Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 32

    "వాడి బాబు ఎడ్రసు, ఫోన్ నెంబరు కూడా కావాలి!" అన్నాడు రెండోవాడు. వాడు కూడా మొదటి వాడికి ఏమి  తీసిపోని విధంగా ఉన్నాడు.

    "ఏ -ఎ -ఎందుకు?" చిట్టబ్బాయి భయం భయంగా అడిగాడు.

    చిట్టబ్బాయి మాట పూర్తికాకముందే అతని మొహం మీద బలంగా గుద్దేడు మొదటివాడు.

    "అమ్మ నాయనో! చంపెశావ్ కదురో" బాధగా అరుస్తూ అన్నాడు చితబ్బాయ్.

    "ఎందుకయ్యా ఊర్కే అలా కొడ్తారు?" అని అడిగాడు కన్నారావు.

    రెండోవాడు కన్నారావు విపుమిద  గుభిమని గుద్దేడు.  

    "వార్నాయనోయ్, చచ్చాన్రోయ్" అన్నాడు కన్నారావు.

     
                         *                      *                  *

    ఇద్దరు భికరాకారులూ వాళ్ళిద్దరి చొక్కాకాలరు పట్టి గాల్లోకి లేపారు.

    ట్రింగ్ - ట్రింగ్ -"

    ఫోను మోగుతూ ఉంది.

    అక్కడే సోఫోలో కూర్చుని వారపత్రిక చదువుతున్న చిన్నమ్మాయి. ఫోన్ లిఫ్ట్ చేసింది.

    "హలో..ఎవరు మాట్లాడుతున్నారు?" అవతలి కంఠం ప్రశ్నించింది.

    "చిన్నమ్మాయ్..." జావాబు చెప్పింది.

    "చిన్నమ్మాయా?... ఆ యింట్లో పెద్దమ్మయిలు ఎవర్తెనా ఉంటే పిలువ్" అంది అవతలి కంఠం.

    "నేను పెద్దమ్మయినే... నన్ను అంతా చిన్నమ్మి అని అంటారు అంతే" విసుక్కుంటూ అంది చిన్నమ్మాయ్.

    "ఓ...అలాగా...హుహుహుహొహొ హ్హహ్హహ్హ"  అవతల నుండి గట్టిగా నవ్వు వినిపించింది.

    "ఏంటి? నేనేమ్తెనా జోకేశానని అనుకుంటున్నారా? -హు -" ఫోన్ దిస్మనేక్ట్ చేసింది. చిన్నమ్మాయి.

       "బ్లడి పూల్స్ - ఫోన్లో ఆడగొంతు వినిపిస్తే చాలు పిచ్చ్చి వేషాలు వేయాలని చూస్తారు రౌడి వెధవలు!...అనుకుంటూ వెనక్కి తిరిగింది.

    అంతలోనే మళ్ళి ఫోన్ మోగింది.

    "ట్రింగ్ ట్రింగ్.... ట్రింగ్ ట్రింగ్...."

    విసుక్కుంటూ ఫోనేత్తింది చిన్నమ్మాయ్.

    "హలో!" అంది అరుస్తూ.

    "హలో.... అదేంటి పాపా ఫోనట్టా పెట్టేశావ్?..." అంది అవతలి కంఠం.

    "పాపా ఏంటి?" - నేనేమి చిన్నపిల్లని కాను!!-" విసుక్కుంటూ అంది.

    "సరేగాని ఫోన్ పెట్టేయ్యకు... మేమేమి ఆడపిల్లల్ని ఫోన్లో ఏడిపించే రౌడి అబ్బాయిలం  కాము. మీతో పనుండే ఫోన్ చేశాం" అంది అవతలి కంఠం.

    "అటువంటప్పుడు ఆ నవ్వేంటి?" అడిగింది చిన్నమ్మాయి.

    "ఆ మాత్రం నవ్వకపోతే మేవంతే విలువుంటుందా మీకు?"

    "ఎవరు మీరు! ఏం పనిమీద ఫోన్ చేశారు?"

    "ఉండు... మావాడు కూడా ఫోన్లో నవ్వాలని తెగ సర్దాపడిపోతున్నాడు  పిచ్చి సన్నాసి ..." అంది అవతలి కంఠం.

    నాలుగు సెకన్ల తరువాత మళ్ళి నవ్వు వినిపించింది.

    "హహుహుహు హ్హహ్హహ్హ హొహొహొ..."

    మళ్ళి రెండు సెకన్ల గ్యాప్. తరువాత మొదటి కంఠం ఫోన్లో  పలికింది.
    "నవ్వు వాడిది బాగుందా?  నాది బాగుందా?"

    "ఏంటి ఇకిలింపుల భాగోతం?...మీకేం పనో చెప్పండి.... లేకపోతే ఫోన్  పెట్టేస్తా..." అంది చిన్నమ్మాయి.

    "ఫోన్ పెట్టేస్తే మికేనష్టం... ఈసారి మళ్ళి మీకు ఫోన్ చెయ్యం...పండుని సఫా చేసేస్తాం"  అంది అవతల కంఠం.

    చిన్నమ్మాయి కంగారుపడింది.

    "ఆ...మీరా?... ఉండండి మా నాన్నని పిలుస్తాను..."

    ఫోన్ పక్కన పెట్టి "నాన్నా..." అంటూ గావుకేక పెట్టింది చిన్నమ్మాయి.

    చిన్నమ్మాయి వేసిన కేకకి లోపల గదిలోంచి కంగారుగా బయటికి పరిగెత్తుకుని వచ్చాడు రంగనాయకులు.

    "ఏంటమ్మా అలా అరిచావ్?"

    "ఫోన్ నాన్న..." ఫోన్ వంక భయంగా చూస్తూ అంది చిన్నమ్మాయి.

    మాయదారి సంత!.. ఆ దుర్మార్గుల  దగ్గర్నుండేనా  అమ్మా?..." తడబడుతూ అడిగాడు రంగనాయకులు.

    చిన్నమ్మాయి అవునన్నట్టు తల ఊపింది.

    రంగానాయకులు  కంగారుగా ఫోన్ లిప్ట్ చేశాడు.

    "హలో..."

    "హలో...ఎవరు మాట్లాడుతున్నారు?" అడిగింది అవతలి కంఠం.

    "నేను...రంగానాయకుల్ని!"

    "మీ పండు మాదగ్గరున్నాడు!..."

    "తెల్సులేవయ్య... ఎన్నిసార్లు చెప్తారు?....పాడుసంతా"

    "ఎన్నిసార్లు చెప్పడమేంటి?....ఇదేగా మొదటి సారిగా చెప్పడం?"

    "సర్లె... నీకు నాకంటే మతిమరుపు ఎక్కువలా వుంది" అన్నాడు రంగనాయకులు.

    "ఊ... అనవసరమ్తెనా వాగుడు ఆపు... మీరు మాకు మూడు లక్షల రూపాయలివ్వాలి!.... లేకపోతే పండుని  చంపేస్తాం"  కరుకుగా వినిపించింది. అవతలి కంఠస్వరం.

    "బాబోయ్... ని మతిమరుపు  ఖరీదు లక్షరూపయలా ?.... ఇదెక్కడి మాయదారి సంతయ్య బాబూ?... ఇందాక రెండు లక్షలేగా అడిగారు... నేను వెంటనే బ్యాంకుకి  వెళ్ళి రెండు లక్షలు డ్రాచేసి తీసుకొచ్చాను... అంతలోకె మరో లక్ష పెంచి చెప్తున్నవెం?... జాగ్రత్తాగా  అడిగింది?... గుర్తొచ్చింద?"

    "ఇందాక అడిగింది మేముకాదు..."

    "మీరు కాకపోతే మీ అసిస్టెంటు అయి ఉంటారు బాబు...వాళ్ళు రెండు లక్షలకె  అడిగారు...."

    "వాళ్ళు మా అసిస్టెంట్లు కాదు...వాళ్ళు వేరే పార్టి....మేము వేరే పార్టి... వాళ్ళని తనని పండుని మేము తిస్కెళ్ళి పోయాం..."

    రంగనాయకులు ఫోన్లో మాట్లాడుతుండగా అతని భార్య  చాముండేశ్వరి ఆ గదిలోకి వచ్చింది.

    "ఎవరండి ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నారు?" అడిగింది చాముందేశ్వారి.

    చిన్నమ్మాయి తల్లి వంక చూస్తూ చూపుడువేలుని పెదాల మీదపెట్టి "ష్...." అంది.

    "ఒందుని కిడ్నాప్ చేసి తిస్కెళ్ళిన  వాళ్లు మాట్లాడుతున్నారు" మెల్లగా చెప్పింది చిన్నమ్మాయి.

    "హమ్మ చచ్చినోళ్ళారా?...మీరా??...ఉండండి మిపని చెప్తా...

    చాముండేశ్వరి  గబుక్కున  రంగనాయకులు  చేతిలోంచి ఫోన్ లాక్కుంది.

    "...మరేమో మూడు లక్షలు ఇస్తున్నట్టేగా? "  అంటూ అవతలి వ్యక్తి అడుగుతూ ఉన్నాడు.

    "మూడు లక్షలా ?... నీ శ్రాద్ధం పిల్లులకి పెట్టా... నీ కడుపుడకా... మికిదేం  పోయేకాలం  వచ్చిందిరా..."

    వర్సబెట్టి  తిద్తూనే ఉంది చాముండేశ్వరి.

    "ఒర్నాయనోయ్ - మధ్యలో రాంగ్ నేంబరేదో కల్సినట్టుందే!..." అంది  అవతలి కంఠ స్వరం.

    "రాంగ్ నేంబరేంట్రా పిచ్చివేధవాయ్...ర్తేట్ నెంబరె. అయినా పసిపిల్లాడు వాడు నీకేం ద్రోహం చేశాడ్రా దోంగాపినుగా."

    ఆవేశంతో ఊగిపోతూంది చాముండేశ్వరి.

    "ఏయ్ చాముండి! వాళ్ళతో నేను మాట్లడుతాగా?  ఆ ఫోనిటివ్వు"  అన్నాడు రంగనాయకులు ఫోనందుకోడానికి  చెయ్యి చాపుతూ.

    చాముండేశ్వరి భార్తకి ఫోనందకుండా ఆ పక్కకి  తిరిగి వాళ్ళని తిట్టసాగింది.

    "ఈ తల్లి మనసుని క్షోభాపెట్టిన నువ్వు పురుగులుపడి చస్తావ్ రా. నా పండుని ఎత్తుకెళ్ళిన  ని చేతులు పక్షవాతం వచ్చి పడిపోతాయ్ రా."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS