"అదిగో.... అందుకే మరి నాకు మండుద్ది... నువ్వొస్తే కాస్త నీకూ రిలాక్స్ గా వుంటుంది. ఓ పనైపోయినట్టూ వుంటుంది. అర్ధం చేసుకోవూ..ప్లీజ్ భయ్యా..." రాహుల్ రిక్వస్ట్ చేశాడు.
"నేను రాలేదురా..." అంకిత్ చెప్పేశాడు.
"భయ్యా... నామాట విను, ఏమో... అదృష్టం కలిసొస్తే నీకు అక్కడే మృదువని దొరకవచ్చు..." చివరాఖరిఅస్రం ప్రయోగించాడు.
"కనపడుతుందంటావా?" అడిగాడు ఆశగా అంకిత్.
"కనపడుతుందనే ఈరోజు రాశి ఫలాల్లో వుంది."
"సరే.. నీమాట ఎందుకు కాదనాలి... కానీ మృదువని కనిపించకపోతే..."
"కనిపించకపోతే..." అనుమానంగా అడిగాడు రాహుల్.
"ఏదో ఓ రైలు కింద నిన్ను తోసేస్తా..." కామ్ గా చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు అంకిత్.
సరిగ్గా పదిహేను నిమిషాల్లో ప్రేశాప్ అయి వచ్చాడు.
ముగ్గురూ రైల్వేష్టషణ్ కు బయల్దేరారు.
***
పనికిరాకుండా పోయిన ఓల్ట్ ట్రాక్ మీద వున్న పాత బోగీలోనుంచి తల బయటకు పెట్టి చూసింది మృదువని. చీకటి పడింది. ఉదయం నుంచి పచ్చిమంచు నీళ్ళు ముట్టుకోకుండా ఆ బోగీలో వుండిపోయింది.
పూర్తిగా తెల్లవారకుండానే, అంకిత్ యింట్లో నుంచి బయటపడింది. ఆ తర్వాత తను ఎక్కడ తిరిగినా ప్రమాదమేనన్న విషయం అర్దమైంది. తనకు సెప ప్లేస్ యిదే. రాత్రివరకూ గడిపి, ఏదో ఓ ట్రెయిన్ లో వెళ్ళిపోవాలి. అందుకే ఉదయం నుంచి ఆ బోగీలో గడిపింది.
ఢిల్లీ వెళ్ళే ట్రెయిన్ కోసం ఆమె వెయిట్ చేస్తోంది. బోగీలో నుంచి చూస్తే ట్రెయిన్ ఎప్పుడు వచ్చేది. ఏ ప్లాట్ ఫామ్ మీదకి వచ్చేది స్పష్టంగా తెలుస్తుంది.
***
"భయ్యా.. అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇంకా సేపట్లో ఢిల్లీ వెళ్ళే ట్రెయిన్ వస్తుంది. యాజితీజ్ గా చాలా లేట్... ట్రెయిన్ ప్లాట్ ఫామ్ మీదికి రాగానే నేను పరుగేడ్తాను... ను నువ్వు 'కట్' చెప్పేవరకూ పరుగేడ్తూనే వుంటాను సరేనా..." అడిగాడు అంకిత్ మొహంలోకి చూస్తూ.
అంకిత్ మాట్లాడలేదు.
"బాసు భయ్యా... నువ్వు 'మూడ్' లోకి వచ్చెయ్... లేకపోతే నామూడు పగలడం గ్యారంటీ... ఒరే చేతనూ... జాగ్రత్తగా ఘట చేయరా..." చెప్పాడు రాహుల్.
అంకిత్ మాత్రం మౌనంగా వుండిపోయాడు.
అప్పుడే ట్రెయిన్ శబ్దం వినిపించింది.
"భయ్యా... ట్రెయిన్ వచ్చేస్తోంది. బీ రెడీ... ప్లీజ్ భయ్యా.." అన్నాడు రాహుల్, తన బ్యాక్ ప్యాకెట్ లో నుంచి దువ్వెన తీసి స్టయిల్ గా క్రాప్ సరిచేసుకుంటూ.
అలాగే నన్నట్టు తలూపాడు అంకిత్. కానే అతని మనసంతా మృదువని మీదేవుంది. తనకు కనిపించినట్టే కనిపించి ఎన్నిసార్లు మిస్సయింది. తనూ వూహించని మలుపులు... తను ఎక్స్ పెక్ట్ చేయని వెరైటీ ట్వీస్ట్ లు ...
అనౌన్స్ మెంట్ వినిపిస్తోంది... యూవర్ అటెన్షన్ ప్లీజ్... ఢిల్లీ వెళ్లవలసిన.."
"భయ్యా... అదిగో ట్రెయిన్ వచ్చేసింది..." అంకిత్ అలానే చూస్తుండిపోయాడు.
చేతన్ కెమెరా తో రెడీగా వున్నాడు. ట్రెయిన్ మెల్లి మెల్లిగా స్లో అవుతోంది.
"భయ్యా..." గట్టిగా అరిచాడు రాహుల్. అప్పటికే త్రేయ్న్ ప్లాట్ ఫామ్ మెడ ఆగింది.
"ఏంటి?" అన్నట్టు రాహుల్ వంక చూసాడు.
"హూ... నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి భయ్యా... ట్రెయిన్ వచ్చింది. ఆగింది..."
"సారీరా రాహుల్... నా మనసంతా మృదువని చుట్టే తిరుగుతోంది. నువ్వూ, చేతన్ ఈ పని చూస్కోండి. నన్ను వదిలేయండి" అన్నాడు బయటకు నడవబోతూ.
"భ..య్యా.." గట్టిగ అరిచాడు రాహుల్.
"ఏమితనట్టు" చూసాడు అంకిత్.
"ఫస్ట్ టైం టీవీలో కనిపించ బోతున్నాను. సెంటి మెంట్ టచ ను కాదనకు భయ్యా... నీ నోటితో యాక్షన్ అంటే, వచ్చే సంవత్సరంకల్లా, నేనూ హీరోని అవుతానేమో... ప్లీజ్ భయ్యా... తధాస్ట్ దేవతలు నిద్రరాక ఆకాశంలో తిరుగుతూ వుంటారు. మృదువని నీకు కనిపిస్తుంది. నిద్రరాక ఆకాశంలో పచార్లు చేసే తధాస్ట్ దేవతులు తధాస్తు అంటారు" నం స్టాప్ గా మాట్లాడుతున్నాడు రాహుల్.
అంకిత్ ఓ సారి రాహుల్ వంక చూశాడు. అతడ్ని బాధపెట్టడం యిష్టం లేక, 'అలాగే'అన్నట్టు తలూపాడు.
***
ఢిల్లీ వెళ్ళాల్సిన ట్రెయిన్ బయల్దేరటానికి సిద్దంగా వుందన్న అనౌన్స్ మెంట్ వినిపించింది. రాహుల్ మరోసారి క్రాప్ సరిచేసుకుని రెడీగా వున్నాడు. ట్రెయిన్ చిన్నవర్క్ తో కదిలింది. స్లోగా క..దు ..లు..తొం ..ది.
***
మృదువని తల బయటకు పెట్టి చూసింది.ఢిల్లీ వెళ్ళే ట్రయిన్ కదులుతోంది. ఈ ట్రయిన్ మిస్సయితే... తనకిక చావే... అప్పటికే నగరమంతా జల్లెడ పట్టినట్టు తన గురించి సెర్చింగ్ మొదలైంది.
తనలాగైనా ఈ ట్రెయిన్ ని క్యాచ్ చేయాలి, లేక పోతే తను రిస్క్ లో పడ్డట్టే... మెల్లిగా బోగీలో నుంచి బయటకు వచ్చింది. దూరంగా షంషేర్ దాదా వాలకు అందనంత వేగంగా పరుగెత్తాలి... పరుగెత్తి ట్రయిన్ క్యాచ్ చేయాలి.
ఒక్క క్షణం గట్టిగ కళ్ళు మూసుకుని తెరిచింది. కొంగును బొడ్లోదోపింది. తన శక్తినంతా కూడదీసుకుంది.
***
"యాక్షన్..." అన్నాడు అంకిత్.
రాహుల్ ఉస్తాహంగా పరుగేడుతున్నాడు. కెమెరా రాహుల్ ని ఫాలో అవుతూంది. అంకిత్ కెమెరా 'వ్యూ' లో నుంచి చూస్తూన్నాడు. సరిగ్గా అప్పుడే రాహుల్ కాస్త కనుమరుగయ్యాడు. కెమెరా 'వ్యూ' లోకి వచ్చింది మృదువని.
ఒక్క క్షణం తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. రాహుల్ కంపీర్ట్ మెంట్ లోకి ఎక్కి, ఎంట్రన్స్ దగ్గరవున్న రాడ్స్ ని పట్టుకుని, అంకిత్ 'కట్' చెప్పెయగానే, వెంటనే దిగిపోవాలని డిసైడ్ అయ్యాడు. ట్రయిన్ స్పీడండుకోకముందే ఈపని చేయాలి.
