Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 33

    సరిగ్గా అప్పుడే రాహుల్ ని ఢీ- కొట్టింది మృదువని. రాహుల్ ఈ పరిణామం ఊహించకపోవడం వాళ్ళ అన్- బ్యాలెన్స్ అయి, కిందపడి, తనను ఢీ- కొట్టింది ఎవరా? అని చూడబోయేడు. అప్పటికే  మృదువని, అతడ్ని దాటుకుంటూ, ప్లాట్ ఫామ్ మీద నుంచి కదలుతోన్న ట్రెయిన్ ఎక్కేసింది.
   
                                                ***

    అంకిత్ వెంటనే పరుగుపెట్టాడు. రాహుల్ లేచి, దుమ్ము దులుపుకునేలోగా, అంకిత్ అక్కడకి వచ్చాడు. రాహుల్ ని  ఢీ-కొట్టి ముందుకు పరుగెత్తాడు అంకిత్. మరోసారి కిందపడపోయాడు రాహుల్. అంకిత్ 'మృదువనీ...' అని అరుస్తూ ముందుకు పరుగుపెట్టాడు. అప్పటికే ట్రెయిన్ ప్లాట్ ఫామ్ విడిచింది. వేగం పుంజుకుంది.
   
                                                ***

    షి,.ట్..

    తల పట్టుకున్నాడు అంకిత్. కొద్దిలో మృదువని మళ్ళీ మిస్సయింది.
   
                                                                          ***

    "భాదపడకు భయ్యా... మృదువని తప్పకుండా కలుస్తుంది. తన ఢిల్లీవెళ్ళే ట్రెయిన్  లో వెళ్ళిందంటే, బహుశ తనది ఢిల్లీ కావచ్చు..." రాహుల్ అన్నాడు. అంకిత్ ఏమీ మట్లాడ్డం లేదు. స్టేషన్ నుంచి రూమ్ కు వచ్చినప్పుట్నుంఛీ అనీజీగా వున్నాడు. మృదువని తను కొద్దిలో మిస్సయిన విషయమే అతడ్ని భాద పెడుతోంది. అసలు మృదువని తనకెందుకిలానిర్లక్ష్యం చేస్తోంది.

    తనని ఆటపట్టిస్తోందా? ప్రాక్టికల్ జోక్ చేస్తోందా? అసలు మృదువని ఎవరు?ఆమె గురించి తెలుసుకోవడం ఎలా? అతనికిప్పుడు ఆకలి వేయడం లేదు, నిద్ర రావడంలేదు. అతని ఆలోచలన్నీ మృదువని చుట్టే!

    "మృదువనీ... ఐ లవ్  యూ..." అతని గుండె సవ్వడి, ఆగది అంతకాదు, ఈ ప్రమంచమంతా పరుచుకున్నట్టు వినిపిస్తోంది.
   
                                                  ***

    న్యూఢిల్లీ.

    రైల్వేస్టేషన్.

    హైద్రాబాద్ నుంచి వచ్చిన రైలు, ప్లాట్ ఫామ్ మీద ఆగింది. ఆమె అద్రుష్టం బావుండి, టి.సి. ఏ మూడ్ లో వున్నాడో గానీ ఏమీ అన్లేదు. ట్రయిన్ ఏ స్టేషన్ లో ఆగినా, తన గురించి ఎవరైనా వస్తారోమోనన్న భయం... ఈ రెండ్రోజులూ... తను నరకమే అనుభవించింది. ఆమె పక్కనే కూచున్నావిడిది ఢిల్లీ.

    మృదువని తన సూట్  కేస్ పోయిందని టి.సి తో చెబుతూంటే విని, స్నాక్స్ పెట్టింది. వంద రూపాయలు చేతిలో పెట్టింది. మనుషుల్లో యింకా మానవత్వం మిగిలే వుందన్న విషయం మరోసారి తెలుసుకుంది మృదువని.

    హైదరాబాదు లో అపరిచిత వ్యక్తి (అంకిత్) ట్రయిన్ లో ఓ స్రీ.... మృదువని ఆలోచనల్నుంచి బయటపడింది. కొంగును తల మీదుగా కప్పుకుంది. తనిప్పుడు శరణ్యను కలుసుకోవాలి... ఆ నిశ్చయంతోనే స్టేషన్ బయటకు నడిచింది.
   
                                                ***

    అంకిత్ ఒక్కడే వున్నాడు రూమ్ లో.

    రెండ్రోజులగా అతను ఆ రూమ్ వదిలి బయటకు రావడంలేదు.

    అతనికి ఎదురుగా తీ.వీ.ఆర్.లో వాలెంటేడ్స్ డే క్యాసెట్ వుంది.రిమోట్ లో ఆ క్యాసెట్ ని చూస్తూ గోడకు జారిగిలబడి కూచున్నాడు.

    మృదువని పరిగెత్తుకుంటూ రావడం... మీ బోయ్ ప్రెండ్ ఎవరు? అని అడగ్గానే తనని చూపించటం... స్పష్టంగా కనిపిస్తోంది.

    ఆ చిన్న సీన్ ని పదే పదే రివైండ్ చేస్తూ చూస్తున్నాడు. ప్రేమలో యింత మత్తు వుంటుందని, అది ఇన్ని గమ్మత్తులు చేస్తోందని అనుభవ పూర్వకంగా అర్ధమవుతోంది. అంకిత్ కు.

    ఆకలి లేదు, నిద్రలేదు... మృదువని గురించి తప్ప వేరే ఆలోచనా లేదు.

    తీ.వీ లో పదే పదే అదే సన్నివేశాన్ని చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడు డోర్ మీద నాక చేసిన శబ్దం వినిపించింది. అయినా వెళ్ళాలని అనిపించలేదు. బహుశా రాహులో, చేతనో అయివుంటారని అలాగే కూచుండిపోయేడు.

    ఈ సారి తలుపు తట్టిన శబ్దం కాకుండా, తలుపు తోసిన శబ్దం వినిపించింది. అయినా తల తిప్పి చూడలేదు.
    "అంకిత్...నువ్వు యింట్లోనే వున్నవా? డోర్ మీద కాందహార్ లో బాంబుల మోత లెవల్లో శబ్దం చేసినా పలకవేమిటి?" అన్నా మాటలు వినిపించి, ఆ గోటు ఎక్కడో విన్నట్టు అనిపించి తలెత్తి చూసాడు. ఎదురుగా ప్రద్యుమ్న.

    "ప్రద్యుమ్న... నువ్వా..." ఆశ్చర్యంగా అడిగాడు.

    "నేనే... మూడేళ్ళలో నన్ను మరచిపోయావా?" అడిగాడు ప్రద్యుమ్న.

    వాళ్ళిద్దరూ మూడేళ్ళ క్రిందట, మంచి ప్రెండ్స్. తరుచూ కలుసుకుంటూ వుండేవాళ్ళు. ప్రద్యుమ్నకు ఢిల్లీలో ఈవినింగ్ టైమ్స్ లో జర్నలిస్ట్ గా వుద్యోగం దోరడంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు.

    "నిన్ను మరచిపోవడమేమిటి? ఎలా వున్నావు? ఏమిటి విశేషాలు?" అడిగాడు అంకిత్.

    "ఆటం అల్ రైట్... నువ్వేంటి...? లంఖణాలు చేసినట్టు నీరసించి వున్నావు? మీ చైర్మెన్ శాలరీ యివ్వట్లేదా?" నవ్వుతూ అడిగాడు ప్రద్యుమ్న.

    "అదేం లేదుకానీ, రా... కూచో..." అన్నాడు అంకిత్. అతని చేతివ్రేళ్ళు మాత్రం రిమోట్ మీద కదులుతూనే వున్నాయి.

    ప్రద్యుమ్న కూచోబోతూ, తీ.వీ  వంక చూశాడు. అంకిత్ క్యాసెట్ ని రివైండ్ చేసి,ప్లే చేసాడు. తీ.వీలో  మృదువని కనిపించింది. ప్రద్యుమ్న షాకింగ్ గా చూస్తుండిపోయాడు.

    "అంకిత్... ఈ అమ్మాయి  నీకు తెలుసా?" ఎక్సయిట్ అవుతూ అడిగాడు ప్రద్యుమ్న.

    అంకిత్ ఉలిక్కిపడుతూ... "నీకు తెలుసా అని అడుగుతున్నావు? నీకు తెలుసా?" అని అడిగాడు.

    "ఆ అమ్మాయి నాకు తెలియకపోవడం ఏమిటి? మా జర్నలిస్ట్లులకు బాగా తెలుసు. ప్రస్తుతం ఢిల్లీ అంతా తెలుసు..."

    "వాట్... ఆ అమ్మాయి నీకు తెలుసా?" ప్రద్యుమ్న భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు అంకిత్. అతనిలో ఉద్వేగం కొట్టిచ్చినట్టు కనిపిస్తుంది.

    "తెలుసు..." అన్నాడు ప్రద్యుమ్న.

    "నిజంగానా?"

    "నిజంగా తెలుసు..." అన్నాడు అప్పుడే రాహుల్, చేతన్ లు వచ్చారు.

    ప్రద్యుమ్నని చూస్తూనే విష్ చేశారు. ప్రద్యుమ్న వాళ్ళకు పరిచయమే... కుశలప్రశ్నలు పూర్తవ్వకుండానే...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS