"అప్పుడూ నన్ను మరచి పావురుకడూ..." కరంజయా అడిగాడు.
అతని కోరిక ఓ దేశానికి సార్వాబౌమాదికారి కావాలని.
"తప్పకుండా... మిమ్ముల్ని మరచిపోతానా కరంజయా సాబ్...నాతోపాటు పాతికేళ్ళు కలసి వున్నారు. మాతృదేశాన్ని కూడా నాకోసం మోసం చేశారు.
మీకు మంచి సత్కారం చేసే వెళ్తాను. మరచిపోలేని సత్కారం..." వక్రంగా నవ్వూతూ అన్నాడు ఖాన్.
షూక్రియా ఖాన్ సాబ్... మీగురించి నాకు తెలుసు. మీరు తలచుకుంటే ఈ దేశానికి నన్ను ప్రధానిని కూడా చేయగలరు" ఆనందంగా ఉబ్బితబ్బిబ్బాయి అన్నాడు కరంజయా.
ఖాన్ మాటల్లోని గూఢర్దాంకరంజయా కు తెలిసివుంటే వణికిపోయేవాడు.
వాళ్ళ మధ్య ఈ సంబాషణ జరుగుతూనే వుంది. లోపల అగర్వాల్ కొత్త ప్రయేగం చేస్తున్నాడు భస్మను పూర్తిస్థాయి కరెంట్ మనిషి చేయడానికి. అతని అనివనివూ విద్తుట్ ప్రవహించేలా చేసే ప్రతత్నమది.
ఎలక్ట్రిక్ సెల్ లో ఓ కుర్చీలో కూచొని వున్నాడు భస్మ..
***
రెండ్రోజుల్లో నగరం అల్లకల్లోలమైంది.
చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. డానికి తోడు కొన్ని ఎల్లో జర్నల్ కధలు కధలుగా ప్రచురించింది.
ఇంటర్ లాక్ బ్యాంక్ దోపీడికి గుర్తెంది.సెంట్రీలు బూడిదలైపోయారు.హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకోంటోన్నగోపాలన్ అనే ఖైదీ కరెంట్ షాక్ టో చనిపోయాడు. అతని మీద పాతికకు పైగా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అండర్ ట్రయిలర్ ఖైదీ అతను.
ఇదంతా దుష్ట గ్రహాల ఫలితమని కొందరు, రాష్ట్రా ముఖ్యమంత్రి దేవుడి మీద నమ్మకం నాయుకుల లేకపోవడమనే ప్రచారం మరికొందరు చేశారు. ఓ పక్క ప్రపంచం నాయుకుల సమావేశం హైదరాబాదులో జరగనున్నది.
ఆ సమావేశం ఫలవంతమైతే, అతర్జతీయంగా ఇండియాకు, అందులో హైదరాబాదు కు మంచి పేరోస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో సిఎంకు అర్దంకాలేదు.
ఈ కేసుమిస్టరీ తేల్చడానికి ఫోలీసు యంత్రాంగం సిద్ధమైనా, అది కేవలం ఫోలీసు ఫోర్స్వవల్ల అయ్యేపని కాదు.
సిఎం అత్యవసర సమావేశానికి ఏర్పాటుచేశాడు. ఆ సమావేశంలో సిఎం, డిజిపి, కమిషనర్, హొంమినిష్టర్, సిబీ ఆఫీసర్ కౌశిక్ లు మాత్రమె ఉన్నారు.
కౌశిక్ కు పూర్తీ అధికారాలిస్తూ ఈ కేసును పరిష్కరించమని కోరారు.
అదే సమయంలో ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది కౌశిక్ ఓ నిర్ణయానికి వచ్చాడు.
***
"ఏమండీ..." విశాలి పిలుపు విని తలతిప్పి భార్య వంక చూశాడు భరద్వాజ. గత నాలుగైదు రోజులుగా బయటకు కదలడం లేదు భరద్వాజ.
"చెప్పు విశాలీ..." ఆమె తలమీద చేయివేసి వాత్యల్యం పూర్వకంగా అడిగాడు.
"బాబును మీరు చూసారా?"
ఒక్క శరాఘాతం హృదయానికి తగిలి, రిథిరం స్రవించినట్టు, ఒక్క విస్పోటం మనసులో దూసుకువెళ్ళి అలజడి రేపినట్టు...
"వీ..శా..లీ..."
"చెప్పండి... బాబు బ్రతికే వున్నాడుకదూ..."
"వీశాలీ..."
"అం ఆరోజు పేపరు నేనూ చూశాను. మీతోపాటు ఆ హొటల్ కూ వచ్చాను."
నిశ్శబ్దం భళ్ళున బద్దలైన ఫీలింగ్.
"మీరూ, ఆ సి.బి.ఐ. ఆఫీసర్ మాట్లాడిన మాటలూ విన్నాను. ఈ నలుగు రోజులుగా మీరు పదే మాధనమూ చూస్తున్నారు. రోజు రోజుకూ నగరంలో చెలరేగే అలజడి గమనిస్తున్నాను. ప్రపంచంలో తల్లి ప్రేమ గొప్పదంటారు. కనే తండ్రి ప్రేమ ముందు ఈ తల్లిప్రేమ దూదిపింజలా మారిపోయిందండీ... ఓ పక్కబాబు మీద ప్రేమ, మరో పక్క భార్య మీద మమకారం... ఈ రెండూ మిమ్మల్ని రెండువైపులా నిలబడి నిలదీసి వేధిస్తున్నాయి.
వద్దండీ... నా భర్తలోని స్వార్దపరుడ్డ్ని నేను చూడలేను. ఒకప్పుడు దేశం కోశం అహర్నిశలు శరమపడ్డ నా భర్త నాక్కావాలి. దేశం కోసం సర్వస్వాన్ని తృణప్రాయంగా భావించే నా భర్తలోని అపురూపమైన సైంసిస్ట్ నేను చూడాలి.
ప్రయోగాలు. పరిశోధనలు... ఇవే ప్రపంచంగా బ్రతికే, అమితమైన మేధస్సు, తేజస్సు టో వుండే నా భర్త నాక్కావాలి దయచేసి, అలాంటి నా భర్తను నాకు చూపించండి" చేతులు జోడించింది విశాలి.
"వీశాలీ...?"
"అవునండీ... ఈ ఉదయమే మీరు మార్కెట్ కు వెళ్ళినప్పుడు సిబీ ఆఫీసర్ కౌశిక్ వచ్చాడు.
ఉల్లిక్కిపడ్డాడు భరద్వాజ.
"అవునండీ..."
"వచ్చి..."
భర్త మొహంలోకి చూసి చెప్పసాగింది ఉదయం ఏం జరిగిందో?
***
"అమ్మా..."
కిచెన్ సర్డుతొన్న విశాలి ఆ పిలుపు విని వెనుతిరిగింది. ఎదురుగా కనిపించే అపరిచిత యువకుడివైపు చూసింది ప్రశ్నార్ధకంగా.
"నా పేరు కౌశిక్."
అప్పుడు గుర్తోచింది నాలుగు రోజుల క్రితం భర్త వెళ్ళింది ఇతని దగ్గరకే అని.
"కూచోబాబూ."
నిన్నో వరం అడగాడానికి వచ్చానమ్మా... చిన్నప్పుడు నాకు కుంతి,కర్ణుడి కధ మా బామ్మ చెప్పేది. కుంతీదేవి వెళ్ళి తన కొడుకులను చంపవద్దని కర్ణుడి వేడుకుందిట. అర్జునుడ్ని తప్ప ఎవర్నీ చంపమని ఆ సూతపుత్రుడు మాట ఇచ్చాడట. ఇప్పుడు నీకు కొడుకు గాని వెచ్చి ఓ కోరిక కోరుతున్నాడు. ఈ దేశం కోసం మాకు సైంసిస్ట్ భరద్వాజ కావాలి..."
