అంటే! అదేదో పత్రిక... అనూష ఫోటోలనీ వేశాడు...."
"అతనే... తొలి కిరణం అనే పత్రిఅక్ ఎడిటర్. ఆ పత్రిక అతని స్వంతం."
"ఐసీ.... జర్నలీస్ట్ అంటే మంచి ఆదర్శాలు, ప్రోగ్రేసిస్ థాట్స్ వుంటాయి. పైగా అతను స్రీలాకోసం ప్రత్యేకంగా పేజీలు కూడా కేటాయించి అర్ట్ కల్స్ వేస్తుంటాడు కదూ! మంచి కుర్రాడేనే. అనూష ఎందుకు ఒప్పుకోవడంలేదు?" సాలోచనగా అన్నాడు.
వీణ మరింత ఉత్సాహంగా చెప్పింది. "అదే నేననేది. మూర్ఖంగా వాకిటి ముందు నిలబడ్డ అదృష్టం కాలదన్నుకుంటోంది. మీరు ఎలాగైనా ఒప్పించాలి."
అయన నవ్వాడు... " ఓ.కె నీ ప్రయత్నం నేను చేస్తాను...."
"థాంక్యూ డాక్టర్! వస్తాను" లేచింది.
"ఓ.కె గుడ్ లక్!"
వీణ నిస్చ్చంటగా లేచి, తిరిగి అనూష కోసం చూసింది. అప్పుడే అనూష తన గదిలోకి వచ్చి, చేతులు కడుక్కుంటోంది.
"హాయ్... డార్లింగ్!" హుషారుగా పలకరించింది వీణ.
"బతికుతున్నావా?" అడిగింది అనూష.
"ఆ విషయం ఫోన్ చేసి కానీ, ఇంటికి వచ్చిగానీ తెలుసుకోవడం మంచి స్నేహితురాలిగా నీ భాద్యత."
నెప కిన్ తో చేతులు తుడుచుకుంటూ వచ్చి, కూర్చునినవ్వింది "నువ్వెందుకు స్టయిక్ చేస్తున్నావో నాకు తెలుసు కదా! ఎన్నాళ్ళు చేస్తావో చూద్దాంలేమ్మని వూరుకున్నాను... ఇంతకీ ఏంటి సంగతి? ఇలా దయ చేశారు?"
వీణ జడ్జిమెంట్ కాఫీలు అనూష అ కాగితాలు తీసుకుని చూసింది.
"ఓ! కంగ్రాట్స్. పోనీలే.... సుసీలకీ ఇంత కాలానికి ఓ మంచి జరిగింది. అతను... సుశీల భర్త బాగా సంపాదించాట్ట. కనీసం పదిలక్షలన్నరావచ్చేమో కదూ!"
"రావచ్చు...."
'మొత్తానికి సాధించావు. ఇలాంటి మరెన్నో కేసులు విజయవంతంగా పూర్తిచేసి, దగాపడుతున్న స్రీలకి న్యాయం చేయాలని, ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని దీవిస్తున్నాను."
థాంక్స్!మంచి పనులు చేయాలనే నా కోరిక. కానీ, కొందరు మూర్ఖులు న కోరిక తెలుసుకోలేక నా మంచి పనిలుకు నిరోధకులుగా తయారవుతున్నారు."
"ఎవరు వాళ్ళు?"
"ఇంకెవరు? నువ్వే."
"నేనేం చేశాను?"
"పెళ్ళి చేసుకో అంటే చేసు కోవేం?"
"బాగుంది. భూమి గుండ్రంగా వుందని టాపిక్ ఎక్కడి కెళ్ళినా ఇటే మారుస్తావేం?"
"ప్రస్తుతం నా టార్గెట్ నీ పెళ్ళి."
"ఇలాంటి టార్గేట్స్ వుండకూడదు."
టార్గెట్స్నినియమాలెం ఉండవు ..."
"ఆ విషయం మర్చిపో. పద మణిని చూసోద్దాం. తన అ రావుగ్యం బాగా లేదట...." అన్నది అనూష లేస్తూ.
"అలాగా!" అంటూ వీణ కూడా లేచింది. ఇద్దారూ కలిసి, మని ఇంటికి వెళ్లారు.
మని బాగా చిక్కిపోయింది.పిల్లల మీద బెంగతో ఆమె కళ్ళు కాంతి కోల్పోయాయి. ఆ టెన్షన్ తో బి.ఫై ఎక్కువై, పడిపోయింది. ప్రస్తుతం రేస్తులో వుంది. వీళ్ళిద్దరినీ చూడగానే బోరున ఏడ్చింది.
"చూసావా అనూ! నా పిల్లాలు నన్ను మోసం చేశారు" అన్నది ఏడుస్తూ.
"మణీ!రెక్కలోచ్చాక పక్షులు, వయసోచ్చాక పిల్లలు ఎగిరిపోరూ!వాళ్ళు నీలాగా ఇంత అటాచ్ మెంటు పెట్టుకుంటే ఎలా వృద్దిలోకి వస్తారు? మన ప్రేమలూ, అనుభందాలూ, అనురాగాలు వాళ్ళ అభివృద్ధి నిరోధకాలుగా మారకూడదు. కొంచెం కంట్రోల్ చేసుకో..." సన్నసన్నగా మందలించింది అనూష.
"నేనూ అదే చెబుతున్నానండి. వినడంలేదు.హాస్పిటల్ కే వెళ్ళడం లేదు. లీవ్ పెట్టేసింది. రోజూ ఏడుపే. అప్పటికీ పిల్లలు అడపా, దడపా పాన్ చేస్తున్నారు.తను ఇట్లా వుంటే ఎట్లా చెప్పండి? నన్నెవరు చూస్తారు?" ఆవేదనగా అన్నాడు మణి భర్త చిన్నయ్య.
"వింటున్నావా మణీ! పిల్లల భాధ్యత వదిలించుకుని, భార్యా భర్తలు చిలకా గోరింకల్లా కొత్త జీవితం ప్రారంభింస్తున్న రోజులివి. నువ్వేంటి చాదస్తంగా... లే... లేచి తయారవు. అలా ఏటన్నా వెళదాం. ఈ నాలుగ్గోడల మధ్య కూర్చూని అనవసరమైన ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకోవడం వివేకం కాదు..." వీణ చేయి పట్టి లేపి కూర్చోబెట్టింది.
"నా ప్రాణానికి ప్రాణంలా పెంచుకున్నాను. ఈ అర చేతుల మీద నడిపించాను. ఇవాళ స్వార్దంతో నన్నూ, నా ప్రేమనీ కాదని వెళ్ళి పోతే ఎలా భరించను చెప్పు?"
అనూష జాలిగా చూసింది.
అనుభందాలు, మమతానురాగాలూ, బాధ్యాతలూ ఎన్నో పెన వేసుకుని వున్న సంసార జీవితంలో నిండా మునుగిపోయింది. మణి అవడానికి డాక్టరైనా, ముందు ఇంటికీ, పిల్లలకీ కేటాయించిన కాలంలో మిగిలిన సమయాన్నే వృత్తికి వెచ్చిస్తుంది. అలాంటిది ఇప్పుడా పిల్లలు తనని వదిలివెడితే ఎలా తట్టుకోగలదు!
"ఆ రోగ్యం పాడు చేసుకుని ణీ వృత్తికి అన్యాయం చేస్తున్నావు మణీ! ఇంకా బోలెడంత జీవితం వుంది... నీ చేతులమీదగా ఎందరికో ప్రాణం పోయాలి... మరెందరో చిన్నారులను ఈ భూమ్మీదకి తీసుకు రావాలి. ఇలా అయిపోతే ఎలా?"
"ఆ రోగ్యం వుండి చేసేదేం వుంది? నాకేం భాద్యతలా? బందాలా? నేను పోయినా నష్టంలేదు. ఈ ప్రపంచంలో చాలామంది గై న కాలజిస్టులున్నారు" నిర్లిప్తంగా అన్నది.
"ఉన్నారు... ఎండుకుండరు? కానీ అందరూ నేలాగే అనుకుంటే! భాధ్యతలంటే కేవల నీ కుటుంభంపట్లా, నీ భర్త పట్లా, నీ పిల్లలపట్లా నువ్వు నేరవేర్చెవని నీ అభిప్రాయం. కానీ భాద్యాట గల డాక్టరుగా ఈ ఈ సమాజంపట్లా, ఈ పౌరుల పట్ల కూడా నీకు కొంత బాధ్యాత వుంది. స్రీ లంతా తమ బాధ్యతలు, బరువులు కేవలం కుటుంబాలకే పరిమితం అనుకోబట్టి ఈ సమాజం ఇలా వుంది. నీకు శక్తి వున్నంతవరకు ఈ సమజానికి నీ వంతు కర్తవ్యాన్ని నేరవేర్చాలి.
