"అవునవును..... నర్వసంగా పరిత్యాగంచేసి, బుద్ధభాగావనుడిలా శాంతి ప్రచారం చేస్తూ తిరగాలి" అనూషాతో వెటకారంగా అని మణివైపు చూస్తూ అన్నది వీణ. "మణి ! నీతో నాకు చాల పనుండి. అలా వెడదాం బయల్దేరు. చిన్నయ్యగారూ! ఇవాళా మీ ఆవిణ్ణి మా ఇంటికీ తీసికెళతాను."
చిన్నయ్య సంతోషంగా అన్నాడు. "తీసికెళ్ళండి.... కాస్త మామూలు మనిషి అయి మనుషుల్లో పడేలా బ్రెయిన్ వాష్ చేయండి."
"విన్నావా? లే..." బలవంతంగా మణిని లేపి, లోపలకి తోసింది వీణ.
పనమ్మాయి అందరీకి కాఫీలు తెచ్చింది.
కాసేపతకి మణి తయారై చీర మార్చుకుని వచ్చింది.
ముగ్గురూ కలసి బయలుదేరారు.
కాసేపు ఐస్ క్రీమ్ పార్లర్ లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు.ఐస్ క్రీం తిని అనూష సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
వీణ, మణి వీణ ఇంటివైపు బయలుదేరారు.
కారులో వెళుతుండగా చేపిఇమ్ది వీణ. మణీ! నీకో ముఖ్యమైన పని అప్పగిస్తున్నాను. నువ్వడి సక్సెస్ పుల్ గా పూర్తీచేయాలి. అందుకే నిన్నువేళ మా ఇంటికీ తీసుకుకేళుతున్నాను."
"ఏంటది?"
"ఏం లేదు... అనూషకి మంచి మ్యాచ్ వచ్చింది. భరణి అని... మంచివాడు... ముఖ్యంగా అనూషని బాగాఇష్ట పడుతున్నాడు. అతడిని పెళ్ళిచేసుకోమంటే ఒప్పుకోవడంలేదు... తనని ఒప్పించేభారం నీది."
"నువ్వు చెబితే ఒప్పుకోని మనిషి నేను చెబితే ఒప్పుకుంటుందా?"
"నువ్వు పెద్దదానివి. కనీసం ఆ గౌరవంతో నైనా ఒప్పుకోవాలి.
తను ఒప్పుకోనేలా నువ్వు కన్విస్స్ చేయాలి."
"అనూష సుఖంకన్నా నాకు మాత్రం ఏం కావాలి? తప్పకుండా నాకు చేతనైనంత నేను ప్రయత్నిస్తాను."
"థాంక్యూ" కారు వీణ ఇల్లు సమీపించింది.
* * * *
అనూష కారు హారన్ మోగించింది.
నిద్రలో వున్న వాచ్ మాన్ ఉలిక్కిపడి లేచి, పరిగెత్తుకని వచ్చాడు. జేబులో వున్న తాళం చేతులు తీసి గేటు తాళం తీశాడు.
అనూష కారు లోపలకి, గ్యారేజ్ వైపు దూసుకెళ్ళింది.
వాచ్ మాన్ వచ్చి డోర్ తెరిచాడు.
అనూష కారు దిగి, తాళంచెవులు అతనికిచ్చి, నీరసంగా నడుచుకుంటూ లోపలకివచ్చి హాల్లో లైటు వేసింది.
వాచ్ మాన్ కారులో వున్న వస్తువులు, సేతస్కోప్ తీసుకొని అన్నీ లోపల పట్టి వచ్చాడు.
నువ్వెళ్ళి పడుకో... చెప్పింది.... అతను మోఎనంగా విని వెళ్ళిపోయాడు...రోజూ తను ఏ రాత్రివేళ వచ్చినా మెలుకువగా వుంటాడు. ఇవాళ ఎందుకో త్వరగా నిద్రపోయాడు. ఒంట్లో బాగాలేదేమో! అనుకుంటూ టైం చూసింది. పన్నెండు పావు.
ఉల్లిక్కిపడింది
అబ్బో! పన్నెండు దాటింది. అనుకోకుండా మొన్న ఆపరేషన్ చేసిన రోగికి సీరియస్ అయింది. ఆ టెన్షన్ లో టైం గమనించలేదు.
