కీర్తి గదిలోకి వెళ్ళిం తరువాత పరికిణా సవరించుకోబోతూ ఓర కాంతితో కిటికీ వైపు చూసింది.
కిటికీ తలుపులు దగ్గరగ వేసి వున్నాయి. అరంగుళం మాత్రమే తెరిచి వన్న తలుపు సందులోంచి ఓ జత కళ్ళుతన చర్యలని రహస్యంగ కనిపెట్టబోతున్నాయి అని గ్రహిస్తూనే క్విక్ గ ప్లేటు మార్చింది.
కీర్తి తలుపు మళ్ళీ తెరచి తలకాయ బైటికి పెట్టిదొంగ చూపుల్లా అటూ యిటూ చూసింది. వెంటనే తలుపు గడియ పెట్టి పిల్లిలా నడుస్తూ కిటికీ దగ్గరకు వచ్చింది. కిటికీ అవతల వున్న మనిషి ప్రక్కకి తప్పుకున్నాడు.
కీర్తి కిటికీ తలుపులు బార్లా తెరిచి చూసి మళ్ళీదగ్గరగ వేసింది.
కిటికీ అవతల మనిషి మళ్ళీ కిటికీ దగ్గర చేరాడు. చాలా కొద్దిగ కిటికీ తలుపులని తెరిచాడు. ఆ సందులోంచి లోపలి చూడటం మొదలు పెట్టాడు.
"నీ బి.పి, పెంచుతాను చూడరా మిడతం బొట్టూ" అనుకుంది కీర్తి.
"చిక్కావు పిల్లా." అనుకుంటూ కుతూహలంగ చూడటం మొదలు పెట్టాడు కిటికీ అవతల వున్న నౌకరు.
కీర్తి అడుగులో అడుగు వేస్తూ అలమర తెరిచింది. మళ్ళీ ఓ సారి అటూ యిటూ బిత్తర చూపులు చూసి అలమరలో చేయి పెట్టింది.
కిటికీ అవతల వున్న నౌకరు మరికొంచెం కిటికీతలుపులు తెరిచి లోపలి మహా ఆత్రుతగా చూడటం మొదలు పెట్టాడు.
కీర్తి తనలోతాను నవ్వుకుని అలమరలోంచి వారపత్రిక తీసింది. వారపత్రికలో మధ్యలో వున్న బొమ్మసినిమా హీరోది.
సినిమా హీరో చిత్రాన్ని పదేపదే ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత హీరో చిత్రాన్ని అలాగే గుండెమీద పెట్టుకుని మంచానికి అడ్డంగ పడుకుంది. ఛీ....ఛీ....అబ్బా...పో బాబూ....పో....ఇలా నెమ్మదిగా అనుకుంటూ నిట్టూర్పులు విడవటం మొదలు పెట్టింది.
కీర్తి చేసిన పని ఎవరైనా చూస్తే వకేరకంగ అనుకుంటారు. అందులో సందేహం లేదు. కొందరు ఈ డోచ్చిన అమ్మాయిలు అదైనా విజ్ఞానం లేని మదపిచ్చి మదవతులుకోరి కలని అరికట్టలేక అందమైన హీరో బొమ్మలని ముద్దు పెట్టుకోటం మరికొన్ని వెర్రి పనులు చేస్తుంటారు. ఇప్పుడు కీర్తి చేస్తున్న పని అదే.
కీర్తి నటన అమోఘంగ పని చేసింది. కిటికీ అవతలనుంచి కీర్తి చేష్టలని కనిపెట్టి చూస్తున్న నౌకరు. "అసి దీనిసిగతరక దీనికి వళ్ళు బలిసి కోరికలు పెరిగి ఏం చేయాలో తెలియక చాటుగ చస్తున్నది. ఒక్కసారి ఈ గొడ్డుని రంగంలోకి దింపితే సరి..." కశికశిగ అనుకున్నాడు."
కొద్దిసేపు వుండి నౌకరు వెళ్ళి పోయాడు.
నౌకరు కిటికీ దగ్గర నుంచి పూర్తిగ వెళ్ళిపోయాడు అని నమ్మకం చిక్కిం తరువాత కీర్తి లేచి గదిలోంచి బైటికి వచ్చింది.
కీర్తి యింతకు క్రితం చేసిన పనివల్ల ముందు ముందు ఓ ప్రమాదాన్ని కోరి ఆహ్వానించినట్లయింది. అయినా తప్పని పరిస్థితి వచ్చిపడి నప్పుడు నిప్పులో వేలు పెట్టాలన్నా పెట్టాల్సిందే.
తను గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న తర్వాత కిటికీ లోంచి ఎవరో తన్ని చూశారన్నది కీర్తి గమనించిందిగాని ఆ మనిషి ఎవరన్నది తెలుసుకోలేక పోయింది. కారణం డైరెక్టర్ గ అతనెవరన్నదిచూడక పోవటమే.
కీర్తి గదిలోంచి బైటికి వచ్చి గది తలుపులు దగ్గరకు వేసి అవతలికి వెళ్ళింది. కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ గది దగ్గరకు వచ్చింది. గది తలుపులు కాస్త తెరిచి వుండటం చూసి నెమ్మదిగ కిటికీ దగ్గరకు చేరింది. ఇందాక నౌకరు చేసినట్లే కిటికీ తలుపు ఓరగ తెరిచి గదిలోకి చూసింది.
గది లోపల నౌకరు సంగయ్య అలమరలోని పుస్తకాలు పరిశీలించి చూస్తున్నాడు.
అలమరలో వున్నవి సినిమా బొమ్మల పత్రికలు, చందమామ, బాల మిత్రలు, కొన్ని బొమ్మలు, రంగు రంగుల గాజులు, పూసల గొలుసులు, రిబ్బెనలు, వాడిపోయిన పూలు వున్నాయి. ఎంతో ముందుచూపుతో కీర్తి వాటిని అలమరాలో పెట్టింది.
నౌకరు సంగయ్య గదిలో అన్నీ పరిశీలించి బైటికి వచ్చాడు. అప్పటికే కీర్తి అక్కడ నుంచి తప్పుకుంది.
కీర్తి అక్కడ నుంచి వెళ్లి వరండా మెట్లమీద మూలకి ఆనుకుని కూర్చుంది. నోట్లో బొటన వేలు వేసుకుని చీకుతూ ఆ వేలు ఎవరికీ కనపడకుండా వుండటానికి వోణీ అడ్డు పెట్టుకుంది.
వేలు నోట్లో పెట్టుకుని చీకటం అన్నది చాలా చండాలమైన అలవాటు, పాడు పద్దతి, అసహ్యకరమైన విషయం, పల్లెటూరి తెలివి తక్కువ పిల్ల అవతారం ఎత్తిన కీర్తి ఆ పాత్రకి వేలు చీకటం నప్పుతుందని అలా చేస్తున్నది. కాని ఎవరన్నా చూసి నప్పుడు తప్ప కీర్తి నోట్లో వేలు వేసుకోటం లేదు ఓణీ కొంగు నోటి కడ్డుగ వుండటం వల్ల కీర్తి చేసే పని ఎవరూ తెలుసుకోలేకపోయారు.
అలాగే కీర్తి తెలివి తక్కువ దానిలా ప్రవర్తిస్తూఇల్లంతా తిరిగేది. తింగరి దానిలా మాట్లాడుతూ అన్నింటిలో వేలు పెట్టేది. దాని వల్ల ఈ పిల్ల వెర్రి మొద్దు అని వాళ్ళనుకుంటున్నారు. కీర్తి చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నది. ఆ పల్లెటూరిలో కీర్తి వేసిన వేషము, ప్రవర్తన ఆ పాత్రకి సరీగా సరిపోయింది.
కీర్తి ఆ యింటికి వచ్చిన వారం రోజుల్లో ఇల్లు వాకిలి అంతా తిరిగి చాలా విషయాలు తెలుసుకుంది. కల్పించుకుని మాట్లాడుతూ అందరికి దగ్గరగ తిరిగేది. దాశీదానికి అనుమానం రాకుండా ఓ రోజు సతీదేవితో కలసి నాటకం ఆడింది. అది కూడా మంచిదే అయింది.
