Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 34

   
    కీర్తి తన పరికిణాలోపల జేబులు కుట్టించుకుంది. ముఖ్యమైన కొద్ది సీక్రెట్ పరికరాలు లంగాలో కీర్తిని అంటిపెట్టుకుని వున్నాయి.    
    లంబాడి స్త్రీలు పెద్ద సైజు పరికిణాలు ధరిస్తారు. ఆపరికిణాలోపల బోలెడు జేబులు వుంటాయట. అవసరమయితే అరబస్తా ధాన్యం ఆ జేబుల్లో పోయవచ్చని కొందరు అంటుంటారు. రాణి అనే మారు పేరు. పల్లెటూరి పిల్లదాని వేషంతో పాటు కీర్తి లంగా ఓణి ధరించటం వల్ల ధరించిన పరికిణాకి జేబులు కుట్టించుకుంది ముందు జాగ్రత్తతతో.    
    యశ్వంత్ భట్టాచార్య స్నానాల గది బైట నుంచి పిలవంగానే కీర్తి గదిలోంచి బైటికి రాబోతూ కాగితం మీద విషయం రాశి వస్తూ సబ్బు పెట్టెకింద అని చెప్పింది. యశ్వంత్ భట్టాచార్య గదిలోకి వెళ్ళంగానే కాగితం తీసుకుని చదివాడు. పది నిమిషాలు అయింది రాసి అందువల్ల అక్షరాలు మాయం అయాయి.    
    ఖర్మకాలి ఆ కాగితం ఎవరిచేతుల్లోనన్నా పడినా ప్రమాదంలేదు. దానిలో రాసింది అర్ధంగాక మరోసారి చదువుదామని ప్రయత్నిస్తే ఈ లోపల పదినిమిషాలు పూర్తి అయిఅక్షరాలు ఆటోమెటిక్ గ చెరిగి పోవటం కాదు పూర్తిగ మాయం అవుతాయి.    
    కీర్తి ఆ విషయాన్ని కోడ్ లో రాయలేదు. కోడ్ లో రాస్తే డికోడ్ చేయవలసి వస్తుంది. దానివల్ల ఆలస్యం అయితే ఈ లోపల అక్షరాలు మాయం అవుతాయి. అందుకని ఉపాయంగ తేలిక పద్దతిలో అసలు విషయమే రాసింది. చేయవలసిందల్లా తిప్పి చదవటమే వెరీ సింపుల్.    
    రైలు పెట్టె అని రాయాల్సి వస్తే.    
    ట్టె పెలురై, అని తిప్పిరాయటమే.    
    కీర్తి అలా రాశి యశ్వంత్ భట్టాచార్యకి సమాచారం అందించింది. కీర్తి రాసింది తిప్పి చదివితే యిలా వస్తుంది.    
    సుబేదార్.    
    మీరు నేను భోం చేస్తున్న సమయంలో మనకిచ్చిన గదిలోకి ఎవరో దూరి నాపెట్టేని కెలికారు. అయితే మనకి అనుమానం రాని విధంగ పరిశోధించారు. అది నేను గ్రహించాను. తగు జాగ్రత్త వహించటం మంచిదే అయింది.   
                                                                                   షున కీర్తి.   
    యశ్వంత్ భట్టాచార్యకి యివన్నీ కొట్టిన పిండె కాబట్టి కష్టపడకుండా చదివాడు. చదివిం తరువాత అనుకున్నాడు.    
    "నేను యిక్కడ కీర్తిని వంటరిగ వదిలి వెళుతున్నాను. కీర్తి వక్కతీ జాగ్రత్తగ అన్నీ చూసుకోవాలి. ప్రత్యరులు చాలా గట్టి వాళ్ళే.    
    యశ్వంత్ భట్టాచార్య అక్షరాలు మాయం అయిన కాగితాన్ని వెయ్యి ముక్కలుగ చించి తూములో పడేసినీళ్ళు కొట్టాడు. ఆ తర్వాత తీరుబడిగ స్నానం చేసి స్నానాల గదిలోంచి బైటికి వచ్చాడు.
    
                                    24
    
    రాత్రి ఏడు యాభై.    
    యశ్వంత్ భట్టాచార్య వక్క సంచి మాత్రమే తీసుకుని ప్రయాణమయ్యాడు.    
    "నేనూ నీతో వస్తాను తాతయ్యా"కీర్తి బిక్క ముఖం వేసుకుని నసుగుతూ అంది.    
    "నా దగ్గర వుంటే బాగుండ లేదా రాణీ!" సతీదేవి నవ్వుతూ అడిగింది.    
    "బాగానే వుంది అది కాదు."    
    "అది కాదంటే ఏమిటి?"    
    "తాతయ్య వుంటే బాగుంటుంది. తాతయ్య పక్కలో పాడుకుంటూ కదా" అని కీర్తి సిగ్గుతో వంకర్లు తిరుగుతూ చెప్పింది.  
    సతీదేవి నవ్వింది.    
    "గుర్రంలా ఎదిగింది. ఏం మాట్లాడాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు. తాతయ్య దగ్గర పడుకుంటుందిట తాతయ్య దగ్గర ఏ వయసులో ఎవరి దగ్గరపడుకోవాలో తెలియదు. వక్కసారి పడుకోబెట్టి చూపిస్తే..." మాధవ్ గురుదేవ్ అనుకున్నాడు.    
    "రెండో నెల తిరిగే సరికి ఇక్కడ వుంటాను సరేనా!" యశ్వంత్ భట్టాచార్య కీర్తిని బతిమి లాడుతూ అన్నాడు.    
    "సరేలే వెళ్ళు. నాకు బోలెడు బొమ్మలు తేవాలి ఉత్తరాలు రాస్తుండాలి" కీర్తి చెప్పింది.    
    "ఒట్టు తప్పకుండా తెస్తాను."    
    "ఒట్టు వేశావుగా సరేలే తాతయ్యా! నేను ధైర్యం గానే వుంటాలే."    
    "సరే వెళ్ళొస్తాను రాణమ్మా!"    
    యశ్వంత్ భట్టాచార్య కీర్తి దగ్గర శలవు తీసుకుని బైలుదేరుతుంటే మాధవ్ గురుదేవ్ కళ్ళతో ఎవరికో సైగ చేశాడు. అది వీళ్ళిద్దరూ చూసి ఇతరులకు అర్ధంగాని విధంగా పరస్పరం అర్ధ మయేలా మాట్లాడు కున్నారు.    
    "జాగ్రత్త తాతయ్యా!" అంది కీర్తి.    
    "నువ్వూ జాగ్రత్త" నవ్వుతూ అన్నాడు యశ్వంత్ భట్టాచార్య.    
    బుద్ది మంతురాలిలాగా తల వూపిందికీర్తి.    
    యశ్వంత్ భట్టాచార్య అందరి వద్ద శలవు తీసుకుని వాకిట్లో వున్న బండి ఎక్కాడు.    
    గుర్రం బండి కదిలి ముందుకు పరుగు దీసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS