"ఆవిడా పెద్ద పేరు ప్రఖ్యాతులున్న డాక్టరు. మరి మీరు?"
"నేను జర్నలిస్టుని. పెద్ద పత్రిక కాకపోయినా, ఫర్వాలేదు అడ్వర్ టైజ్ మేంట్ల తో నడిపిస్తున్నాను. నాపాకెట్ మనీ నేను కూడా బాగానే చదువుకున్నాను.
ఏం.ఏ జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్."
"చదువు గురించి వదిలేయండి. తన యాక్టివిటీసు తెలుసుగా!"
"తెలుసు.... ఆవిడని పెళ్ళిచేసుకుంటే, నేను కూడా ఆవిడతోపాటు అవన్నీ చూసుకోవచ్చుగా."
తన ఆస్తిపాస్తులన్నీ ఆశ్రమానికి, వేరే అనాధాశ్రమానికి ఇచ్చేసింది."
"ఆవిడే కోటిరూపాయల ఆస్తి."
"బాగుంది డైలాగు. తను మీకు వండి పెట్టె భార్య కాలేదు."
"ఇలాంటి స్టేజిలో నేనలా ఆశించటం పూలీష్ నేస్."
వీణ తలపంకిస్తూ అంది."ఒకే! నేను అనూష తో మాట్లాడతాను. నాకు రెండు రోజులు తరువాత ఫోన్ చేయండి."
"ఓ.కే! మీమీద భారం వదిలేస్తున్నాను. ఒప్పిస్తారని నమ్ముతాను."
లెటజ్ హొప్ ఒకే."
"ఒకే సీయూ."
భరణి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినవైపే తదేకంగా చూస్తూ కూర్చుని టీవీ చూస్తోంది. వీణని చూడగానే "ఏంటి బెంగా? పరిగెత్తు కొచ్చావు?" అని అడిగింది.
"ఊ..." నవ్వింది వీణ.
"నువ్వు ఇవాళ రావడం మంచిదైంది వీణా! నా మూడ్ ఆశలు బాగాలేదివాళ."
"ఏం, ఏమైంది?"
"ఏంలేదు" అనూష సన్నగా నిటూర్చి అంది.
"మణి పెద్ద కొడుకు స్టేట్స్ కి వెళ్ళాడుగా, చిన్నాడు కూడా ఇంటరు కాస్తూ మారేజ్ చేసుకొని స్టేట్స్ కి వెళ్ళిపోయాట్ట. మని హాస్పిటల్ కి కూడా లీవుపెట్టుకుని కూర్చుని ఒకటే ఏడుపుట.ఎందుకంతగా వాళ్ళతో అటాచ్ మెంట్ పెట్టుకోకూడదులే. త్వరలో మన దేశంలో కూడా పిల్లలు పదహారేళ్ళు ఎప్పుడోస్తాయా, స్వేచ్చ ఎపుడు లభిస్తుందా? అని ఎదురుచూస్తారు."
"ఏమిటో అశాశ్వ్తతమని తెలిసినా బంధంలేకుండా మనిషి బతకలేదు వచ్చాను."
"ఏమిటమ్మ అది?"
"ఆ రోజు న పర్సనల్ విషయాలన్నీ చెప్పాను. నిన్ను అడిగేలోపల డిస్టర్బెన్స్ వచ్చింది. ఇవాళ నాకు నీ చరిత్ర చెప్పు. వినాలని వుంది."
"ఏం నువ్వు కూడా ఏదన్నా పేపరు ప్రారంభిస్తున్నావా?"
పేపరులేదు, ఏంలేదుగాని. ఇవాళ నువ్వు ఎత్తి పరిస్తితి ల్లోనూ నే ప్లాష్ బ్యాక్ చెప్పితీరాలి."
"చాల సార్లు చెప్పాలనే అనుకున్నాను. కానీ అంతగా చెప్పుకోదగిన విషయంగా బావించలేదు నేను."
"అంటే..."
"ఏంలేదు. నేనూ ఒకప్పుడు పెళ్ళిచేసుకోవాలనే అనుకున్నాను. నేనూ ప్రేమించాను. ఎంతో ఆరాధించినా వ్యక్తిని. కానీ నాపెళ్ళి ప్రహాసనంలో చిన్నబ్రేక్ వచ్చింది."
"ఆ చిన్న బ్రేక్ కధా కమామీషూ ఏమిటి?"
"చెప్పకా తప్పదా?"
"నేను తెలుసుకోతగ్గ స్నేహితురాల్ని అనుకుంటే చెప్పు."
"అదేంమాట వీణా! ఓ.కే చెప్తాను" అనూష వెల్లకిలా పడుకుని చెప్పడం ప్రారభించింది.
వీణ బోర్లాపడుకుని, మో చేతులు పరుపుమీద పెట్టుకుని, పడుకుని చెంపలనించుకుని శ్రద్దగా వినసాగింది.
గోడ గడియారంలో మ్యూజిక్ వినిపించి ఇద్దారూ తలలు తిప్పి చూశారు. పన్నెండున్నర.
"సెకండ్ షో సినిమా పూర్తయింది" వీణ నవ్వుతూ అన్నది సరిగా పడుకుంటూ.
అనూష మాట్లాడలేదు.
వీణ మృదువుగా అన్నది-"పిచ్చి అనూ! ఇందుకా నువ్వింతకాలం పెళ్ళిచేసుకోకుండా బతుకుతున్నది.అతను హాయిగా పెళ్ళిచేసుకున్నాడు. భార్య కంప్యూటర్ ఇంజనీరట.... ఇద్దరాడపిల్లలట. అతనికి పెద్ద ఆదర్శాలేం లేవు.... చాలా మాములు మగాడు... అతని మీద రెండో, మూడో ఎలిగేషన్స్ కూడా వున్నాయట. ఇలాంటి వ్యక్తికోసం నువ్విలా వున్నానని తెలుసుకుంటే బాధనిపించదంలేదూ!"
"అతనికోసం కాదు... ఆ తరువాత నాన్నగారు కూడా రెండో, మూడో సంభందాలు తెచ్చారు వాళ్ళు కూడా క గురించే మాట్లాడారు. అందుకే అనిపించింది.... ఎవరు చేసుకున్నా నన్ను నా ఆస్తికోసమే చేసుకుంటారు అని.... నన్ను నన్నుగా ప్రేమించేవాడు, నా భావాలను, నా ఆదర్శాలను గౌరవించేవాడు కావాలికానీ, అస్తి చూసి ప్రేమించే వాళ్ళు ఎందుకు? మగవాడి తోడు లేకుండా బతక లేనా? అనిపించింది."
"బతక లేవు... అవును నువ్వే కాదు.... ఆడదానితోడు లేకుండా మగవాడు, మగవాడి తోడు లేకుండా ఆడవాళ్ళు బతకలేరు.... ఈ ప్రపంచం సాంకేతకంగా, సాంఘికంగా, వైజ్ఞానికంగా ఎంత అభివృద్ధి సాధించినా, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒకరికి మరొకరు తోడు లేకుండా బతకడం అసాద్యం... ఇంకో విషయం తెలుసా? ఇంత అందం, చదువు, హొదా వున్న నువ్వు ఒక్కాసారి భర్త, పిల్లలు, కుటుంభ జీవనం వున్న స్రీ పక్కన నిలబడు... ఆమె కళ్ళలో కనిపించే తృప్తి, గర్వం ముందు నీ అందం వేలవేలబోతుంది. ఏడువారాల నగలు వేసుకున్నా, ,మేడమీద నుంచి గుండెల మీదకి వేళ్ళాడే రెండు తాళిబోట్లవిలువ అపురూపమైంది ఆ రెండు తాళిబొట్ల ని కలిపిన తాడు కలసి కష్టసుఖాలను కలబోసుకుంటోన్న రెండు జీవితాలను, వారి జీవితకాల అనుభందాన్ని ప్రతిబింబిస్తుంది. నువ్వు చేస్తున్న సమాజ సేవ, ఉద్దరింఛబడుతోన్న ఈ స్రీలు రేపు నీకు ఏ కష్టంలోనూ ఆదుకోరు."