అనూషకి ఆకలేసింది.ఉదయం తిన్న బ్రేక్ ఫాస్ట్... రెండు ఇడ్లీ, ఓ కప్పుపాలు మళ్ళీ ఏం తినలేదు. కర్తవ్య నిర్వహణలో సమయం గురించి ఆలోచించే ప్రసక్తే వుండదు.
సృష్టి మొత్తం గాఢనిద్రలో వుంది. దాదాపు అర్దరాత్రి దాటుతోంది. అమ్మ వుండివుంటే ఎన్ని తిట్లుతిట్టేదో! ఈ అర్దరాత్రి ఉద్యోగాలు ఏంటీ? దరిద్రపు ఉద్యోగపు మాని పారేయ్ అనేది.
నవ్వుకుంది.
కడుపులో నకనకలాడుతుంది. ఆకలి ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు అన్నం తినాలంటే ఎలా? అరగద్దూ...
నేరుగా బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది. లైటు వేసి, వార్డ్ రాబ్ తీసి, నితీ తీసుకుంటూ ఉలిక్కిపడింది. మంచం మీద ఎవరు?
నొసలు చిట్లించి చూసింది. మంచంమీద ,మణి నిద్రపోతుంది. ఎప్పుడొచ్చింది మణి? వాచ్ మాన్ చెప్పలేదేం? మర్చిపోయాడా? లేక నాకు తెలుసు అనుకున్నాడా? అనూష ఆలోచిస్తూ నిలబడిపోయింది.
లైటు వెలుతురూ మోహంమీద పడేటప్పడకి ఆమని కళ్ళు తెరిచింది.
అనూష టైం చెప్పి అడిగింది. "ఇదేమిటి? నువ్విక్కడ వున్నా వేం? ఎప్పుడోచ్చావు?"
మణి మంచం మీద లేచి, దిండుకానుకుని కూర్చుని అన్నది... నేనొచ్చి చాలా సేపయింది. బహుశా ఏడు గంటలకి టి .వి లో తెలుగు వార్తలు మోదలవగానే వచ్చుంటా, రాగానే స్నానంచేసి కాఫీ తాగి పడుకున్నాను. నిద్ర పట్టీసిమ్ది... వాచా మాన్ చెప్పలేదా?"
"లేదు... వాడు నిద్ర మత్తులో వున్నాడు... ఇంతకీ ఏంటి సంగతి?"
మణి మాట్లాడలేదు. కొంచెంసేపాగి అంది. "నువ్వు స్నానం చేసిరా. గీజర్ అన్ చేసే వుంది. ఎమర్జన్సీ కేసేదో అటెండ్ అయ్యవుటగా...ఫోన్ చేశాను. సిస్టర్ చెప్పింది.చాలా అలసిపోయావు అనూషా! వెళ్ళు... వెళ్ళి స్నానం చేసిరా... బోంచేద్దాం" అప్యాయంగా అంది మణి.
అలసిన మనసుని సేద తీరుస్తున్నట్టు సున్నితంగా స్పర్సంచిమ్డా అప్యాయత... ఆ ప్రయత్నంగానే ఆమె కళ్ళల్లో ఓ చిన్న నీతుతెర పల్చగా కమ్ముకుంది... తమాయించుకుంటూ నవ్వింది.
"ఇప్పుడెం బోజనం?" మజ్జిగా తాగి పడుకుంటాను.
"నీ కోసం నేనూ బోజనం చేయలేదు. నీలాగా మజ్జీగతో చల్ల బడే ప్రాణం కాదది. వెళ్ళు... త్వరగా రా... నాకాకలి వేస్తోంది."
"అదేమిటి మణీ! నువ్వెందుకు కూర్చున్నావు నా కోసం. నీ ఆరోగ్యం అసలే బాగాలేదు కూడా... ఇలా వేళతప్పి బోంచేస్తే ఆరోగ్యం మరీ పాదవడూ!"
"మనం డాక్టర్లం అయినంత మాత్రాన ఆరోగ్యసూత్రాలులకి బోదింఛటంకాదు. మనమూ పాటించాలి.
