Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 34

    "చెప్పు ప్రద్యుమ్నా... నీకీ అమ్మాయి తెలుసా?" అడిగాడు అంకిత్.

    "ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా?" రెట్టించి అడిగాడు ప్రద్యుమ్న.

    "తెలియదు... ఎవరా అమ్మాయి?" "డిఫెన్స్ చీప్ పర్సనల్ సెక్రటరీనా?"

    "యస్... అంతేకాదు... మోస్ట్ వాంటెడ్ పర్సన్ కూడా..." ఒక్కో అక్షరం వట్టి పలుకుతూ చెప్పాడు ప్రద్యుమ్న.

    ఒక విస్పోటనం తన పక్కనే జరిగినట్టు అదిరిపడ్డాడు.

    "ఏమిటి ప్రద్యుమ్నా! నువ్వంటున్నది?"

    "యస్... డిఫెన్స్ చీఫ్ దగ్గర పనిచేసే ఆ అమ్మాయి దేశ రక్షణ రహస్యాలు వున్న ప్లాపీని దొంగలించింది. ఆ అమ్మాయి మీద డెడ్ ఆర్ ఎలైవ్... వుంది. ఢిల్లీలో ఆమె 'డెడ్ ఆర్ ఎలైన్' పేరుతో పోస్టర్లు కూడా వెలిసాయి.

    కానీ, ఎందుకనో, డిఫెన్స్ సీక్రెట్స్ ని బయటకు స్పేడ్ చేయటం ఇష్టంలేక, ఆ ఇష్యూని సీక్రెట్ గా వుంచారు. ఈ విషయంలో మాకు ఇన్ స్రక్షన్స్ కూడా వచ్చాయి..."

    అంకిత్ స్థానువయ్యాడు. ఒక నమ్మలేని నిజం పదునుతేలిన కత్తిలా మారి, తన గుండెను చీల్చి, ఆ గుండెలో వున్న తన మృదువని గాయపర్చడానికి సిద్దంగా వున్నట్టు...

    ఇది నిజమా...

    కాదు... క కూడదు...

    చేతన్, రాహుల్ లు అలానే చూస్తుండిపోయారు. వాళ్ళకూ నమ్మశక్యం కావడంలేదు.

    "అవును అంకిత్... ఈ అమ్మాయి కోసం డిఫెన్స్, పావులేసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆఫ్ కోర్స్... ఇదంతా అనఫేశియాల్ గా జరిగిపోతుందనుకో... అన్నట్టు మరో విషయం..." అంటూ ఆగి మెల్లగా చెప్పాడు-

    మృదువనిని షంషేర్ దాదా మనుష్యులు కూడా వెంటాడుతున్నారు. ఎందుకో తెలియదు... ఎవరు ఆ పనికి ఉసిగోల్పారో తెలియదు. షంషేర్ దాదా అంటే ఢిల్లీ నగరం వణికిపోతుంది. మాఫియా సామ్రాజ్యంలో అతను కింగ్. డబ్బుకోసం ఎలాంటి నీచనికైనా వెనకాడని వ్యక్తి షంషేర్ దాదా...

    మన దేశ రహస్యాలు విదేశీ గూఢచారులకు అమ్మడం అతని వృత్తి. అలాంటి వ్యక్తి మృదువని అనే అమ్మాయిని చంపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియదు. ఇది అనఫిశాయాల్ గ వచ్చిన వార్త. ఇందులో నిజానిజాలు నాకు కూడా తెలియవు..." చెప్పాడు ప్రద్యుమ్న.

    అంకిత్ కు బుర్ర తిరిగిపోతున్న ఫీలింగ్. అతనికి మెల్లి మెల్లిగా ఒక్కో విషయం అర్ధం అవసాగిమ్ది. అన్ని విషయాలు విస్పష్టమ్మవుతున్నాయి.

    వాలెంటేన్స్ డే నాడు మృదువని ఎందుకు పరుగెత్తుకొచ్చిందో అర్దమైంది. అంటే అ రోజు ప్రాణభయంతో పరుగెత్తుకొచ్చిందా? ఆ ప్రయత్నంలో అనాలోచితంగా తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో  తనని చూపించిందా?

    పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర పరుగెత్తుకు రావడం, టాంక్ బండ్ దగ్గర తనను ఎమార్చడం... అంతా... ప్రాణభయంతో తనను తాను కాపాడుకునే ప్రయత్నం కోసమేనా?

    ఆ రోజు రాత్రి తన తాళం పగులగొట్టి అన్నం తినడం...ఆ సన్నివేశం అతనికి బాగా గుర్తుంది. ఎన్నో రోజులగా అన్నం తిన్నట్టు...ఒక్కోక్షణం అతని మనసు ద్రవించిపోయింది. ఓ వైపు ప్రాణభయంతో, మరోవైపు ఆకలిబూచితో...

    "అంకిత్ అతని మాటలు వినడం లేదు. అతని ఆలోచనలు అన్నీ మధువని చుట్టే... కెమెరా ముందుకు పరుగెత్తుకు రావడం...తనని చూపించడం...

    మృదువని అనాలోచితంగా చెప్పినా, ఆమె మాత్రం అతని గుండెలో నిలిచిపోయింది. అతనో నిర్ణయానికి వచ్చాడు.

    "అంకిత్... ఏయ్... అంకిత్... ఏమిటి ఆలోచిస్తున్నావు?"

    "నా మృదువని ఎలా రక్షించుకోవాలా అని..."

    వాట్..."

    "అవును... ప్రద్యుమ్నా... నేనూ నీతోపాటు ఢిల్లీ వస్తున్నాను..." చెప్పాడు స్థిరంగా అంకిత్.

    మొగుడి ప్రాణాలకోసం సావిత్రి యమధర్మరాజు వెంటపడింది. కానీ తను... మృదువని ప్రాణాలకోసం ఆ మొగుడ్ని అయినాసరే ఎదిరిస్తాడు...
   
                                               ***

    ఒక్కసారిగా మృదువనిలో వెలవెల భావాలు ముప్పిరిగిగోన్నాయి.

    అది ఆనందమో, అనుమానమో, భయమో, ఉద్విగ్నమో... తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, ఢిల్లీ విడిచి వెళ్ళింది. ఇప్పుడు శరణ్య ప్రాణాలు కాపాడాలని ఢిల్లీ వచ్చింది.

    మృదువని తన గెటప్ పూర్తిగా మార్చుకుంది. పంజాబీ డ్రెస్ లోకి మారింది. పెద్ద గాగుల్స్ పెట్టుకుంది. తల మీదుగా స్కాప్ ఫేష్ ని కవర్ చేస్తూ చుట్టుకుంది.

    తను రిస్కు చేస్తున్నానన్న విషయం తెలుసు... కానీ తప్పదు... మోడ్రన్ అపార్ట్ మెంట్స్ దగ్గరకి వచ్చింది. గూర్ఖ బీడీ కాలుస్తూ స్టూలు మీద కూచున్నాడు.

    మరోసారి తన మొహం పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడుతూ గూర్ఖా దగ్గరకి వెళ్ళింది. తలను కాస్త కిందికి వాల్చింది.

    "దేఖో..."

    గూర్ఖా తలెత్తాడు... ఎమిటన్నట్టు.

    "శరణ్యా మేడం వున్నారా?" హిందీ, పంజాబీ మిక్స్ చేస్తూ సాద్యమైనంత వరకూ గొంతు  మారుస్తూ అడిగింది.

    "శరణ్య మెడమ్... లేదు..." విచారంగా చెప్పాడు గూర్ఖా.

    "ఎక్కడకి వెళ్ళారు... ఏదైనా నాటకం వుందా?" కావాలనే అడిగింది. ఆ గూర్ఖా బావుల మనిషి, శరణ్య అంటే గౌరవం వున్న వ్యక్తి.

    ఆ మేడమ్ చాలా రోజులుగా కనిపించటంలేదు. అంతక్రితం ఆ మేడమ్ పోలీసులు కూడా వచ్చారు." చెప్పాడు గూర్ఖా.

    "అలాగా... సరే... మేడమ్ వస్తే నేను వచ్చానని చెప్పండి..." అంది మృదువని వెనక్కి తిరిగి.

    "మేమ్ సాబ్... అప్ కా నామ్ క్యాహై... అదే మెడమ్ కు ఏమని చెప్పమంటారు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS