Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 35

    లాక్ వూడి చేతుల్లోకి వచ్చింది.
    విస్మయంగా చూస్తొంది మౌన.
    వెంటనే వెళ్ళి భస్మకు అడ్డుగా నిలబడింది.
    "భస్మా.. భస్మా.. బ్శామా...క్విక్.."
    తల విదిల్చి మౌనను నేట్టేశాడు. డబ్బున పడింది నేలమీద. తలకు తగిలింది. చిన్న ఆర్తనాదం ఆమె గొంతులో నుంచి.
    డోర్ తెరచి బయటకుఅడుగు పెట్టబోయిన భస్మ ఆగి,వెనక్కి తిరిగి నేలమీద పడ్డ మౌనకు చేయిచ్చి లేపాడు.
    మౌన విభ్రాంతిగా చూస్తొంది.
    మౌన చేతిని తన చేతిలోకితెసుకుని... ఏదో గుర్తు చేసుకుని అన్నాడు.
    "హా..లో..హా..లో..హా..లో.. అయాం... అయాం..."
    మౌన విబ్రాంతిలో నుంచి అబ్బురంలోకి వచ్చింది.
    ఆమె గుండె వేయి గొంతుకలై, కోయిల కూజితాలుఆలపించడం సన్నసిద్దమవుతుంది.
    "భస్మ..భస్మ..భస్మ..అను.." అది ఉద్వేగంగా కదిలిపోతూ.
    "హాలో.. అయామ్ భ..స్మ.." అని వెనక్కి ఎగరాలన్న కోరిక, సముద్రంలో ఈత కోట్టాలన్న కోరికా కాలిగాయి.
    ఈ మార్పు  చాలు. అతడ్ని తన ప్రేమ కదిలించగలుగుతుంది.
                                                                            ***
    "డామిట్.. షిట్.." కోపంగా నుదురు కావుతుఉకున్నాడు అగర్వాల్.
    "వాట్ హేపండ్" ఖాన్ అందోళనగా అడిగాడు అగర్వాల్ ని.
    "భస్మ మన సజెషన్స్ యిమిడియట్లీ గా రిసీవ్ చేసుకోవడం లేదు. చెప్పాడు అగర్వాల్.
    "వై.. వై..?"
    "అతను ఓ అమ్మాయి ట్రాప్ లో పడ్డాడు."
    "భస్మనా?"
    "అవును... ఆ అమ్మాయి ప్రేమ అతని మెదడులో స్పందినలను కలుగజేస్తుంది...'
    "మన సైన్స్ కన్నా ఆ అమ్మాయి ప్రేమ గొప్పదా?"
    "గొప్పదే... మనిషిలో కలిగే అనుభూతలను మనం ఏం చేయలేమూ. తను అమ్మాయి ఆకర్షణలో పడిపోయాడు. ఆమె ప్రేమ,కన్పర్స్ లింగ్, అతడ్ని కదిలించి వేస్తున్నాయి. ఆ అమ్మాయి అలాగే అతని వెంట బడితే మనకు చాలా డేంజర్..."
    "డేంజరా ? ఏమవుతుంది?"
    అతని మెదడు మీద మనకు వున్న ఆధిపత్యం పోతుంది. ఎప్పుడైతే తన మెదడు తన కంట్రోల్ లో వుంటుందో, అప్పుడు మనం అతనికి సజెషన్స్ యివ్వలేమూ."
    "వాట్..."
    "నిజం ఖాన్ సాబ్... హిప్నిటిజంలో కూడా అంటే. ఒక హిప్నిటిజంకు గురయ్యే వ్యక్తి బలంగా'తను హిప్నటిజ్ కాకూడదు" అనుకుంటే ఆ హిప్నటేస్ట్ ఏం చేయలేదు. మన పరిస్థితి కూడా అంటే..."
    "ఇప్పుడెలా?"
    "ఆ అమ్మాయిని అతని నుంచి దూరం చేయాలి. ఇఉప్పుదిప్పుడే మొలకెత్తిన ఆ ప్రేమను తుమ్చేయాలి. లేకపోతే... అతని మీద అతి ముఖ్యమైన పట్టు మనం కోల్పోతాం. అది మనకే మరింత ప్రమాదకరం..." చెప్పాడు అగర్వాల్.
    "వెంటనే ఆ అమ్మాయిని చంపేద్దామా?" కరంజయా అడిగాడు.
    "యూ... పూలిష్ గా మాట్లాడొద్దు. ఎప్పుడు ఎవర్నీ చంపాలో నాకు తెలుసు. ఆ అమ్మాయికి వార్నింగిచ్చి వదిలేయండి. లల్లోరామ్ ని పంపించండి.
    ఆ అమ్మాయి వివరాలు తెలుసుకుని ముందు వాళ్లింట్లో హడావిడి స్పష్టంచాలి. ఇంటిని డామేజ్ చేయండి. అలా వాళ్ల పెద్దలను బెదిరించి భస్మ గురించి అలోచించోద్దని, ఆ అమ్మాయికి వార్నింగివ్వండి" చెప్పాడు ఖాన్.
                                                                         ***
    "ఏయ్... ఏంకావాలి మీకు? ఏం చేస్తున్నారు?"
    అడిగింది కోపంగా బామ్మ.
    ఎవరో తలుపుతడితే, బామ్మ తలుపు తీసింది. తలుపు తీయగానే ఆగంతుకుడు లోపలకి వచ్చాడు. అతని వెనకే మరో నలుగురు రౌడి వున్నారు.
    ఆ ఆగంతుకుడు లల్లూరామ్.
    లల్లూరామ్ ఏం మాట్లాడకుండా... డ్రాయింగ్ రూమ్ లోకి రూమ్ లో వున్న టి.వి తెచ్చి నేలకేసి కొట్టాడు. పెద్దశబ్దం చేసి ఆ టీవీ పగిలిపోయింది. అలమార్లు, గాజుసామాను, గ్లాసులు, రేడియో,విసిఆర్ అన్నీ ద్వంసం చేశారు. అడ్డొచ్చిన బామ్మను నెట్టేశారు.
    ఆ ఇంట్లో అరగంటపాటు బీభత్సకాంత కొనసాగింది.
    టెలీఫోన్ వైర్లు పీకేశారు.
    అరగంట తర్వాత ఇంటిని చిందరవందర చేసి "ఇదిగో...నీ మనసు చెప్పు... మరోసారి మా భస్మ దగ్గరకి రావద్దని... వచ్చిందా... ఈసారి మనవరాలు బ్రతికి వుండదు" లల్లూరామ్ వార్నింగ్ యిష్యూ చేసి వెళ్ళిపోయారు.
                                              ***
    ఇంట్లోకి అడుగుపెట్టిన మౌన ఇంట్లో జరిగిన బీభత్సం చూసి బెదిరిపోయింది.
    "ఏమైంది బామ్మ..."
    "నువ్వు ప్రేమించిన హీరోగారి తాలూకు విలన్లు వచ్చి యిలా ఇంటిని అలంకరించి వెళ్ళారు" తాపీగా చెప్పింది బామ్మా.
    "బామ్మకు మతిగానీ తప్పిందేమొనన్న అనుమానం కలిగింది. లేకపోతే, యింత డామేజీ జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు వుంటుందా?"
    పిచ్చితల్లీ... ఇలాంటివి ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు. వీటికి భయపడితే ఇలాగే తల్లీ. కాకపోతే యిక నుంచి అన్నా రెండేసి సెట్లు చొప్పున తెప్పించుకుంటే సారి. నువ్వు మాత్రం జాగ్రత్తగా వుండు తల్లీ... అంది బామ్మ.
    బామ్మ పెద్దమనసుకు చలించిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS