Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 32

    భస్మ పక్కనే వున్న మినీ ప్రీజ్ ని పైకెత్తాడు. కొద్దీ క్షణాలు ఆలస్యమైతే ఆ ప్రీజ్ కౌశిక్ తలను తాకేదే.

    "భస్మా..." కంగారుగా పిలిచింది మౌన, ఒక్కక్షణం ఆగిపోయాడు భస్మ.
    ఆ పిలుపు.. ఉహూ... ఆ గొంతు అతని ఆలోచనా పావురాలను తాకుతోంది.
    అతనికి ఏదో గుర్తుస్తోంది.
    కానీ, పూర్తిగా జ్ఞాపాకాన్ని ఆహ్వానించలేకపోతున్నాడు. ఆమె కాళ్ళ ముందు కనిపించగానే ఓ దృశ్యం విజువలైజ్ అయి అతని కళ్ళముందు కదలాడింది.
    "హా.. లో.. అయాం.. మౌన" అంటూ తన చేతిలో చేయి వేసి షేక్ హ్యాండిస్తూ..
    "భ..స్మా.. డోంట్ వేస్ట్ టైం... కం బ్యాక్..." అతని మెదడును ఎవరో శాసిస్తున్నారు.
    ప్రిజ్  నేలకేసికొట్టి ముందుకు కదిలాడు.
    కౌశిక్ లేచేలోగాబయట్నుంఛీ లాక్ చేశాడు. మెట్లు దిగుతూ తాపీగా వెళ్తేన్నభస్మను చూసి రిసెప్షనిష్ట్ అలాగే వుండిపోయింది. రిసెప్షనిస్ట్ కు ఫోన్ చేసి అలర్ట్ చేసే అవకాశం కూడా రాలేదు. ఆ గదంతా కొద్దీ నిమిషాల్లో నే చిందర వందర చేశాడు.
    కౌశిక్ తన బలాన్ని ఎంతగా ప్రయోగించినా భస్మ ముందు నిలవ లేకపోయాడు.
    కానీ, అతనికి ఆశ్చర్యం కలిగించిన వుషయాలు ఏమిటంటే...
    తనని భస్మ చంపకపోవడం...
    మౌనాని చూసి ఒక్కక్షణం భస్మ కదిలిపోయాడు.
                                                  ***
    "అంటే మీరు భస్మను ప్రేమిస్తున్నారా?"
    "అవును" చెప్పింది మౌన.
    హొటల్ లావెన్ లో ఆ సంఘటన జరిగాక, కౌశిక్ భస్మకు సంభందించిన అనీ విషయాలు చెప్పాడు.
    అతనేమిటో తెలిసాక కూడా ప్రేమిస్తున్నారా?"అ దిగాడు కౌశిక్.
    "నేను అతడేమిటో తెలుసుకుని ప్రేమించటం మొదలు పెట్టలేదు. ఇప్పుడు అతనెవరో తెలిసాకా మానేయడానికి..." శిరంగా అంది మౌన.
    "అతనికి ఎప్పుడే ప్రమాదం వాటిల్లుతుందో కూడా తెలియదు. నిజానికి అతనిలో ఏ స్పందనలూ లేవు. అతనో రోబో... జస్ట్ లైక్ రోబో...
    "ఈ రోజుల్లో రోబోలకే మెదడు స్పష్తించాలని మేధావులు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఓ రోబో లాంటి మనిషిని మనిషిగా నేను మార్చుకోలేనా?"
    "కానీ చట్టం దృష్టిలో అతనో నేరస్తుడు. రేపు అతను పట్టుబద్దక, అతడ్ని 'ఉరి' తీసినా ఆశ్చర్యంలేదు" కౌశిక్ అన్నాడు.
    "మీకు సతీసావిత్రి కధ తెలుసుననుకుంటాను. యముడితో పోరాడింది ఆవిడా. నేను చట్టంతో పావురాదలేనా? అయినా అతని ప్రమేయం లేకుండా అతను చేసే నేరాలను అతనెలా బాధ్యుడవుతాడు?" సూటిగా అడిగింది మౌన.
    "ఆఫ్ కోర్స్..." అని మౌన మొహంలోకి పరిశీలనగా చూసి_ "ఐ అప్రిషియేట్ యూ... ఈ రోజుల్లో ఓ సారి చూడగానే 'ఐ లవ్ యూ'అని ...బైక్ ళ మీద షికార్లు కొట్టి ఆ తర్వాత ఏ ఒక్కరో తొందరపడి, ఆపై మోహాలు చాతెసుకునే ఆమెచ్యూర్డ్ ప్రేమేలే ఎక్కువ... కానీ... మీ ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది.
    అవతలి మనిషి ఎవరో తెలిశాక కూడా ప్రేమించటం గొప్ప విషయం."
    "థాంక్యూ సార్.. ప్రేమంటే ఎదుటి వ్యక్తి బలహీనతల్ని కూడా ఇష్టపడడం... ప్రేమంటే, 'అతను నన్ను ప్రేమిస్తే' నేను అతడ్ని ప్రేమించాలి' అనుకునే సిద్దాంతం కాదు.
    నాకు అతని ప్రేమ వుంది. ఆ ప్రేమను అతను 'యాక్సెప్ట్' చేత్సాదావు లేదో అన్నది వేరే విషయం. నేను అతడ్ని ప్రేమించాలనుకున్నాను.ప్రేమిస్తాను" అంది మౌన.
    "వేల్ సేడ్... అల్ డ బెస్ట్ మౌన గారూ... మీరు నాకు సహకరించాలి" అన్నాడు కౌశిక్.
    "విత్ ప్లజర్... భస్మను మామూలు భస్మగా, నాకు అప్తుడైనా భస్మగా మార్చే ప్రయత్నంలో నేను తప్పకుండా సహకరిస్తాను."
    "థాంక్యూ..."
    "వేల్ కం సార్... నేను యింటికి వెళ్తాను. రేపు ఉదయం మిమ్మల్ని కలుస్తాను. మనం ఓసారి భస్మ పేరెంట్స్ ని కలుద్దాం..."
    "అలాగే... బై.. గుడ్ నైట్..."
                                               ***
    ఖాన్ వికృతంగా నవ్వాడు. అతడలా నవ్వుతూనే వున్నాడు. కరంజయా భయంగా చూస్తున్నాడు.
    కరంజయా భయాన్ని అర్ధం చేసుకున్నట్టు చూసి "భయపడకు కరంజయా... నీకేం పిచ్చేక్కలేదు. ఓంకొన్ని రోజుల్లో ఈ ప్రపంచానికే పిచ్చెక్కుతుంది.భస్మ మనం అనుకున్న రేంజ్లో వున్నాడు. అతడ్ని పఎగిమ్చి మనం అనుకున్నది సాధించవచ్చు. ఆ రోజు దగ్గరలోనే వుంది..."
    "మీరివ్వళా చాలా సంతోషంగా వున్నారు ఖాన్ సాబ్. మీ మొహంలో ఇంత సంతోషాన్ని నేనెప్పుడూ చూడ్లేదు..."
    "అవును కరంజయా...ముప్పయ్ ళ్ళు... దాదాపు ముప్పయ్ ళ్ళు ఇండియాలో వున్నాను. ఈ దేశాన్ని సర్వనాశనం చేసి, వూహూ.... ఈ ప్రపంచాన్నే భస్మీపటలం చేసికానీ, ఈ గడ్డమీది నుంచి కదలను.
    వచ్చేవారం ప్రపంచ నాయుకులు హైదరాబాదు వస్తున్నారు. ఈ లోగా ఇక్కడ అల్లరను సృష్టిస్తాను. ఫావులీసుశాఖ వాటి మీద తమ దృష్టిని పెడుతుంది.
    ఈ లోగా మన పని మనంకానిచేద్దాం. అన్ని దేశాలకు చెందిన ముఖ్యలను ఓకే వేదిక మీద చంపేస్తాం. బెల్ట్ బామ్బుకన్నా భయంకరమైన దానితో... మన చేతిలో వున్న భయంకరమైన ఆయుధం భస్మ..."
    "ఈ ఆపరేషన్ అయిపోగానే మీరు ఇండియా వదిలి వెళ్ళిపోతారా?" కరంజయా అడిగాడు.
    "అవును... ఇక ఇక్ కడేం పని... స్మశానాలు, శావాలు... ఎందుకూ పనికిరాని ఈ ఇండియాను కొత్తరకంగా సృష్టించే పని మా పాకిస్తాన్ చూసుకుంటుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS