Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 33


    
    సీ.    జగనొబ్బ గండాంక సంగ్రామనిశ్శంక
            జగతీశ రాయవేశ్యాభుజంగ
        అఖిల కోటలగొంగ యరిరాయమదభంగ
            మే లందు ధరణీశమీనజాల
        మూరురాయగండ ముఱియు రాజుల మిండ
            యభివృద్ది మీరు చౌహత్త మల్ల
        ఘనగాయగోవాళ కామినీ పాంచాల
            బ్రహ్మాయు శశివంశ పరుశురామ

    గీ.  దండిబిరుదుల సురతాణి గుండెదిగుల
        బళిర యల్లయవేముని వగరమిండ
        రమణమించిన మేదిని రావుబిరుద
        సంగరాటోప! మాదయలింగ భూప!        300

    కర్ణాట రాజ్యమున కరిగినప్పు డారాజు మీవాసస్థల మెట్టిదనఁగాఁ జెప్పినది -

    సీ.   వరరాజ్య వరదుర్గ పరవైభవ శ్రీలఁ

            గొనకొని విడనాడు కొండవీడు
        పరిపంధి రాజన్యబలముల బంధించు
            కొమరు మించినబోడు కొండవీడు
        ముగురు రాజులకును మోహంబు పుట్టించు'
            గుఱుతైన యుఱిత్రాడు కొండవీడు
        చటులవిక్రమ కళాసాహసం బొనరించు
            కుటిలాత్ములకు గాడు కొండవీడు

    గీ||  జవన ఘోటక సామంతసరసవీర
        భటనటా నేకహాటక ప్రకటగంధ
        సింధురారవమోహన శ్రీలఁ దనరు
        కూర్మి నమరావతికి జోడు కొండవీడు.        301

    అక్కడ రాజసమ్మానమునకుఁ గాలయాపనము కొంత సంభవింపఁగా నాదేశపు విధము తనకు సరిపడక కర్ణాటరాజ్య లక్ష్మీం బ్రార్థించుచుఁ జెప్పిన పద్యము -

    శా|| కుల్లాయుంచితిఁ గోఁక సుట్టితి మహాకూర్పాసముం దొడ్గితి
        వెల్లుల్లిం దిలపిష్టము మెసవితి విశ్వస్త వడ్డింపఁగా
        సల్లా నంబలి ద్రావితి రుచులు దోసంబంచుఁ బోనాడితిం
        దల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా నేను శ్రీనాధుఁడ.    302

    తొలత నీతఁడు కొండవీటిరెడ్ల యస్థానకవి. ఆరాజ్య మంతరించిన తర్వాత రాజమహేంద్రవరమున రాజ్యమేలునళ్ళయవేమ వీరభద్రారెడ్ల యొద్దఁ జేరెను. వేముని వర్ణించిన వర్ణనము-

    సీ.    రాజనందన రాజరాజాత్మజులుసాటి
            తలఁవ నల్లయవేమధరణి పతికి
        రాజనందన రాజరాజాత్మజులు సాటి
            తలఁవ నల్లయవేమధరణిపతికి
        రాజనందనరాజరాజాత్మజులు సాటి
            తలఁవ నల్లయవేమధరణిపతికి
        రాజనందనరాజరాజాత్మజులు సాటి
            తలఁవ నల్లయవేమధరణిపతికి

    గీ||  భావభవభోగ సత్కళా భావములను
        భావభవభోగ సత్కళా భావములను
        భావభవభోగ సత్కళా భావములను
        భావభవభోగ సత్కళా భావములను        303

    ఉ|| వీరరసాతిరేక రణవిశ్రుత! వేమనరేంద్ర! నీయశం
        బారభమానతారకరహారవిలాసము నీ భుజామహం
        బారభమానతారకరహారవిలాసము నీ పరాక్రమం
        బారభమానతారకరహారవిలాసము చిత్రమారాయ.    304

    వేమ వీరభద్రారెడ్లు ప్రతివర్షమును సింహాచలపు నృసింహస్వామికిఁ దిరునాళ్ళు జరిపించుచుండేడివారు. శ్రీనాధుఁడును వారితో నచ్చటికరిగేడివాఁడు. అపర్వతము మీఁదికి యాత్రార్ధము వచ్చునానా స్త్రీలను జూచి యాతఁడు వర్ణించిన వర్ణనము.

    సీ.   హరినీలముల కప్పు లణఁగించునును గొప్పు
            విడఁ బువ్వఁదండ తా వీడఁబాఱ
        కోటిచందురుదాలు గొటమీటఁ గఁజాలు
            మొగముఁగుంకుముచుక్క సొగసుగుల్క
        అల్లజక్క వలటెక్కు లణఁగఁద్రొక్కఁగ నిక్కు
            పాలిండ్లపై నాఁచు పైఁట జాఱ
        ఇసుకదిన్నెల మెట్టు పసిఁడి చెంపలఁగొట్టు
            పిఱుఁదుపై మొలనూలు బెళుకుదేర

    గీ||  చిగురుఁగేమ్మోవిఁబగడం పుజిగియు మెఱయ
        మాట లాడఁగఁ గనుదోయితేట లమరఁ
        జెమట లూరంగ సింహాద్రి చేరవచ్చె
        భోగగుణధామ యంద్రని యోగిభామ.        305

    సీ||   విడినకొప్పున జాజివిరు లొప్పుగా రాలఁ
            జిట్టికుంకుముచుక్క బొట్టు చెదర
        చక్కఁగాఁ బటు వారుసందేడుకుచ్చేళ్ళు
            చెలఁగు మెట్టియల పైఁ జిందులాడ
        కొదమగుబ్బలఁ బైఁట కొంగు సయ్యన జాఱ
            ముక్కున త్తొక వింతముద్దు గుల్క
        మొలగంట లిమ్మ గుమ్రోఁతతో రంజీల్లఁ
            గనకంపుటందియల్ ఘల్లు రనఁగఁ

    గీ||  బొసఁగఁ గవ్రంపువీ డేముల్ పొందుపఱిచి
        యనుఁగు జేడెలతో ముచ్చ టాడికొనుచు
        నలరుసింహాద్రిపై కెక్కి హర్షమునను
        వచ్చేఁ గలకంఠి వేపారిమచ్చేకంటి.        306

    శా.  రా పాడంగలగుబ్బచన్ను ఁగవతో రాకేందుబింబంబు పైఁ
        దూ పేయంగల ముద్దు నెమ్మొగముతోఁ దొరంపు మైదాయతోఁ
        జూపు ముద్దుల బాలసంఘములతో సొంపారులేనవ్వుతో
        వేపార్యంగన వచ్చేఁ గా సేబిగితో వేణీభరచ్చాయతో.    307

    సీ.   పలు తెఱంగులరంగు పద్మ రాగలవీణె
            చకచకత్ర్పభల సాక్షాత్కరింప
        సొంపుతో రవచెక్కడంపు ముంగరచాయ
            వగడంపు మోవిపైఁ బదిడ విల్ల
        విరిసి యోసరిలీ క్రిక్కిఱిసినచనుడోయి
            బిగువున నెఱరైక పిక్కటిల్ల
        ఒసవరియొయ్యారి ముసుఁగులో నెఱివేణి
            కొమరాలిమూపున గునిసి యాడ
        
    గీ.  విరులతావియు నేమ్మేని వెనుక కచ్చ
        పెళపెళక్క నుచిఱు దొడల్ బెళుకునడుము
        వలుద పిఱుఁ'దులు కలికి చూపుల బెడంగు
        లొలయఁ గన్నోంటి వేపారికలువకంటి.        308

    క.  రంభాస్తంభము లూరవు
        లంభోరుగనిభము లక్షు లతను శరంబుల్
        జంబాసురారిమదగ గజ
        కుంభము లీనంబివారి కోడలి కుచముల్.    309

    క.  అద్దిర కులుకులు బెలుకులు
        నిద్దంపు మెఱుంగుఁ దొడల నీటులు
        దిద్దుకొని యెలవచ్చును
        ముద్దియ యీనంబిపడుచు ముచ్చట దీఱ?    310


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS