Previous Page Next Page 
రామాయణము పేజి 34

    'తృణమా' ఈ రావణునితో నేను భాషించను. నిన్ను ఈ రావణునిగా భావించి వీనికి చెప్పవలసినది నీకు వచించెదను, వినుము: రావణా, అన్యులమెప్పు వాంఛనీయము కాని ఆత్మస్తుతి తగదు. నీవు భావించుచున్నట్లు నీవు పరాక్రమశాలివి కావు; పిరికిపందవు! పంచవటి యందలి పర్ణశాలలో నేను ఒంటరిగా నున్నప్పుడు నీవు చోరుని వలె ప్రవేశించి నన్నపహరించి తెచ్చినావు! సూర్యుని నుండి తేజమును విడదీయలేనట్లు శ్రీరామచంద్రుని నుండి నన్నెవరును వేరు చేయలేరు. నీ ఐశ్వర్యము నాకక్కరలేదు. నీ రాణులపై ఆధిపత్యమును వలదు. అగ్నిసాక్షిగ చేపట్టిన ఆ సతులనందరనూ నీవు దక్షిణ నాయకుడవై ఏలుకొనవలెను.... పరదారాసక్తి నిన్ను నాశనము చేయనున్నది. నిన్నే కాదు, రాక్షస కులము నంతను క్షయముచేయును. శ్రీరామచంద్రుడు బక్క మానవుడు కాదు; దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మ సంస్థాపనము చేయుటకు మానవుడుగా అవతరించిన శ్రీమన్నారాయణుడు! బాల్యముననే ఆ మేటి ధానుష్కుడు తాటకను వధించినాడు. మారీచుని సముద్రమున పడగొట్టినాడు. సుబాహువును సంహారించినాడు. విరాధునీ కంబధునీ కూల్చినాడు. ఖరదూషణులనూ పదునాలుగువేల దానవ వీరులనూ రెండవవాని సాహాయ్యము లేకుండ హతమార్చిన మహావీరుడు శ్రీరాముడు!... ఓయీ రావణా నా హిత వాక్యములను వినుము. నన్నిప్పుడే కొనిపోయి శ్రీరామచంద్రుని కర్పించి ఆ మహనీయుని క్షమాభిక్షణు వేడుకొనుము. ఆ శరణాగత త్రాత నిన్ను కరుణించి వదలివేయును.
    వృక్షశాఖపై నుండి వినుచున్న హనుమంతుడు సీతాదేవి ధైర్యమున కచ్చెరువును చెందినాడు.
    రావణుడాగ్రహావేశముతో ఒఱ నుండి ఖడ్గమును పెఱుకుచూ "సీతా, నీవు నన్నవమానించితివి! నిన్నిప్పుడే సంహరించెదను!" అనుచు ఆమెను సమీపించబోయినాడు. దానవేంద్రుని పరివారమందలి 'ధాన్యమాలిని' యను అసుర భామిని అడ్డువచ్చి "రక్షోవల్లభా శాంతించుము, స్త్రీ హత్యకు పాల్పడి నీ ప్రతిష్ఠకు భంగమును కలుగనీయకుము" అని వారించినది. రావణుడు కావలియున్న స్త్రీలతో, "మిగిలియున్న రెండు నెలల గడువులో నయముననో భయముననో మీరామెను మార్చవలెను. ఆలోపున ఈమె నన్నంగీకరించనిచో మీరీమెను చంపి వైచి భక్షించవచ్చును" అని చెప్పి పరివారముతో మరలిపోయినాడు.
    పరివేష్టించియున్న రాక్షసాంగనలు జానకితో "పాదములపై పడిన అదృష్ట దేవతను తన్ని పొమ్మనుచుంటివేమి? మూర్ఖత్వమును వీడి దనుజ వల్లభుని పొందునకంగీకరించుము. మేము రెండు నెలలు ఆగము. సూర్యుడుదయించుటతోనె నీ అంగీకారమును మాకు తెలుపకున్నచో రేపే నిన్ను తినివేయుదుము" అని బెదరించినారు. ఆ భయంకరాకారాలు ఆమెకు చెప్పి చెప్పి అలసిపోయి ఆ ఉషోదయ కాలమున నిద్రకు లోనైనారు.
    మైథిలి ఆ మనుజాశనలు తెల్లవారుటతోనె తనను చంపివేయుదురని భయపడినది. ఆమె మెల్లగా లేచి రాక్షసాంగనల వలయము నుండి ఈవలకు వచ్చి శింశుపా వృక్షము క్రింద కూర్చొని రోదించినది. "శ్రీరామచంద్రా, సౌమిత్రీ, నన్ను రావణుడిక్కడ ఉంచినాడని మీకెట్లు తెలియును? మీరెప్పుడు వచ్చి నన్ను రక్షించెదరు?"
    వృక్షశాఖపై నుండి వినుచున్న హనుమంతుని హృదయము ద్రవించినది. ఆమె ముందునకురికి నిలిచి అమ్మా, నీకు కష్టకాలము అంతముకానున్నది' అని ధైర్యమును చెప్పదలచినాడు. కాని మరుక్షణముననె అతడు 'నేను హఠాత్తుగా ప్రత్యక్షమైనచో ఈ సాధ్వి నన్ను కూడ ఇచ్చటి రాక్షస మాయలో భాగముగా భావించి హడలిపోవును. కనుక కనపడకుండగనే నేనీమెకు రామదూతనని తెలియపరచెదను' అని నిశ్చయించుకొనెను.    
