Previous Page Next Page 
రామాయణము  పేజి 36

    లంకేశ్వరుని దృష్టి తనపై పడుటకు హనుమంతుడు అశోక వనమును ద్వంసము చేయసాగినాడు. కావాలి వాళ్ళడ్డు రాగా వారిని తన ముష్టిఘాతములతో నొప్పించి 'పోయి మీ రాజుతో చెప్పు కొనుడు!' అనుచు తరిమివేసినాడు. రావణుడు వారి మేఱను  ఆలకించి ఉగ్రుడై, బాలాధికులకూ భయం కరులనూ అగు 'కింకరులు' అను నూరుగురు యోధులను పంపినాడు. హనుమంతుడు అశోక వన బహిర్డ్వారమునకమర్చి యున్న పెద్ద ఇనుప గుదియను ఊడిలాగి సమీపించిన కింకిరులను మోది చంపితేయగా, హతశేషులు ప్లాయనమును చిత్తగించినారు. ఆ వార్తను విని లంకేశ్వరుడు 'అవ్వడీ అసామాన్య మర్కటుకుడు?' అని అచ్చేరువందుచు 'జంబుమాలి'   మున్నగు ఎనమండుగురు మంత్రి పుత్రులను హనుమంతుని పైకి పంపినాడు. ఆయుధ హస్తులై ముట్టడించిన ఆ యోధాష్టకమును అంజనీసుతుడు తారుశాఖలతో మోది సంహరించినాడు. పిమ్మట సేనానులకును అదే గతి పట్టినది. 
    దశకంఠుని పుత్రులలో కనిష్టడగు అక్షకుమారుడు పిన్న వయస్కుడయ్యునూ రణవిద్య యందారితేరిన పరాక్రమశాలి. వాడు దైత్యేంద్రుని మెప్పించవలేనన్న ఉబలాటముతో వచ్చి "తండ్రీ వగముకుము. ఇంతవరకు అజేయుడై నిలిచినా ఈ వానరుని నేను మిగతాసువును చేసి వచ్చెదను తిలకించుము" అన్నాడు. దశగ్రీవుడు వికసితవాదనముతో "పోయిరంము; విజయోస్తు." అని దీవించి పంపినాడు. అస్త్ర శస్త్రధరుడై అందమందాసీనుడై అత్యుత్సాహముతో నేగుదెంచుచున్న అక్షకుమారుడు హనుమంతునకు చూడముచ్చటగానున్నాడు.
    హనుమంతుడు : (చిరుగువులో) యువకుడా! ఎవ్వడవు నీవు?
    అక్ష కుమారుడు : నేను దానవేశ్వరుని తనయుడను. నిన్ను రణమున వధించుటకు వచ్చినాను.
    హనుమంతుడు : నాతో రణము నీ మరణమునకు దారితీయును నీవిప్పుడే చచ్చుట ఎందులకు? రానున్న రామ రావన యుద్దమున నీవు నీ తండ్రి పక్క నిలిచి పోరాడి వీరస్వర్గమును పొందవచ్చును. నీవిప్పుడు నీ తండ్రి కడకు తిరిగిపోయి 'అశోక వనమును ద్వంసము చేసిన వానరవీరుడు శ్రీరామచంద్రుని దూత హనుమంతుడు' అని పెర్కోనుము.
    అక్ష : కుమారుడు : ముందు నిన్ను వధించి పిమ్మట ఆ సంషోషవార్త నందించుటకు నా జనుకుని వద్దకు పోయెదును.
    అక్షకుమారుడు హనుమంతునిపై బాణములను ప్రయోగించుట ప్రారంభించినాడు. హనుమంతుడు ఆ శరములలో కొన్నింటిని అటునిటు త్వరిరగతిని కాదునేర్పుగా తప్పించుకొన్నాడు. కొన్ని అమ్ములను చేతులతో దొరక బుచ్చుకొని ఎండిన కాష్టములను వలె విరిచి విసరివైచినాడు. ఒక నిశిత సాయకము హనుమంతుని బాహువునకు తగిలి గాయమును చేయగా అందుండి రక్తము స్రవించినది. 'వీనినింక ఉపేక్షించరాదు.' అనుకొనుచు అంజనేయుడు అక్ష కుమారుని అరదము పైకేగరిపోయి దానిని తన హస్తములతో మోది శకలమ్ముగా చేసినాడు. అశ్వములను చంపివేసినాడు. గదాధారియై తనమీదకు వచ్చుచున్న అక్ష కుమారుని కాళ్ళను దొరక పుచ్చుకుని గిరగిర త్రిప్పుచూ కఠిన శిలానిర్మిత ప్రాకారద్వారమును వాని తల తగులునట్లు గట్టిగా కొట్టినాడు. ఆ ఘాతము వలన దానవేంద్రతనయుని శిరము వ్రక్కలై వానిప్రాణములు పోయినవి. హనుమంతుడా విగత జీవుని వీక్షించుచు నిశ్చేష్టుడై నిలబడి పోయినాడు. కోపము పోయి అతని మొగమున విషాదము అలముకొన్నది. "అక్ష కుమారా నా హెచ్చరికను పాటించితివి కాదు. నన్ను రెచ్చగొట్టి  దుర్మరణము పాలైనావు!" అని నిట్టూర్చినాడు...... "ఈపాటికి రవణనకు నా సామర్ధ్యము కొంత విశదమై యుండును. నేనింక ఈ వనప్రాకార ప్రాంగణమును వీడి రావణుని కలిసి చేయదలిచిన హెచ్చరికను జేసి, పిమ్మట కిష్కింధకు శీఘ్రగతిని చేరి రామా సుగ్రీవుల సమక్షమున నిలువవలెను. రావణుడిప్పుడు మంత్రులూ, సేనాధిపతులూ, పురోహితులూ, ఇఅతర సన్నిహిత వర్గమూ  పరివేష్టించి యుండగా నిండు పేరోలగమున నుండును. నేనిప్పుడు కొలువును ప్రవేశించినచో వారేల్లరునూ కూడ నా హెచ్చరికను విను అవకాశము లభించును. వారిలో చొరవ గల ప్రభుహితాభిలాష లభించును.  వారిలో చొరవ గల ప్రభుహితాభిలాషి ఒక్కడునన్నూ అతడు రావణుని సన్మార్గమునకు మరల్చుటకు ప్రయత్నించవచ్చును. కానుక నేనిప్పుడే పోయెదను."
    మరుక్షణమున హనుమంతునకు రథచక్రముల సవ్వడి వినిపించినది. "మరియేక దనుజ వీరుడేవరో మృత్యువును సన్నిధిని చేరుకొనుచున్నాడు!" అని తలపోయుచూ నీరీక్షించినాడు. ఆనతి కాలముననే ఆ స్యందణమచ్చాటకు చేరుకొన్నది. అందున్నవాడు దనుజేశారుని జేష్టపుత్రుడగు మేఘనాథుడు. ఆ  శూరశిఖామణి తపస్సు వలన అస్త్రశాస్త్రముల నన్నింటిని ఆర్జించినాడు. ఇంద్రుని జయించుటచే అతనికి 'ఇంద్రజిత్తు' అను బిరుదు వచ్చినది. అక్ష కుమారుని మరణవార్తను వినుతతోనే రావణుడు 'పూర్వజన్మమున నా గర్భశత్రువేవడో ఈ మర్కటుని రూపమున వచ్చి ఇప్పుడు నన్నిట్లు వేధించుచున్నాడు! ఈ వానరుని వదిమ్చగల దానవుడుడొక్కడును లేడా?" అని విలపించినాడు. మేఘనాథుడు "తండ్రీ నేనుంటిని కదా?' ఈ వానరుని సజీవుని గనో నిర్జీవునిగనో తెచ్చి నీముందు పడవైచేదును" అని రథారూడుడై ఆరుదెంచినాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రమేదియూ హనుమంతునకు హానిని కలుగజేయలేదు. మున్ను బ్రహ్మదేవుడాప్లవంగ పుంగవునితో "అంజనీ తనయూ నీ నుదుట నేను 'చిరంజీవి' అని వ్రాసినాను. ఒక్క బ్రహ్మస్రము తక్క అన్యాస్త్రములు నిన్నేమియూ చేయలేవు.  బ్రహ్మస్త్రమైననూ నీ శక్తి సామర్ధముల నించుక సేపు స్తంభించజేమునే కాని కీడోనరించదు" అని వచించినాడు.... మేఘనాథుడు ప్రయోగించిన వాయువ్యాస్రము వాయుదేవుని అభిమాని హనుమంతుని యెడవ్యర్ధమైనది. అగ్ని వాయువు మిత్రుడగుట వలన ఆగ్నేయాస్త్రమును వృథా యైనది. ఇంద్రజిత్తు "ఎవడీ వానరుడు ? నా అస్త్రములిట్లు నిష్ప్రయోజనము లగుచున్నవేమి?" అని అచ్చేరువందుచు హనుమంతునకు మైకము కమ్మినట్లైనది. అతడు కుప్ప వలె నేలకూలినాడు. ఇంద్రజిత్తు హనుమంతునకు మైకము కమ్మినట్లైనది. అతడు కుప్పవలెనేలకూలినాడు. ఇంద్రజిత్తు హనుమంతుని తన రథముపై నుంచి తీసికొనిపోయి నిండుపేరోలగమున నున్న దానవేశ్వరుని సింహానము రీతిని చిత్ర వధ చేయించుము!" అని వచించి నిజదామమునకు పోయినాడు.
    దుర్నిరీక్షుడైన ఆ తేజోవంతుని తిలకించుచు రావణుడు నివ్వెరపడినాడు. హనుమంతునిపై బ్రహ్మస్త్రము ప్రభావము క్రమముగా వీగిపోయి అతడు తాను రావణుని సభలో ఉన్నట్లు తెలిసికొన్నాడు. 'రావణుని  కలయుట యెట్లని యోచించుచున్న నన్ను ఇంద్రజిత్తుచ్చటకు తెచ్చి కృతార్ధుని చేసినాడు!" అని సంతోషించినాడు. రావణుడు 'ఈ మర్కటుని వివరములనడిగి తెలుసుకొనుము' అని తన ముఖ్యమంత్రి ప్రవహస్థుని ఆదేశించినాడు. ఆ లోపుననే హనుమంతుడు తన శక్తినంతను పుంజుకుని లేచి తన వాలమును దీర్ఘముగా పెంచి చుట్టుగా చుట్టి దానిపై కెగిరి కూర్చున్నాడు. ఇప్పుడాతడు సింహసవాసీడై యున్న దానవేంద్రునకు అభిముఖుడై యున్నాడు.   
    హనుమంతుడు : దానవేంద్రా, నీవు ఉత్తమ వంశసంజాతుడవు. వేదాధ్యయన సంపన్నుడవు. త్రిభువనములను గడగడ లాడించగల పరాక్రమశాలివి. నీ విశాల సామ్రాజ్యమున ప్రజలకు సుఖశాంతులను చేకూర్చుచు దానవ చక్రవర్తిగా భాసిల్ల వలసిన నీవు పరదారాసక్తికి లోనై నీతోబాటు రాక్షసాన్వయమున కంతయు చేటును తెచ్చుచున్నావు. నీవు అపహరించి తెచ్చిన శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతాదేవి లంకాపురి యందున్నదని తెలిసి ఆ వార్తను రూఢి చేసికొనుటకు వచ్చిన రామదూతను నేను. వానర సామ్రాజ్యాధిపతియు శ్రీరామచంద్రునకు మిత్రుడును అగు సుగ్రీవుని మంత్రులలో ఒకడను. నిన రాత్రి అశోక వనమున నేను సీతాదేవిని చూచినాను. సమీప మందలి శింశుపా వృక్షముపై వేచియున్న నేను నీ బెదిరింపు వాక్యములనూ విన్నాను. నేను రామ సుగ్రీవుల వద్దకు తిరిగి పోవుటకు ముందు నీకు హితమును బోధించవలెనన్న సదుద్దేశముతో ఇప్పుడు నిన్ను కలిసినాను. నీవు సీతాదేవిని కొనిపోయి శ్రీరామచంద్రునకు అర్పించి క్షమాపణను కోరుకొనుము. శరణాగత త్రాతయగు శ్రీరామచంద్రుడు నిన్ను కరుణించి వదలివేయుము. నీవు నా హితోపదేశమును పెడచెవిని పెట్టినచో రామ సుగ్రీవులు వానరసేనతో వచ్చి లంకాపురిని ముట్టడించెదరు. నేడు నా శక్తి సామర్ధ్యములించుక నీకు తెలిసి వచ్చినవి కదా? వానర సేనా వాహినిలో ఏయొక యోధుడును నాకు తీసిపోడు. సంగరమున నీవు సంహరించబడుదువు. నీతోబాటు నీవారెల్లరును చచ్చెదరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS