"ఎవరో ఏదో చేస్తారని, చేయాలని నేననుకోవడంలేదు వీణా! ఎందుకొచ్చిందో నా మనసులో కి ప్రయెజనకరమైనా పని ఏదన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది... అమలుపరిచానంతే... నేనేదో ఆదర్స మూర్తిగా చరిత్ర లో మిగిలిపోవాలనుకోవడంలేదు."
"అలా మిగిలిపోయినవాళ్ళకి ఏం జరిగింది? ఏడాదికోసారి జయత్యుత్సవాలు, వర్దంతి ఉత్సావాలు చేస్తారు... లేదంటే అదీ మర్చి పోతారు.... నామాట విని నువ్వు పెళ్ళిచేసుకో అనూషా."
"ఇప్పుడా!" నవ్వింది..." ఏ రెండో పెళ్ళివాడో వస్తారు... వాడి పిల్లలకి, కుటుంభసభ్యులకి సేవలుచేస్తూ బతికే సహనం, ఆ హృదయ వైశాల్యం, తీరిక నాకులేదు."
"అలాంటి బాదరబందీలులేని, ఇంకా పెళ్ళికాని అందమైన యువకుడికి చూపిస్తే చేసుకుంటావా?"
"నీకు పిచ్చి పట్టిందా?"
"కాదు... మంచి ఆలోచన వచ్చింది. భరణి నా దగ్గరకు వచాడు. నిన్ను ప్రేమింస్తున్నాట్ట, పెళ్ళిచేసుకుంటాట్ట. ఒప్పించేభారం నామీద పెట్టాడు."
"వీణా!" మందలింపుగా పిలిచింది.
"అవును అనూ! నేను చెప్పింది నిజం. యువకుడు, తల్లీ, తండ్రీ వేరే ఊళ్ళో వుంటున్నారు.ఏదో మంచి పనులు చేయాలన్నఉత్సాహం వుంది . అతను నాతో మాట్లాడి వెళ్ళాక, అతని గురించి వాకబు చేశాను. చెడు అలవాట్లెంలేవుట... మంచివాడే! నిన్ను గొప్పగా ప్రేమించేస్తున్నాడు. కాబట్టి ఇంకేం ఆలోచించకుండా రేపుదయం గుడికొచ్చయ్. రెండు పూల దండలతో పెళ్ళిఅయిందనిపిద్దాం."
ఆశ్చర్యంగా చూసింది అనూష. ఏంటిలా మాట్లాడుతోంది? తన కన్నా చిన్న వాడైన భరణిని తను పెళ్ళిచేసుకోవాలా? అతని వయసు సంగతి అలా వుంచితే, తనతో అతను ప్రవర్తించే పద్దతి చూస్తూనే, అతని పట్ల తనకి అలాంటిభావం కలగదు... ఎంతో వినయంగా, నెమ్మదిగా వుంటాడు.పైగా ఓ హొదా, అంతస్తు,వ్యక్తిత్వం వున్న తనలో భార్యాకు కావాల్సిన అణకువ, సర్దుబాటు తత్త్వంలేవు... ఇవి వుంటేగానీ, స్రీ వైవాహిక జీవితంలో సంతృప్తిగా బతక లేదు. తను ఓంటరి కాబట్టి, సర్వస్వతంత్రురాలు కాబట్టి ఎన్నాడూ ఒకరికి తల వంచాలన్న ఆలోచన కలగలేదు. అలాంటిది పెళ్ళి చేసు కోవాలా? ఆమెకి నవ్వోచ్చింది.
ఆమె కళ్ళముందు తను తలవంచుకొని మాంగల్యం కట్టించుకునే సీను కదిలింది. సినిమాల్లో లాగా పాలగ్లాసుతోబెడ్ రూంలోకి వెళ్ళడం, అతను దగ్గరగా వచ్చి సిగ్గుతో వంచుకున్న తన చుబకాన్ని ఎత్తి కళ్ళలో చూడడం ఎంత హాస్యాస్పదం! అనూష వున్నట్టుండి పకపకా నవ్వింది.
వీణ తెల్ల బోయి చూసింది. "ఎంటా నవ్వు?"
నవ్వి, నవ్వి అలసిపోయి అన్నది. "నేను పెళ్ళి చేసుకుని, ఓ మాగాడి తో కాపురం చేయడం మిలీనియం జోక్."
"షటప్" కోపంగా అరిచింది వీణ.
"పిచ్చిగా మాట్లాడకు... నువ్వు పెళ్ళి చేసుకుతీరాలి.... అంతే."
"వీణా! ఈ సమయంలో నేను పెళ్ళి చేసుకోవడం, పిల్లల్ని కనడం ఇదంతా వింటే ఎవరయినా నవ్వుతారు."
"ఎవరే నవ్వేది? చంపేస్తాను... చూడు అనూ! పెళ్ళి,పిల్లలు,భర్త,ఓ కుటుంబజీవనం కావాలని నేనంట తహాతహాలాడుతున్నానో తెలుసా? అందుకే పెళ్ళిచేసుకుంటానన్న ప్రతి మాగాడినీ నమ్మాను.... మోసపోయాను. ఇప్పుడింక నాకు అ అదృష్టంలేదు. బ్రష్టురాల్ని అయిన నన్నెవరు పెళ్ళి చేసుకుంటారు? నీకా అవకాశం వచ్చింది. నా మాట విని ఈ సువర్ణకాశం వదులుకోకు."
"వీణా! అసాద్యం అయిన వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయకు. బాగా పొద్దుపోయింది పడుకో" అనూష మరో మాటకి అవకాశం ఇవ్వకుండా పక్కకి వత్తిగిల్లింది.
వీణా వదలకుండ పెళ్ళి గురించి, జీవిత భాగస్వామి అవసరం గురించి చెబుతూనే వుండి. కాసేపటకి అనూష నిద్రపోయిందని తెలుసుకునితనూ కళ్ళు మూసుకుంది.
* * * *
నాలుగైదు నెలలు గడిచి పోయాయి. భరణీ వీణని మద్యలో చాలా సార్లు కలిశాడు. అనూష పెళ్ళికి విముఖంగా వుందని తెలుసు కున్నాక, అతను చాలా రెక్లస్ గా అయిపోయాడు. పైగా అ రోజు నుంచీ అనూష అతనికి అపాయింట్ మెంట్ ఇవ్వడం తగ్గించింది. ఎప్పుడో ఒక సారి ఫోన్ లో కాస్సేపు మాట్లాడుతొంది. భరణి ఇది వర్కులా పత్రిక మీద మనసు కేంద్రీకరించలేకపోతున్నాడు. ఎలాగైనా అనూషని పెళ్ళి చేసుకోవాలన్న కోరికబలంగా నాటుకుంది తాని మనసులో. వీణ కూడా అనూషకి వీలై నప్పుదలా క్లాసు తీసు కోవడం, ఎలాగైనా ఒప్పుకోమని వేధించటం చేయసాగింది. మద్యలో రెండు మూడుసార్లు శ్యామలచేత కూడా చెప్పిచడానికి ప్రయత్నించింది.
ఎవరు చెప్పినా అనూష వినలేదు.
వీణకి విసుగొచ్చింది అనూష మొండితనం మీద. కొన్ని రోజులు కావాలని ఆమెకి ఫోన్ చేయకుండా, దూరంగా ఉండడం మొదలుపెట్టింది. అదీకాక, కొన్ని ముఖ్యమైనా కేసుల్లో అటు హైకోర్టు కీ, ఇటు సివిల్ కోర్టుకీ తిరగడంలో చాలా బిజీగా అయిపోయింది.
ఆ రోజు వాళ్ళందరి జీవితంలో ఓ ముఖ్యమైన, అండర్ లైన్ చేసుకోవాల్సిన రోజు.... సుశీల కేసులో ఆమెకీ, ఆమె కొడుక్కీ అనుకూలంగా తీర్పు ఇచ్చింది హాయ్ కోర్టు. జడ్జిమెంటు కాఫీ తీసుకుని ఉస్మానీయా హాస్పిటల్ వెళ్ళింది వీణ. ఆమె వెళ్ళేటప్పటికి అనూష సర్జరీలో వుంది. వీణకి అక్కడి డాక్టర్స్ అంతా బాగా పరిచయం. చీప్ హరిశ్చంద్ర గారు కూడా వీణకి బాగా తెలుసు.... అనూష స్నేహితురాలిగా వీనంటే ఆయనకి గౌరవం. అదీకాక, లీడింగ్ లాయరు గా ఆమెకి మంచి పేరుంది. వీణ నేరుగా ఆయన దగ్గరకి వెళ్ళింది.
ఆమెని చూడగానే ఆయన ఎంతో అప్యాయంగా ఆహ్వానించాడు.
అతనకి నమస్కరించి, అయన చూపించిన కుర్చీలో కూర్చుంది.
"ఏమ్మా.... ఏంటి ప్రాబ్లం?" అడిగాడు.
"నాకేం ప్రాబ్లం లేదు డాక్టర్. అనూష తో పనుండి వచాను. తనేదో సర్జరీ చేస్తోందిట. ఈ లోగా మిమ్మల్నోసారి పలకరించి వెళదామని వచ్చాను."
"అలాగా! ఎలా వుంది డాక్టర్... ఇవాలే సుశీల కేసు జడ్జిమెంట్ వచ్చింది."
"వెరీగుడ్...." ఆయనకి సుశీల గురించి తెలుసు. అనూషకి సంబంధించిన వాళ్ళంతా ఆయనకి తెలుసు. అనూష చేసే కార్యక్రమాలకు అయన సపోర్ట్ ఎంతగానో వుంది. అనూషంటే ఆయనకి ప్రతెయకమైన అభిమానం అందుకే...
"డాక్టర్ గారూ! మేరు అనూషకి తండ్రిలాంటివారు. అందుకే చెబుతున్నాను. తనకో మంచి మ్యాచ్ వచ్చింది. పెళ్ళిచేసుకోమంటే చేసుకోనని మొండిపట్టు పడుతుంది. మీరు కాస్తా నచ్చ చెబుతారని నా ఆశ ..."
అయన చాలా సంతోషించాడు. "అనూషకి మ్యాచ రావాడనికేం ఉండమ్మా... ఆమె ఒప్పుకోవాలేగానీ, క్యూలో నిలబడతారు. నేనిది వరకు కూడా ఒకటి, రెండుసార్లు చెప్పాను... వినలేదు..."
"ఈ మ్యాచ్ చాలా మంచిది డాక్టర్. అతను అనూషని చాల గాడంగా ప్రేమిస్తున్నాడు. అంత సిన్సియర్ గా ప్రేమించే వాళ్ళు కూడా వుండాలిగా...."
"ఇంతకీ ఎవరతను? ఏం చేస్తున్నాడు? ఏం చదువుకున్నాడు?"
"అతను మీరుహించేంత పెద్ద ఉద్యోగి కాదు... కానీ, పెద్ద మనసున్నవాడు.... జర్నలిస్టు."