    హనమతుడు భూపుత్రుకి వినపడునంత బిగ్గరగా రామకథను చెప్పుట ప్రారంభించేను. "ఇక్ష్వాకు వంశస్తుడగు దశరథ మహారాజునకు రామలక్ష్మణ భారత శత్రుఘ్నులను పుత్రులు కలరు. జేష్టడును యువరాజు కావలసినవాడును అగు రాముడు తండ్రి మాటను  నిలబెట్టుటకు వనవాసమునకు పోయెను. రామునితో అతని సతి సీతయూ తమ్ముడు లక్ష్మణుడునూ కూడ అరణ్యవాసమునకు పోయినారు. పర్ణశాలలో  ఒంటరిగా ఉన్న సీతను దుర్మార్గుడగు దానవుడు రావణుడు అపహరించి తెచ్చి తన పురమందలి ఈ అశోక వనమున ఉంచినాడు".   
    సీత : (సంభ్రమాశ్చర్యములతో) నా దీనగాధము వచించుచున్న దయార్ధ్ర హృదయుడేవరు? ఇచ్చట ఎవరునూ కనుబడుటలేదు.   
    హనుమంతుడు : అమ్మా నేను శ్రీరామచంద్రుని దూతను. ఈ పడపము పైననే ఉన్నాను. డిగివచ్చి నీ మరోల నిలిచేదను.  
    అతడు నిలువెత్తు దేహముతో ఆమె సమక్షమున నిలిచి నమస్కరించినాడు; తాను తెచ్చిన అంగుళీయకమును మైథలికిచ్చి "అమ్మా నేను నిన్ను కనుగోన్నప్పుడు  ఈ ఉంగరమును ఆనవాలుగా నీకిమ్మని అదేశించుచు శ్రీరామచంద్రుడు నా కోసంగినాడు" అన్నాడు. దాని నామే కళ్ళకు అడ్డుకోనచూ ఆనందముతో "నా తండ్రి జనకమహారాజు నా కళ్యాణము నాడు వరుడు శ్రీరామునకి ముద్రికను కానుకగా నిచ్చినాడు. నాకిప్పుడిది నయనానంద కరమైనా నాథుడు నాముందే ఉన్నాడనిపించుచున్నది!.... వానరోత్తమా నాకీ మేలోనరించిన నీవేవ్వరివో ఇంచుక తెలియజేయుము" అన్నది.   
    హనుమంతుడు :  అమ్మా నా తండ్రి పేరు కేసరి; నా తల్లి నామధేయము అంజని, అందువలన నాకు 'అంజనేయుడు' అను అభిధానమూ ఉన్నది. నేను వాయుదేవుని వారము వలన జనించినాను. కానుక పావనియనియూ 'మారుతి' యనియూ కూడ పిలిచెదరు......  నేను వానర సామ్రాజ్య ధిపతి సుగ్రీవుని మంత్రివర్గములోని వాడను. ఋశ్యమూక పర్వతముపైన సుగ్రీవుడోకనాడు అమాత్యులతో సమావేశమై యుండగా రావణుడు నిన్నేత్తుకుని పోవుచున్నప్పుడు నీవు పడవైచిన నగల మూట వారిమధ్య పడినది. తర్వాత రామలక్ష్మణులు నిన్ను అన్వేషించుచూ ఋశ్యమూకన కేతెంచినారు. వారికి సుగ్రీవునితో మైత్రి కలిగినది. సుగ్రీవుడు నిన్ను అన్వేషించుటకు  పంపిన బృందములో నన్ను కూడ చేర్చినాడు. నీవు లంకాపురియందున్నావని తెలియరాగా ఆ వార్తను రూఢీచేసికొనుటకు నూరు యోజనముల సముద్రమును లఘించి వచ్చినాను. నిన్నిక్కడ కనుగొనుటయు, శ్రీరామచంద్రుని అంగుళీయకమును నీకు సమర్పించుటయు జరిగినవి కానుక నేనింక మరలిపోయెదను. నేను నీ మాటలుగా శ్రీరామచంద్రునకు ఏమీ చెప్పావలేనో తెలియజేయుము.   
    సీత : ఇంతకుముందిచ్చటకు వచ్చి వెడలిన రావాణాసురుని ప్రవర్తనను గమనించితివి కదా?    
    హనమంతుడు : గమనించితిని . అప్పుడు నాకు చెట్టుపై నుండి వానిపై ఉఱికి వాని దశగ్రీవాములను వధించవలసినది శ్రీరామచంద్రుడని గుర్తునకు వచ్చి అగ్రహామును అణచుకొన్నాను. నీవు భయపడకుము. నేను పోయి నీ విచ్చట నుంటివని చెప్పుటతోనే శ్రీరామచంద్రుడును సుగ్రీవుడును, భావి కార్యక్రమమును నిర్ణయించెదరు. ఆనతికాలములొనే అనురుడుసంహరింపబడుటయు నీవు రక్షింపబడుటయు జరుగును.
    సీత : నాకు కావాలిగా ఉన్న ఆ రాక్షసస్రీలు నన్ను రేపటి దినముననే భక్షించెదమన్నారు.
    హనుమంతుడు : అది బెదరింపు మాత్రమె. రావణుడు పెట్టిన రెండు నెలల గడువు లోపల నీకెట్టి హానియూ జరగదు.       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS