డబ్బు.
డబ్బు.
నాక్కావాలి.
లక్షలకి లక్షలు సంపాదించాలన్న పట్టుదల నాలో పెరిగి పోయింది.
"ఛండాలుడా! ఏమి పుట్టుకరా నీది." ఈసడింపుగా అన్నాడు సూరిబాబు.
"నువ్వు మొహంమీద ఊసినా బాధపడను సూరిబాబు.
ఐ వాంట్ మనీ.
ఐ వాంట్ ఫేమ్
ఐ వాంట్ గర్ల్స్!"
"అంటావురా! ఎక్కడో బలమైన దెబ్బతింటావురా! ఇది ఊరికే నేను అంటున్న మాట కాదు.
ఇది నా శపథం!"
అరిచాడు సూరిబాబు.
ప్రశాంత్ అసహనంగా చూశా డతనికేసి.
"నువ్వెన్ని అరిచినా నీకీ గదే స్వర్గమైనా, నరకమైనా!అయినా చాతకాని ఆడదానిలా శాపాలు పెట్టడం మానేసి కార్యక్రమంలోకి దిగు.
ఈసారి కొంచెం ఎక్కువే ముట్టచెబుతాను"
"ఓరే ప్రశాంత్!"
దీనంగా పిలిచాడు సూరిబాబు.
"ఏమిటి?" అతని అభ్యర్దనతో కూడిన స్వరాన్ని విని చిరునవ్వుతో అడిగాడు.
"నువ్వు తలుచుకుంటే తార చేత కేసుని విత్ డ్రా చేయించగలవు. నన్ను - నన్ను - ఇలా హింసపెట్టడం నీకు న్యాయం కాదురా!
నీకు మాటిస్తున్నాను.
నా తల్లిమీద, నా చెల్లిమీద ప్రమాణం చేసి చెప్తున్నాను.
నేను జీవించినంత కాలం నీకు.... నీ వెనక ఈ లోకానికి తెలీకుండా మిగిలిపోతాను.
ఒక్కసారిగా నా వాళ్లని నాకు చూపించరా!"
రెండు చేతులు జోడించాడు సూరిబాబు.
అతని కళ్ళనించి కన్నీరు చంపల మీదుగా జారిపోతోంది.
ప్రశాంత్ అతనికేసి చూస్తూ చిరునవ్వు నవ్వి "నాకు ఆ నమ్మకాన్ని కలిగించు. ఇదిగో దాన్ని చూడు!" అని వి. సి. ఆర. లో కాసెట్ పెట్టె టి. వి ఆన్ చేసి గది బయటికి వచ్చి తలుపు మూసి తాళం వేసి చకచకా నడిచాడు ప్రశాంత్ -
సూరిబాబు రెండు చేతుల్లో మొహాన్ని దాచేసుకొని బావురు మన్నాడు.
* * * * *
"నేను ఫోన్ చేస్తే మీరిక్కడికి వస్తారని నేను ఊహించలేదు" అందా అమ్మాయి.
"వస్తానని చెప్పానుగదా!" అన్నాడు ప్రశాంత్.
"ఇదంతా కలలా వుంది నాకు."
"కలకాదు. వాస్తవం కావాలనే మనం కోరుకొందాం!" నవ్వాడు ప్రశాంత్.
"కర్టెసీకి వస్తానని అన్నరనుకొన్నాను. నిజంగా మీ సిన్సియారిటికీ ముగ్దురాలినై పోతున్నాను."
ప్రశాంత్ చిరునవ్వుతో సిగరెట్ వెలిగించాడు.
"నా కోసం అభిమానంతో నువ్వింత దూరం రాగాలేంది, నువ్వు కోరినట్లు నిన్ను కలుసుకోడానికి ఈ కాస్త దూరం నేను రాలేకపోతే దేనికి?నాకు అభిమానులు, పాఠకులే దేవుళ్లు. వాళ్లని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం, భాధ్యతా నాకున్నాయి" చెప్పాడు ప్రశాంత్.
"మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు థ్రిల్లింగ్ గా వుంది తెలుసా?"అందా అమ్మాయి.
ప్రశాంత్ మనోహరంగా నవ్వాడు.
మరో సిగరెట్ వెలిగించి.
"నేనూ మనిషినే కదా!" అన్నాడు.
"అది వేరే సంగతి. రోడ్డుమీద నుంచుంటే లక్షల సంఖ్యలో మనుషులు కనిపిస్తారు. మీతో వాళ్లంతా ఎలా సమానమవుతారు?
మీలాంటి గొప్ప రచయిత ఎదురుగా కూర్చుని కాఫీ తాగగలగడం నిజంగా ఇది పెదద్ వరం నాకు."
"నీకు నామీదగల అభిమానం అలా అనిపింపజేస్తుంది విజయ!" అన్నాడు ప్రశాంత్.
"ఏదో! పత్రికల్లో మీ ఫోటోని చూసి అబ్బ, అసలు మిమ్మల్ని ఎప్పుడైనా చూడగలనా అనుకొనేదాన్ని!"
కాఫి సిప్ చేస్తూ కప్పు అంచుమీదనించి ఆమెని పరీక్షగా చూశాడు ప్రశాంత్.
ఇరవై ఏళ్లుంటాయి. మంచి రంగు. సన్నగా పొడుగ్గా వుంది. పెద్దకళ్లు, చక్కని ముక్కు, నోరు, నునుపైన చంపలు, అందమైన ముచ్చటైన మొహం. చూడగానే ముద్దుపెట్టుకోవాలనిపించే ఎర్రని పెదిమలు.
ఆమె మెడమీదనించి చూపుని కిందికి దించాడు.
ఎత్తుగా గుండెలు.
సన్నని నడుం.
పల్చని చీర తొడలకి అతుక్కుపోయింది. దాన్నిబట్టి ఆమె తొడలు, కాలి పిక్కలు ఎంత తీర్చిదిద్దినట్టు వుంటాయో.... అర్దం చేసుకొన్నాడు ప్రశాంత్.
