అసలు తప్పు నాదే!
ఆ రోజు...
గెస్ట్ హౌస్ లో మాధురి తనని నువ్వు రేప్ చేయబోయినట్లు నాటకం ఆడుతున్నప్పుడు అతి సాహసంతో నిన్ను నేను కాపాడ్డమేనేరా నేను చేసిన తప్పు. అందంగా వుంటావని నీ పేర్న కథలు రాసి, నీ ఫోటో తో సహా పత్రికల్లో ప్రచురణ చేయించటం మరో తప్పు.
మాధురి నీపైన ఆడిన నాటకాన్ని తిప్పి కొంత పాలిష్ చేసి తారని నామీద ప్రయోగించావు.
ఆరోజు.
మాధురి బారినించి నిన్ను తప్పించకుండా వుంటే నీ బతుకు ఏం అయివుండేదో తెలుసా?
లక్ష సాక్ష్యాధారాలతో మాధురి నిన్ను జైలుకి పంపించి వుండేది.
నువ్వు జైలు గోడలమధ్య మగ్గి మగ్గి బయటపడ్డాక రోడ్డు వెంట పిచ్చి కుక్కలా తిరుగుతూ వుండేవాడివి.
నీకు మనసనేది వుందా?
అసలు గుండె వుందట్రా నీకు?
ఒంటరి వెధవ్వి!
ఎందుకురా ఈ డబ్బు పిచ్చి!?"
సూరిబాబు ఆవేశంగా అడిగాడు.
ప్రశాంత్ ముఖ కవళికలు మారిపోయినయి. మొహం కందగడ్డలా తయారైంది.
"అయ్!" అరుస్తూ చేతిని చాచి చెళ్లుమని సూరిబాబు చెంపమీద కొట్టాడతను.
18
"అవున్రా!నాకు డబ్బంటే పిచ్చి ప్రేమ! అది లేక నా చిన్న తనంలో ఎలాంటి పాట్లు నేను పడ్డానో నాకు తెలుసు.
మా నాన్న ఉద్యోగరీత్యా తరచుగా ట్రాన్స్ ఫర్స్ అవుతుంటే నన్నువిజయవాడలో ఓ అద్దె గదిలో వుంచాడు చదువుకోసం.
అప్పుడు నేను టెన్త్ చదువుతున్నాను.
నాన్న సరిగా డబ్బు పంపించేవాడు కాదు.
ఆయన జీతం ఆయన అవసరాలకే సరిపోయేది కాదు.
డబ్బు ఒకర్ని అడగడం ఇష్టంలేని నేను, నాతోటి స్నేహితులెవరూ గుర్తుపట్టకుండా వేషం మార్చుకొని కృష్ణా బ్యారేజీ మీద బూట్ పాలిష్ చేసేవాడిని. వారంలో ఎక్కువ రోజులు అన్నం తినడానికి డబ్బుల్లేక పస్తులుండేవాడిని.
అప్పుడు నన్ను నా పరిస్థితిని చూసి నన్ను మంగ ఆదుకొంది.
మంగ ఎవరో తెలుసా?
పని మనిషి ఓనరింట్లో పనిచేసే మంగ, నేను అద్దెకి వుంటున్న అవుట్ హౌస్ గదిని తుడవడానికి వచ్చేది. అది చాలా తక్కువ రోజుల్లో నా గురించి చాలా ఎక్కువ చదివేసింది.
అది నాకంటే నాలుగైదేళ్లు పెద్దదే.
మొగుడొదిలేశాడు దాన్ని.
మనిషి రెపరెపలాడిపోతుండేది!
నేను పస్తులుండడం గమనించి అది పనిచేసే ఇళ్లనించి తెచ్చుకొన్న అన్నాన్ని నాకు పెట్టింది.
"నువ్వు నా పని మనిషివి కాదు. ఇంటి ఓనరు పంపితే వచ్చి గది శుభ్రం చేసి పెడుతున్నావు.
నావల్ల నీకేమీ లాభం లేదు.
నాకు రోజూ అన్నం దేనికి పెడుతున్నావు?" అని అడిగాను.
దానికి సమాదానంగా మంగ నవ్వుతూ మంచాన్ని చూపించి,
"దానిమీద పడుకొందాం!" అంది.
దాంతో నాలో అలజడి రేగింది.
నాకు ఆ క్షణం వరకూ ఆడదంటే ఏమిటో తెలీదు.
నేను చాలా చిన్నవాడివి.
నేను తేరుకొని చూసేలోగా మంగ తలుపువేసి నా దగ్గరగా వచ్చి నా చెంపల్ని సవరదీస్తూ ముద్దుపెట్టుకొంది.
నేను ఒణికిపోయాను.
అది నా లుంగీని లాగివేసి పగలబడి నవ్వేసింది.
ఆ రోజునుంచి ఉదయం రోజూ ఆదే భోజనం తెచ్చిపెట్టడం ప్రారంభించింది.
శృంగారంలో ఆడదాన్ని ఏ విధంగా రంజింపచేయాలో నాకు మెళుకువతో నేర్పిన గురువు మంగ.
నాన్నగారు హార్ట్ ఎటాక్ తో పోయారు. వచ్చిన గ్రాట్యూటీ, పెన్షన్ తో అమ్మ నా దగ్గరకి వచ్చేసింది.
అప్పులు పోను మిగిలిన దాన్ని బ్యాంకులో వేసి దాంతో బతుకుని ఈడవడం మొదలుపెట్టాం.
హైదరాబాదులో నేను డిగ్రీలో అడుగుపెట్టగానే అమ్మ కూడా వెళ్లిపోయింది.
నేను ఒంటరివాడిని.
ఓ అనుబంధం లేకుండా పెరగడంతో నాకు సెంటిమెంట్స్ అనేవి లేకుండా పోయినయి.
వున్న బ్యాంక్ బాలన్స్ తో జాగ్రత్తగా చదువుని పూర్తి చేసాను. డబ్బుతో వచ్చే ఆనందాన్ని అవసరానికి పొందలేక, డబ్బు లేనితనం నాలో పట్టుదలని పెంచింది.
డబ్బు.
