Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 34

    ఆమెకు అతని ఉద్దేశం అవగతమైంది.
    "ఇది మీకూ, దేశానికి వారమే. కానీ నాకు శాపం..." భర్త సైంసిస్ట్ గా మారి తిరిగి ఈ ప్రపంచం గుర్తించే మేధవిగా తలెత్తు కోవడం సంతోషమే.
    కనే అయన మేధస్సు నాకు కంఠశోష కలిగించాడానికి కదూ... నా కొడుకుని చంపడానికి కాదు ఆ ప్రయేగాలు...
    నిశ్సబ్దంగా మారిందా ప్రాంతం.
    నిజమే... ఆ తల్లి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పగలదు?
    "వెళ్ళు బాబూ... నీ కోరిక నెరవేరుతుంది."
                                                                            ***
    "అదండీ  జరిగింది... నా మీద ప్రేమతో, బిడ్డమీద మమకారంతో ఈ దేశ వినశానానికి మీరు ప్రేక్షుక పాత్ర వహిస్తూ చూస్తూ కూచోకూడదు."
    భరద్వాజ కళ్ళు రెండు అశ్రువులను రాల్చాయి.
    "అలాగే విశాలే..." అన్నాడు భారంగా నిత్తోరుస్తూ.
    "థాంక్యూ సార్..." అంటూ వచ్చాడు కౌశిక్. అతను ఉదయం నుంచి అక్కడే ఉన్నాడు భరద్వాజ ను ప్రయత్నంలో...
                                                                           ***
    కౌశిక్, భరద్వాజ, మౌన ఆ గదిలో వున్నారు.
    "భస్మలో హై ఓల్టేజీ విద్యుత్ వుంది. మెల్లిమెల్లిగా ఆ విద్యుత్ ని నిర్వీర్యం చేయాలి. దాన్ని 'డాన్' చేయాలంటే, ఆ ప్రయత్నంలో అతని ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చు. అలా అంటున్నప్పుడు భరద్వాజ కంఠం వణికింది.
    "అంతకు మించి మార్గం లేదా?" కౌశిక్ అడిగాడు భరద్వాజ బాధను అర్ధం చేసుకుని.
    "లేదు..." స్థిరంగా చెప్పి కొనసాగించాడు భరద్వాజ.
    "ముందుగా అతని మెదడులో అమర్చిన చిఇఫ్ తొలిగించాలి. అతని శరీరంలో విద్యుత్ శక్తిని నిర్వీర్యంపర్చాలి. అతని మూడో నేత్రాన్ని చిద్రంచేయాలి. మెదడకు కనెక్ట్ అయి వున్న ఆ నేత్రం చిద్రమైన మరుక్షణం మెదడు కూడా నిర్వీర్యంమైపోవచ్చు.
    మెదడు నిర్వీర్యమైన క్షణం అతని ప్రాణం సైతం పోతుంది...
    "న్నో..." అరిచింది మౌన. "వద్ద్దు... వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు..." ఆమె మొహంలో అందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
    "కూల్ డౌన్ మౌనా.. ఇది దేశ రక్షణకు సంభందించినది... అన్నాడు కౌశిక్.
    "భస్మను నేను మారుస్తాను. అతని మెదడు నా ప్రేమకు ట్యూన్ అయ్యేలా చేస్తాను."
    పేలవంగా నవ్వి అన్నాడు భరద్వాజ.
    "అది దాదాపు అసాధ్యమే. అతని మెదడు మరొకరి అధీనంలో వుంది. తనకు తాను హిప్నటైజ్ అవ్వద్దనుకుమ్తే తప్ప. అలా అనుకునే అవకాశం భస్మకు లేదు."
    "నేను ప్రయత్నించి చూస్తాను..." అంది మొండిగా మౌన.
    "సర్... నేను భస్మను ట్రాప్ చేసి మీ ల్యాబ్ కు తీసుకువస్తాను. మీరు మీ ప్రయోగం మొదలెట్టండి. మీక్కవాల్సినవి ప్రభుత్వం సమకూరుస్తుంది." చెప్పి లేచాడు కౌశిక్.
    కౌశిక్ మౌనకు భస్మ ఆడ్రస్ చెప్పండి. ఆమె ఏం చేయాలో చెప్పండి.
                                                  ***
    రెసిడెన్సీ అపార్టుమెంటు లో పద్నాలుగో నెంబర్ ప్లాటులో వున్న భస్మ మంచం మెడ వేల్లకిలా పడుకున్నాడు.
    అతని కళ్ళముందు మౌనే కనిపిస్తోంది. సరిగ్గా, అదే సమయంలో తలపుల మీద దబదబ బాదుతొన్న శబ్దం.
    రాపీగా లేచి వెళ్ళి తలుపు తీశాడు.
    ఎదురుగా మోఎన. సుడిగాలిలా లోపలకి వచ్చి అతడ్ని చుట్టేసింది.
    ఏదో అనాలని నోరు తెరిచాడు భస్మ.
    అతనేమీ మాట్లాడక ముందే తన పెదాలతో అతని పెదాలు మూసేసింది.
    క్షణాలు కరగిపోతున్నాయి. నిమిషాలు అబ్బురంగా చూస్తున్నాయి.
    రెండు నిముషాల తర్వాత అతడి నుంచి విడిపడింది మౌన.
    భస్మ ఆ షాక్ లోనుంచి తేరుకోలేకపోయాడు. అతనుకీ అనుభావంకోత్త.
    స్రీ స్పర్శ వింతగా, గమ్మత్తుగా హాయిగా ఉంది.
    మౌన టచ్ అతడిలో కొత్త ఉత్తేజాన్ని నింపింది.
    కొత్త అనుభూతలను చిగురింపజేసింది.
    మరో ఘర్షణ... మనసు పొరల్లో సంఘర్షణ.
    "భస్మా... ఐ లవ్ యూ... రియల్లీ ఐ లవ్యూ..." అంది అతని గుండెల మీద తలవాల్చి.
    ఏదో మాట్లాడాలన్న అతని స్వర పేటిక సహకరించడంలేదు. తనకేమైపోతూంది?
    సరిగ్గా అదే క్షణంలో.. మెదడుకు ఏవో సంకేతాలు అందుతున్నాయి.
    "భ..స్మా.. భ..స్మా..భ..స్మా..స్టార్ట్ యిమిడియట్లీ... స్టార్ట్ యిమిడియట్లీ... స్టార్ట్ యిమిడీయట్లీ..."
    తల విదిలించాడు... లేచాడు.
    "ఎక్కడికివెళ్తున్నావు భస్మా.. నువ్వేక్కడకి వెళ్ళడానికి వీల్లేదు. నా దగ్గరే వుండాలి చూడు... నీ కోసం నా గుండెలు ఎలా ఎగిరెగిరి పడుతున్నాయో... ఆమె పైట తీసి కిందికి  జార్చింది. ఎత్తయిన ఆమె వక్ష ద్వయం అతడ్ని రెచ్చగొట్టలేకపోయింది.
    "భ..స్మా..డు వాట్ ఐ సే.. క్విక్" మెదడులో రావుదపెడుతూ సంకేతాలు. భస్మ వెళ్ళి డోర్ కు అడ్డంగా నున్న మోఎనని పక్కకి లాగాడు.
    బలంగా డోర్ ని పట్టి లాగాడు. లాక్ చేయడం వలన తలుపు తెరుచుకో లేదు.
    "భ..స్మా.. క్విక్ .." ఏవో సంకేతాలు.
    అతని కళ్ళు ఎర్రబడుతున్నాయి. శరీరంలో నరాలు పైకి ఉబ్బెత్తున పొంగుతున్నాయి.
    ఒక్క క్షణం లాక్ యాసిడ్ మీద  పడితే బస్సున పొంగి, కరిగిపోయినట్టు కరిగిపోతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS