Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 36

 

    
    ఒకనాఁడొక వనిత తన్నుఁ గీకురింపఁగా జెప్పినది:-

    ఉ.  హజలజాక్షి! హా కిసలయధర! హా హరిమధ్య! హా శర
        ద్రాజనిభాస్య! హా ప్రమాదతంత్రకళానిధి! యందుఁ బోయితే
        రాజమహేంద్రవీధిఁ గావిరాజు ననుం గికురించి భర్గకం
        ఠాజిత కాలకూటఘుటికాంచిత మైవయమాసబీఁకటిన్?.    344

        కడిదిపురమున కరిగి చెప్పినవి:-

    క.  ముదివిటులు విధవలంజెలు
        పదకవితలు మాఱుబాసబాఁపనవారల్
        చదువనిపండితవర్యులు
        కదనాస్థిరవీరవరులు కడిదిపురమునన్.    345

    ఉ.  చీరయు ముక్కు ముంగరయుఁ జెంపలగంధముఁ జుక్కబొట్టు మం
        జీర ఝణంఝాణారవముఁ జేతులఁ గంకణనిక్వణంబు నొ
        య్యారపుజాఱుకొప్పును గయాళితనంబును గాని లోన శృం
        గార మొకింతలే దనుట గంటిని యీపురివారకాంతలన్.      346

    రాచవీటి కరిగినప్పుడు చెప్పి కొన్న పద్యము:-

    చ.  పసగల ముద్దు మోవి బిగివట్రువగుబ్బలు మందహాసము
        నొసట విభూతి రేఖయుఁ బునుంగునతావి మిటారిచూపులు
        రసికుల మేలు మేలు బళిరా యని మెచ్చఁగ రాచవీటిలోఁ
        బసిఁడిసలాకవంటి యొక బల్జవధూటిని గంటి వేడుకన్.      347

    దక్షిణదేశమున కరిగినప్పుడు చెప్పినవి:-

    గీ.   మేఁతఁ గరిపిల్ల పోరున మేఁకపిల్ల
        పోరుఁబోతుతనంబునఁ బందిపిల్ల
        ఎల్లపనులను జేఱువంగఁ బిల్లిపిల్ల
        అందమునఁ గ్రోఁతిపిల్ల యీ యఱవపిల్ల.    348

    సీ.  కూడు తలఁవఁ జోళ్ళు కూర కారామళ్ళు
            చెవులంత వ్రేలాళ్ళు చేలు మళ్ళు
        దుత్తేఁడే నాగళ్ళు దున్న పోతులయేళ్ళు
            కలవు మాపటివేళ గంజినీళ్ళు
        మాటమాటకు ముళ్ళు మఱి దొంగదేవళ్ళు
            చేఁదై నపచ్చళ్ళు చెరకునీళ్ళు
        వంటపిడ్కలదాళ్ళు వాడనూతులనీళ్ళు
            విన విరుద్దపుఁ బేళ్ళు వేడఁదనోళ్ళు
        నఖులచన్నులభైళ్ళు చల్లని మామిళ్ళు
            వరుపైన వావిళ్ళు పచ్చ పళ్ళు

    గీ||  దళమయినయట్టికంబళ్లు తలలు బొళ్లు
        వయిఁదికిని జూడఁ బయుఁడెత్తు ప్రతివీళ్ళు
        చలముకొని వెదకిన లేవు చల్లనీళ్లు
        చూడవలసెను ద్రావిళ్ళ కీడు మేళ్ళు.        349

    సీ||  తోలుతనే వడ్డింత్రు దొడ్డ మిర్యపుఁజారు
            చెవులలోఁ బోగవెళ్లి చిమ్మి రేఁగఁ
        పలుతెఱంగుల తోడఁ బచ్చళ్ళు చవిగొన్న
            బ్రహ్మరంద్రముదాఁక ఁబారు నావ
        యవిసాకు వేఁచిన నార్నెల్లు ససిలేదు
            పరిమళ మెంచినఁ బండ్లు సొగచు
        వేపాకు నెండించి వేసిన పొళ్ళను
            గంచానఁగాంచినఁగ్రక్కువచ్చు
        
    గీ||  నఱవ వారింటివి దెల్ల నాగడంబు
        చెప్పవత్తురు తమతీరు సిగ్గులేగ
        ....... ..... ......
        చూడవలసేను ద్రావిళ్ళ కీడు మేళ్ళు.        350

    శ్రీరంగక్రేత్రమున కరిగి యచ్చట నొక బిత్తరి పైఁ జెప్పినది :-

    సీ||  ఒకచెంప కోరగా నోసగూర్చి దిద్దిన
            తుఱుముననుండి క్రొవ్విరులు రాల
        రాతిరి నిదురఁ గూరమిఁజేసి ముడివడు
            బడలిక నడుగులు తడఁబడంగ
        వింతవారలఁ జూచి వెసనవ్వు నెడఁ గప్పు
            గలదంతముల కాంతి వెలికి ఁబాఱ
        చిడిముడినడచుటఁ జెలరేఁగు గుబ్బల
            పైఁ దాఁకి యొక్కింత పైఁట జాఱ
        
    గీ|| చెమటచేఁదిరునామంబు చెమ్మగిల్ల
        హళి డాచేత విడియంబు గీలుకొల్పి
        రంగపురిరాజవీధిఁ గానంగనయ్యే
        నాడుమదిఁ గోర్కులూర వైష్ణవ వధూటి    351

    మారెళ్ల సీమ కరిగినప్పుడు చెప్పినవానిలో నొకటి:-

    సీ|| నడివీధిలో రాళ్లు నాగులే దేవళ్ళు
            వరగట సావిళ్లు పాడుగుళ్లు
        ఐదువన్నెల కూళ్లు నంబటికావిళ్లు
            నూరూర జిల్లెళ్ళూ నూట నీళ్ళు
        నడుముకు వడదోళ్ళు నడు వీధిఁ కల్ రోళ్ళు
            కరణాలవడి సేళ్ళూ కాఁపుముళ్ళు
        ...... .......... ......
            .....     ........

    గి||    ....... ........ నేరెళ్ల వాగు నీళ్ళు
        సిరులఁ జెలువొందు మారెళ్ల సీమ యందు.    352

    రెడ్ల ప్రాచీన రాజధానియగు నద్డంకి కరిగినప్పుడు చెప్పినది.

    సీ||  తళ్కు తళ్కను కాంతి బెళ్కూ కెంపులముంగ
            రంధమై కెమ్మోవియందుఁ గుల్క
        ధగధగద్దగలచేఁ దనరారుబంగారు
            గొలుసులింగపుఁగాయ కొమరు మిగుల
        నిగనిగన్ని గలచే నెగడు చెల్వపు గుబ్బ
            దోయి యొండోంటితో రాయిడింప
        రాజహంసలాసరాజితం బగుయాన
            మందు మెట్టెలు రెండు సందడింప

    గీ.  సరసదృక్కుల విటులను గరఁగ జూచి
        పొంది కైనట్టి మోమున భూతి రేఖ
        రాజకళ లొప్ప నద్డంకిరాజవీధిఁ
        బొలిచె నొకకొమ్మ గాజుల ముద్దుగుమ్మ.    353

    ఉ. గండముదప్పే నాంధ్రకవిగానికి నిన్నటి రేయిఁ ఋష్పకో
        దండుని గారవింపకయతద్దయు నిల్చితిఁగాని యయ్యయో!
        బండరువారి పాపికిని బైటిపసారమె యట్టె మైమయిం
        బుండయి యెల్లవంకఁ జెడిపోదువుగా! యటువోయి యుండిన.   354
    
              మఱికొన్ని పద్యములు-

    ఉ.  వాలగుకన్ను దోయి బిగివగుబ్బలు కాఱుచీఁకటిం
        జాలహసించుకొప్పు జిగి సారసము న్నగు మోము గల్గు నా
        బాలికఁ గూలి కమ్ముకొన బట్టలు నేసేడు వాని కిచ్చే హా
        సాలేత గాదురా కుసుమసాయకుపుట్టపుదంతి! యింతియే     355

    ఉ. కుమ్మరవారి బాలిక చకోరవిలోచన ముద్దుగుమ్మ యా
        వమ్ముదరి రసామలినవస్త్రము చుంగులుజాఱఁగట్టి తాఁ
        గమ్మని మ్రోఁతతో ఁగరనఖమ్ముల భాండము లంగజస్త్రపా
        తమ్మనఁ బ్రోవు దీసే విటతండము గుండియ భార విచ్ఛఁగ.    356


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS