గీ|| చిన్న చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్ళు
నాగులేటినీళ్ళు నాఁపరాళ్ళు
సజ్జజొన్నకూళ్ళు సర్పంబులును దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు 326
క|| జొన్నకలి జొన్నయంబలి
జొన్నన్నము జొన్నపిసరు జొన్నలె తప్ప
సన్నన్నము సున్న సుమీ
పన్నుగఁ బల్నాటి సీమ ప్రజ లందఱకు. 327
త్రోవను మంచినీరు దొరకక చెప్పినది:-
క|| సిరిగలవానికిఁ జెల్లును
దరుణులు పదియాఱు వేలఁ దగఁ బెండ్లాడ
దిరిపేమున కిద్దరాండ్రా
పరమేశా! గంగ విడుము పార్వతి చాలు. 328
ఒకప్పుడు పల్నాటిలో నొకరింట నీతనికి జొన్నకూడును, జింత చిగురును బచ్చలియాకును గల్పివండిన యుడుకుఁగూరయు, వడింపఁగా జెప్పిన పద్యము-
ఉ. పుల్లసరోజనేత్ర! యలపూతనచన్నుల చేఁదు ద్రావి నాఁ
డల్లఁ దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేల త్రింత్రిణీ
పల్లవయుక్తమౌ నుడుకుబచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన యొక్క ముద్ద దిగ మ్రింగుము! నీపస కాననయ్యేడి 329
గురిజాల సిమను గల పులిపాడనుగ్రామమునకు శ్రీనాధుఁడు పోఁగా నాతని యెడ నచ్చటి శేషయ్య యనుకరణమును హనుమయ్య యను కాఁపును పుల్లయ్య యను రెడ్డియును ననాదరము చూపిరట! దానిపై నాతఁడు చెప్పిన పద్యము-
గీ. ఊరు వ్యాఘ్రనగర మురగంబు కరణంబు
కాఁపు కపివరుండు కనవు నేఁడు
గుంపు గాఁగ నిచట గురిజాలసీమలో
నోగు లెల్లఁ గూడి రొక్క చోట! 330
నెమలూరు పైఁ జెప్పినది.
క. నెమలిపురి యమపురముగా
యముఁ డాయెను బసివిరెడ్డి యంతకు మిగుల
యమదూతలైరి కాఁపులు
క్రమ మెఱుఁగని దున్నలైరి కరుణా లెల్ల! 331
ఆడిగొప్పుల పై జెప్పినది.
క. గుడిమీఁది క్రోఁతి తోడను
గుడిలో వలినంబివారి కోడలి తోడ
నడి వీధిలంజె తోడను
నడిగొప్పులయోరుగాలి నడిగితి ననుమీ! 332
మనర(?) రాజ్యముపైఁ జెప్పిన పద్యములు-
ఉ. గొంగడి మేలుపచ్చడము కుంపటి నల్లులు కుక్కి మంచము
జెంగట వాయుతైలము లజీర్ణపు మందులు నుల్లిపాయలు
ముంగిట వంటకట్టియల మోపులు దోమలు చీఱపోతులు
రంగ! వివేకి కీమసరరాజ్యము కాఁపుర మెంతరోఁతరా! 333
ఉ. వంకరపాగలు నడుము వంగినకత్తులు మైలకోఁకలు
సంకటిముద్దలుం జనుపశాకములుం బలుపచ్చడంబులుం
దెం కగునోర చూపులును దేఁకు వదదప్పిన యేసబాసలు
ఱంకుల బ్రహ్మ యీ మసరరాజ్యము నెట్లు సృజించె ? నక్కటా! 334
ఉ. అదరణంబు సున్న వినయంబు హితంబును బొంకు సత్యమా
లేదు దయారసం బది హుళిక్కి వసాపడువేళ పజ్క్తిలో
ఖేదపుఁబెట్టు దిట్టబలిభిక్షముఁ ..........................త
త్వాదులఁ బుట్టఁ జేసిన విధాత ప్రజాపతి గాక యుండునె! 335
రేనాటిని గూర్చి --
క. గరళము మ్రింగితి నంచుం
బురహర! గర్వింపఁబోకు పో! పో! పో! నీ
బిరు దింకఁ గానవచ్చెడి
మెఱ సెడి రేనాటి జొన్న మెదుకులు తినుమీ! 336
పడమటిసీమ వ్యాపారులపైఁ జెప్పిన పద్యము --
శా. దస్త్రాలు మసిబుఱ్ఱలుం గలములుం దార్కొన్న చింతంబళుల్
పుస్తుల్ గారెడు దుస్తులుం జెమటకంపుం గొట్టు నీర్కాపులుం
అస్తవ్యస్టపుఁ గన్నడంబును భయంబై తోఁచు గడ్డంబులు
'వస్తూ చూస్తిమి రో స్తిమి' బడమట వ్యాపారులం గ్రూరుల. 337
శబరకాంతలు :-
క. గిటగిటనగు సెన్నడుముల
పుటపుటనగుచన్నుఁగవలు వున్న మనెలతో
జిటపోటలాడేడు మొగములు
కటితాటములకొమరు శబరకాంతలకమరున్. 338
గీ. వీనులకు విందులై తేసేసోన లేనయ
ముందురాగంబునను జగన్మోహనముగ
పాడె నొక జాలరిమిటారి యీడు లేని
కాకలీనాదమున నోడగడపుపాట! 339
శ్రీనాధుఁడు పద్మసాలెమిటారి పైఁ జెప్పినపద్యము.
సీ. వడుగేరుచోఁ జూచుఁ గుడియెడమల యందు
సంచరించేడివిట సముద్రయములఁ
బోగులు గట్టుచో బోరుగిండ్ల చిన్న ప్రా
యపుటింతులకు నుపాయములు గఱపుఁ
గండేలుచుట్టుచోఁ గన్బోమసై ఁగతో
సొగసుకాండ్రకుఁ డెంకిచోటుఁజూపు
అచ్చు వేయదకుచో హాస్యరసంబునఁ
జెలికత్తెలను మాఱుపలుకరించు
గీ. నావలీవలి సతులతో హాస్యమాడు
మోకుబిగియించుచొఁ బతిమోసపుచ్చుఁ
గుంచేపిడి వట్టియీడ్చుచుఁ గొమరు ముగులుఁ
బద్మసాలేది వగఁదేఱి బలుమిటారి! 340
జంగమురాలి మీఁదఁ జెప్పినది :-
క. చెవి నివి నీలపురాలా
యువిదరో నిను రతులఁ దనుప నొకనితరాలా
యివి రుద్రాక్షసరాలా
జవరాల మహాత్మురాల జంగమురాలా!
ఒకప్పుడు ధనలబ్ది తనకు లేకపోఁగాఁ జెప్పినది:-
మ. కవితల్ సెప్పినఁ బాడనేర్చిన వృధాకష్టంబె యీబోగపుం
జవరాండ్రేకద భాగ్యశాలినులు పుం స్త్వంబేల పో పోఁచకా
సవరంగా సొగసిచ్చి మేల్ యువతివేషం బిచ్చి పుట్టింతువే
నెవరు మెచ్చి ధనంబు లిచ్చేదరుగాదే పావపుం దైవామా 342
రాజమహేంద్రవరమున శాస్త్ర పండితులలో వివాదపడి చెప్పిన పద్యములలో నొకటి:-
మ. శ్రుతి శాస్త్ర స్మృతు లభ్యసించుకొని విప్రుం డంత నానాధ్వర
వ్రతుఁడై పోయి కను బురందరపురారామద్రుమానల్పక
ల్పతరుప్రాంతాలతాకుడుంగ సుఖసుప్తరంభాగంగనా
ప్రతి ....ంకురపాటనక్రమ కళాపాండిత్య శౌండీర్యముల్ 343
