోతానే గొణుక్కుంటున్నాడు. అతని మెదడులో మనం అమర్చిన చిప్స్ సరిగ్గా ' యాక్టివేట్' అవ్వడం లేదు." చెప్పాడు అగర్వాల్.
మౌన మీద కోపం పీకల్దాక వచ్చింది ఖాన్ కు. తను బెదిరించినా భయపడకుండా భస్మ దగ్గరకి వెళ్ళింది. అదీగాక మౌన వెంట ఎప్పుడూ ఎవరో ఒకరు సేక్యూరీటీగా వుంటున్నారు.
మౌనాను మరోలా దేబ్బతీయాలి.
ఎలా..."?
అయిదు సెకనులపాటు ఆలోచించాడు. ప్లాష్ లా ఓ ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన అగర్వాల్ కు చెప్పాడు.
భస్మ మంచం మెడ వెల్లకిలా పడుకుని అలోచిస్తున్నాడు.
రకరకాల ఆలోచనలు.
అతని మెదడు తీవ్రమైన సంఘర్షణ కు గురవుతుంది. మౌన గుర్తొస్తుంది కానీ... ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకోలేకపోతున్నాడు.
ఏవో భావాలు ఎలా పారద్రోలాలి?
ఆ భావాలు అతనికి తెలియకుండానే అపరిమితమైన ఆనందాన్ని కలుగచేస్తున్నాయి.
సరిగ్గా అప్పుడే అతని మెదడును కొన్ని ఆదేశాలు వచ్చి చేరాయి.
***
కౌశిక్ ల్యాబ్ తెరిచాడు.
లోపలకి అడుగుపెట్టాడు భరద్వాజ.
పాతిక సంవత్సరాల తర్వాత ఆ తలుపు తెరిచాడు. దుమ్ము ధూళి కొన్ని అంగుళాల మేరకు పేరుకుపోయింది.
ఆ గది చూడగానే విశాలి కల్లలోకన్నీటి తడి. ఒకప్పుడు ల్యాబ్ పరిశోధనలతో కళకళలాడిపోతూ వుండేది.
భరద్వాజ కు కూడా పాత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఒక్కో వస్తువును అపురూపంగా చూడసాగేడు భరద్వాజ.
విశాలి, మౌన కలసి ఆ గదిని రెండు గంటల్లో శుభ్రం చేశారు.
ఎక్కడిక్కడ నీట్ గా సర్దారు.
భరద్వాజ గారూ... ఈ శాస్రజ్ఞాలప్రపంచంలో మీరో అద్భుతాన్ని సాధించబోతున్నారు. అది సక్సెస్ కావాలని నేను, ఈ దేశామూ మనస్సూర్తిగా కోరుకుంటున్నాం..." అన్నాడు కౌశిక్.
"థాంక్యూ ఆఫీసర్... మీరు భస్మను సాధ్యమైనంత త్వరలో యిక్కడికి తీసుకురండీ. అతనిలో రోజు రోజుకూ విద్యుత్ శక్తిని పెంచుతున్నారు. ఏదో ఓ రోజు విద్యుత్ ని భరించే శక్తి కూడా కావులపోతాడు భస్మ. అప్పుడు అగ్నిపర్వంతంలా పేలిపోవడం గ్యారంటీ..."
"భరద్వాజగారూ... ఏంటి మీరేనేది?" కౌశిక్ లో విస్మయం.
"అవును ఆఫీసర్... వోల్టేజి వున్నప్పుడు, టీవీలు, పరిజ్ లు ఎలా పాడవుతాయయో, హై వోల్టేజీ వుండి వోల్టేజీ మరింతగా పెరిగిపోయినప్పుడు ఆ విద్యుత్ ని భరించే శక్తి బాడీ కోల్పోతుంది.
నా అంచనా ప్రకారం భస్మను అలాగే ప్రిపేర్ చేస్తూ వుండాలి.
ఏదో ఓ రోజు హై వోల్టేజీ విద్యుత్ తో భస్మ శరీరాన్ని తెరచి దిద్ది ఒకేసారి తన అవసరం తెరాక, అతడ్ని అంతమోదింఛే ప్రయత్నం చేత్సారు. వాళ్ల టార్గెట్ ఖచ్చితంగా అదే!
ప్రపంచ నాయకుల సమావేశం రోజున భస్మను పూర్తిస్థాయికి ఎలక్ట్రిక్ మనిషిగాతయారుచేసిపంపించి రిమోట్ తో భస్మ లైఫ్ నూ, అక్కడున్న నాయుకులను స్మాష్ చేస్తారు.
ఇప్పుడు మనం చేయాల్సిన పనులు రెండు. ఒకటి_ భస్మను మనం తీసుకువచ్చిఅతనిలోని విద్యుత్ నిమేల్లమేల్లగా తొలిగించాలి. మామూలు మనిషిగా మార్చాలి. ఈ ప్రయత్నంలో అతనికి సైడ్ ఎపెక్త్స్ రావచ్చు. రియాక్షన్ కలిగి, అతని శారేరం వికృతంగా మారవచ్చు. లేదా యాసిడ్ పడిన శరీరంలా మారిపోవచ్చు.
రెండోది_
అలా కుదరని పక్షంలో, మనమే అత్యధిక హైవోల్టేజీ విద్యుత్ ని పంపి అతన్ని స్మా..ష్ .. చేయడం..."
అలా అంటున్నప్పుడు భరద్వాజ గొంతు వణికింది.
"నో సర్... అంతా మనకు అనుకూలంగా మారుతుందనే ఆశిద్దాం. ఇప్పుడు భస్మను ఇక్కడికి తెసుకురావడం లో మనకు మౌన సాయం ఎంతో భస్మను ఇక్కడికి తీసుకురావడంతో మనకు మౌన సాయం ఎంతో అవసరం. అతడ్ని నయానో భయానో తెసుకురావడం కష్టం" అన్నాడు కౌశిక్.
అవునన్నట్టు మౌన వంక చూశాడు భరద్వాజ.
మౌన అంగీకార సూచకంగా తలూపింది.
మౌన బయటకు వెళ్ళబోతుంటే...
