Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 35

    "ప్రీతి... ప్రీతికౌర్... వచ్చి వెళ్ళింది అని చెప్పండి" అంది గూర్ఖా కు మాట్లాడ్డానికి అవకాశం యివ్వకుండా అక్కడ్నుంచి వేగంగా కదులుతూ.
   

                                               ***

    గుడ్ లక్ రెస్టారెంట్ లో కూచుండి మృదువని.

    ఆమె అనిమానం కొద్ది కొద్దిగా బలపడసాగింది. శరణ్యను డిఫెన్స్ చీప్ అరెస్ట్ చేసి వుంటాడు. తననెంత టార్చర్ చేస్తున్నారో? అనవసరంగా తన కారణంగా చిక్కుల్లో పడింది. ఏం చేయాలి?

    "మేడమ్ టీ.." వెయిటర్ వేడి వేడి టీ టేబుల్ మీద పెట్టి చెప్పాడు.

    మృదువని టీ సిప్ చేస్తూ గ్లాసు డోర్ లో నుండి బయటకు చూసింది.

    అక్కడ జేమ్స్ రోడ్డుకు అవతలివైపు తూలుతూ కనిపించాడు.

    జేమ్స్... శరణ్య బోయ్ ప్రెండ్...

    అతనికి శరణ్య గురించి వివరాలు తెలిసేవుంటాయి. వెంటనే, లేచి పడి రూపాయల కాగితం టీ కప్పు కింద పెట్టి బయటకు పరుగుతీసింది.

    రెండంటే రెండే నిమిషాల్లో రోడ్డు క్రాస్ చేసింది. తూలుతూ రోడ్డుకు అడ్డంగా నడుస్తున్న జేమ్స్ ని పట్టుకుంది.

    "హలో జేమ్స్..." అంది అతని భుజాలు పట్టి కుదుపుతూ.

    "జే..మ్స్..హు ఈజ్ జేమ్స్... అయాం నాట్  జేమ్స్...ఐ డోంట్ నో జేమ్స్..." తూలుతూ ముద్ద ముద్దగా తడపడుతూ చెప్పాడు జేమ్స్.

    "జేమ్స్.. నేను.. మృ..దు..వ..ని అంటే ఎవరు... నాకు వధువు తప్ప ఏమీ తెలియదు. యూనో శరణ్యా... మై ఉద బి... గ్రేట్ పర్సనాల్టీ... గ్రేట్ పర్సన్.... చాలా అందంగా వుంటుంది... ఐ.. లా..స్ట్...హా...ర్... నేను ఆమెను పోగొట్టుకున్నాను.

    శరణ్య...శరణ్య ఎక్కడ?" ఆత్రుతగా అడిగింది మృదువని.

    జేమ్స్ తల పైకెత్తి ఆకాశం వంక చూపించి...

    "అక్కడకి వెళ్ళింది... వీసా దొరగ్గానే వస్తానంది..."

    "జేమ్స్... శరణ్య ఎక్కడ?" ఎద్ప్ గొంతుతో అడిగింది మృదువని.

    "ఇక్కడ... ఇందులో వుంది... స్కాచ్ లో వుంది. విస్కీలో వుంది.. బ్రాందిలో వుంది... గొణుక్కుంటున్నట్టు అన్నాడు జేమ్స్.

    "ప్లీజ్ జేమ్స్.. లుక్ ఎట్ మీ.. అయాం మృదువని..." అతడ్ని పట్టి కుదుపుతూ అంది.

    "నాకీటైంలో మందు తప్ప, మీరెవరూ గుర్తుకురారు... సారీ... మీరెవరో నాకు తెలియదు... పోనీ ఓపన్జేయండి... నన్ను ఏదైనా బార్ కు తీసుకు వెళ్ళి రెండు లార్జ్  లు ఫిక్స్ చేయించి... అప్పుడు చెప్పండి."

    "జే..మ్స్.." అంటూ యింకా ఏదో అనబోయింది. సరిగ్గా అప్పుడే జీపు వేగంగా వచ్చి రోడ్డుకు అడ్డంగా, మృదువని విడిపించుకుని నడుస్తోన్న జేమ్స్ ని తాకుతూ వెళ్ళింది.

    జేమ్స్ ఓ పక్కకు పడిపోయాడు. జనం గుమిగూడారూ. ముందుకు వెళ్ళిన జీపు ఆగింది.
    "ఏయ్... కళ్ళు కనిపించటంలేదా..." ఎవరో గట్టిగా అరిచారు. ఆ వెంటనే జీపును చ్చోసి భయంతో బిగుసుకుపోయారు.

    కళ్ళు కనిపించటం లేదా... అన్నా వ్యక్తి భయంతో అక్కడ్నుంచి జారుకున్నాడు.

    "రేయ్... ఎవడ్రా... రోడ్డుకు అడ్డంగా నడిచింది..." అంటూ వచ్చారు. నలుగురు ఆగంతుకులు.

    మృదువని ఒక్కడుగు వెనక్కి వేసింది. వాళ్ళు షంషేర్ దాదా మనుష్యులు. జీపు మీద స్పష్టంగా క్వశ్చన్ మార్క్ గుర్తు. మెల్లిగా జనంలో కలిసి, వెనక్కి తప్పుకుంది మృదువని.

    "ఎవరో తాగి అడ్డంగా  వచ్చాడు... వేస్ట్ ఫెలో..." అంటూ ముందుకు కదిలారు. ఇంతలో ఏదో అనుమానం వచ్చినట్టు వెనక్కి వచ్చారు. మృదువని అక్కడ్నుంచి జారుకుంది.

    షంషేర్ దాదా మనుష్యులు జేమ్స్ దగ్గరకి వచ్చి "నీ పేరేమిటి బే" అని అడిగారు.

    "బ్యాగ్ పైపర్... మై నేం ఈజ్ బ్యాగ్ పైపర్" అంటూ తూలుతూ ముందుకు కదిలాడు.
   
                                                  ***
    షంషేర్ దాదా మనుష్యులు వెళ్ళే వరకూ ఆగి, తరవాత జేమ్స్ దగ్గరకి వెళ్ళింది మృదువని. అతను పూర్తిగా మందు మత్తులో వున్నదని అర్దమైంది. అతని వాలకం చూస్తావుంటే చాలా బాధగా వుంది మృదువనికి. గడ్డం పెరిగి, బట్టలు మాసివున్నాయి.

    ఎప్పుడూ ట్రీమ్  గా వుండే జేమ్స్ యిలా మారిపోవడం భరించలేకపోతోంది. అతడ్ని  ఓ బోర్ దగ్గరకు తీసుకెళ్ళి, తల మీదుగా నీళ్ళ ధారా పెడేలా కొట్టింది. చలిలో ఓ గంట పాటు వుండిపోయింది.
   
                                                   ***

    "జేమ్స్... ప్లీజ్! ఒక్కసారి సృహలోకిరా... అయాం మృదువని... శరణ్య ప్రెండ్ ని... స్ప్రుహలోకిరా జేమ్స్..." అతడి భుజాలు పట్టి కుదుపుతూ అంది.

    "నాకు తాగాటానికి ఏమైనా కావాలి...విస్కీ, బ్రాందీ, ఎత్లిస్ట్ విషం... విషమైనా ఫర్లేదు... ఎందుకో తెలిసా... యూ... నో... మై లావ... మై శరణ్య... లేదు. గాన... గాన అవుట్" జేమ్స్ ఏడుస్తున్నాడు.

    ఆ క్షణం జేమ్స్ ని చూస్తోంటే గుండె తరుక్కుపోతోంది.

    "జే..మ్స్.. ప్లీజ్! ఒక్కసారి జరిగింది గుర్తు తెచ్చుకో." అంది మృదువని.

    వాళ్ళిద్దరూ ఓ స్లం ఏరియాలో పాడుబడిన యింట్లో వున్నారు. అక్కడైతే షంషేర్ దాదా మనుష్యుల బారి నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచన మృదువనిది.

    జేమ్స్ స్పృహలోకి వస్తేగానీ, అసలు విషయం తెలియదు... అందుకే చాలా ఓపిగ్గా గడ్డ కట్టించే చలిని కూడా భరిస్తూ జేమ్స్ ఎదురుగా వుంది మృదువని.

    జేమ్స్ ఏదేదో గోణుకుతూ నిద్రలోకి జారుకున్నాడు. మృదువనికి నిద్ర రావటంలేదు. కన్ను  మూస్తే జేమ్స్ ఎక్కడ చెప్పా పెట్టకుండా పారిపోతాడేమోనని భయం. కనీసం చలిమంట చూసి ఎక్కడ షంషేర్ దడ మనుష్యులు తనను గుర్తుపడతారోమోనన్న భయం ఆమెది.

    అందుకే అలానే చలికి వణుకుతూ, పాడుపడిన ఆ గోడకు జారిగిలపడి జేమ్స్ ఎదురుగా కూచుంది ఆ రాత్రంతా మృదువని.

    అప్పుడు సమయం అర్దరాత్రి పదకొండూ నలబై. అదే సమయంలో_
   
                                                   ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS