సీత : నాకు మిక్కిలి భయముగా నున్నది.
హనమంతుడు : అటులైనచో నా కొక ఉపాయము తోచుచున్నది. వునుము : నేను నీకు పుత్రినితో సమానము. నీవు నా భుజంపై కూరుచుండుము. తిరిగి నూరు యోజనముల సముద్రమును లఘించిపోయి నిన్ను శ్రీరామచంద్రుని ముందుంచేదను.
సీత : వలదు, వలదు, అట్లు నేను రహస్యముగా రక్షింపబడుట శ్రీరామచంద్రుని ప్రతిష్టకు భంగము. శౌర్యధనుడగు శ్రీరాముడు రణరంగమున రావణుని వధించి నిన్ను బాహాటముగనే తీసుకోని పోవలెను.
హనుమంతుడు : ( మేచ్చుకోనుట) మా అందరి అభిమతమును అదియె. అట్లే జరుగును.
సీత : నీవు నా పరిస్థితిని శ్రీరామచంద్రునకు వివరించి 'శీగ్రముగా నేతెంచి, నన్ను రక్షించుమ' ని ప్రార్ధించితినని చెప్పుము.
హనుమంతుడు : అట్లే చెప్పెదను. అట్లే జరుగును ... నేనింక పోయెదను. రామ ప్రభువునకు ఆనవాలుగా సమర్పించుటకు నీ యాభరణములలో దేనినైన నాకు ప్రసాదించుము.
సీతాదేవి తన శీరోభూషణమును తీసి హనుమంతునకిచ్చినది. పిమ్మట ఆమె ఇట్లు వంచించినది : "కపిశ్రేష్టా, రామప్రభువులకునూ నాకూనూ తక్క ఇంకెవరికీనీ తెలియని వృత్తాంతమొకటి యున్నది. దానిని నీకిప్పుడు వినిపించేదను ఆలకించుము ; మేము చిత్రకూట పర్వతమున వసించు చుండగా ఒకనాడు నా నాథుడు తన శిరమును నా ఒడియందుంచుకోని నిద్రకు వశ్యుడైనాడు. అప్పుడొక రాక్షసుడు కాకి రూపమున వచ్చి తన యినుప ముక్కుతో నా వక్షమును పొడిచి హింసింపసాగినాడు. బాధను సహించుచూ నేను నా పతికి నిద్రాభంగము కలుగకుండుటకు ప్రయత్నించినాను. కాని దైత్యుడు చేసిన గాయము నుండి రక్తము స్రవించి నాథుని ముఖముపై పడి ఆయనకు మెలకువ వచ్చినది. రామచంద్రుడాగ్రాముతో లేచి ఒక దర్భపుడకను మంత్రించి బ్రహ్మస్త్రముగ జేసి కాకాసురునిపై ప్రయోగించినాడు. తరుముకొని వచ్చుచున్న అస్త్రమును తప్పించుకొనుటకు అసురుడు ముల్లోకములనూ చొరబడినాడు కాని వాని ప్రయత్నమూ ఫలించలేదు. వెంటాడి వచ్చుచున్న అస్త్రముతో వాడు తిరిగి మావద్దకే వచ్చి రాఘవుని శరణుజోచ్చినాడు. రాఘవుడు వానిని కరుణించి "అస్త్రము నీ అసువులను హరింపకుండ చూచెదను కాని అపరాధిమగు నిన్నిది శిక్షించక వదలదు" అన్నాడు. అంత నాయస్త్రము దనుజునకు శిక్షగా వాని దక్షణ నేత్రమును దహించి ఎకాక్షిని చేసి విడిచినది...... అంజనీ పుత్రా నీవు నా శిరోభూషణమును శ్రీరామచంద్రునకర్పించినపుడు ఈ కాకా సుర వృత్తాంతమును అయన జ్ఞప్తికి తెమ్ము. ఈ గాధను నీకు నేను వచించితినని తెలిసికొని అయన నీవు నన్ను చూడగల్గితినని తెలిసికొని అయన నీవు నన్ను చూడగల్గితివని రూఢీ చేసికొనును."
అనంతరము హనుమంతుడు సీతాదేవి వీడ్కోలును పొంది అశోక వనప్రాకారము సింహద్వారమునకు వచ్చినాడు. ఆమె ధైర్యమును చిక్కపట్టుకుని రాక్షసాంగనల వలయమునుమరల ప్రవేశించినది. సూర్యోదయమై ప్రొద్దే క్కిననూ ఆ కావలి స్రీలింకనూ మొద్దు నిద్దుర యందేయున్నారు.
* * *
లంకాదహనము
(దశకంఠుని పుర్తులలో కనిష్టడగు అక్ష కుమారుడు పిన్న వయస్కుడయ్యనూ రణవిధ్య యందారితేరిన పరాక్రమశాలి. వాడు దై౦త్ర్యే౦ద్రుని మెప్పించవలేనన్న ఉబలాటముతో వచ్చి "తండ్రీ వగవకుము. ఇంతవరకు అజేయుడై నిలిచినా ఈ వానరుని నేను నిగాతానువును చేసి వచ్చెదను తిలకించుము" అన్నాడు.)

హనుమంతుడిపట్లనుకొనెను? "సీతాదేవిని కనుగొన్నాను. ఆ మాహాసాద్విని హరించి తెచ్చిన దుష్టుడు రావణుడే అని రూఢియైనది. ఈ వార్తను నేను రామసుగ్రీవులకు తెలుపుటతోనే వారు లంకాపురిని ముట్టడించుటకు సన్నాహమును చేయుదురు..... ఈ వేకువ జామున సీతాదేవి రావణునితో 'నీవు పిరికి పందవు!' అని నిర్భీతిగ వచించినది. నేను లంకాపురిని 'వీడిపోవుటకు ముందు రావణునకు న శక్తి సామర్ధ్యములనించుక ప్రదర్శించి, 'నీ పురము' ను ముట్టడించనున్న వానర సేనలో ఏ ఒక్కడునూ నాకు తీసిపోవువాడు కాదు అని విశదపరిచి వాని గుండెలలో భయమును రేకెత్తించేదను."
