"ఏంటమ్మా?" అడిగాడాయన.
"ఈ పాప బ్లడ్ ప్రిజర్వ్ చేసి అదే వాడితే?"
"వాట్?" దిగ్బమగా చూశాడు.
"వండ్రపుల్ ఐడియా. కానీ ఈజీట్ పాజిబుల్?"
"నథింగ్ ఈజ్ ఇంపాజిపుల్ డాక్టర్" నవ్వింది. అన్నట్టుగానే అసాద్యం అన్నపదం ఆమె డిక్షనరీ లోంచి తుడిచి పెట్టుకుపోయింది. ఆమె జీవితపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకోతగిన రోజుగా ఆ రోజు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె జీవితం మరో విజయసోపానం అదిరోహించింది.
మరోసారి న్యూస్ పేపర్లలో ఆమె పేరు మారుమోగిపోయింది. మొత్తం హైదరాబాద్ డాక్టర్లే కాక ఆంద్రప్రదేశ్ నుంచే అనేక మంది డాక్టర్ల ఆమెని అభినందనల పరంపరలతో ముంచెత్తారు. డాక్టరు హరిశ్చంద్ర గర్వంగా అన్నాడు. "అనూషా! నువ్వు నా శిష్యూరాలివై నందుకు నేను గర్వపడుతున్నానమ్మ."
భరణి మళ్ళీ కెమేరాతో, లెటర్ పాడ్ తో వచ్చి అనూషని ఇంటర్వ్యూ చేసి, పోటోలతో సహా దానిని ప్రచురించాడు.
లయన్స్ క్లబ్ వాళ్ళంతా వచ్చి ఆమెని వాల్లక్లాబ్ మెంబర్ చేరమని వత్తిడి చేసారు. అనూష మేమ్బరుగాచేరక పోయినా తన వంతు సహకారం ఎప్పుడైనా వాళ్ళ కుంటుందని చెప్పింది.
* * * *
భరణి దృష్టిలో ఇప్పుడు అనూష హీరోయిన్. ఆమె మీద పరమ,గౌరవం ఉన్నట్టుండి పర్వతంలా పెరిగిపోయాయి. ఆమెతో మాట్లాడడం ఆమెని కలుసుకోవడం అతని దిన చర్యలో ఓ బాగం అయి పోయింది ఆమెని కలవమని రోజు, ఆమెతో మాట్లాడని రోజు వెలితిగా అనిపించ సాగింది. తను ఇంతకాలం పెళ్ళి చేసుకోకుండా ఎదురు చూసింది ఆమె కోసమేనేమో అనిపించసాగింది. అనూష లాంటి స్రీ జీవిత సహచరిగా వున్న మగాడిని మించిన అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ వుండారెమో అనిపించసాగింది. ఆమెతో చాలాసార్లు తన మనసుతో మాట ప్రస్తావించడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి ధైర్యం చాలాలేదు.
ఆ రోజు భరణి వీనకి ఫోన్ చేశాడు.
"మేడమ్! మీతో కొంచెం పనుంది, నేనిప్పుడు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. ఉంటారా?" అడిగాడు.
"ఏం నేనేం ఘనకార్యం చేయలేదే నన్ను ఇంటర్యూ చేయడానికి" నవ్వింది వీణ.
"ఇంటర్వ్యూ చేయడానిక్కాదండి. వేరే ముఖ్యమైనా విషయం మాట్లాడాలి."
"ఒకే రండి... నేనివాళ ఇంట్లోనే వుంటాను. ఎన్ని గంటలకు వస్తారు?"
"బయల్దేరుతున్నాను."
"గుడ్! రండి" ఫోన్ పెట్టేసింది.
భరణి ఉత్సాహంగా స్కూటరు స్టార్టు చేశాడు.
ఇరవై నిమిషాల తరువాత సనత్ నగరలో వున్న వీణ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు.
'కమిన్" వీణ స్వరం కమాండింగ్ గా వినిపించింది.
భరణి దగ్గరగా వేసివున్న డోర్ తీసుకొని లోపలకి వెళ్ళాడు.
"రండి" చిరునవ్వుతో ఆహ్వానించింది.
భరణి, ఆర్టిస్టుగా అలంకరించివున్న ఆ డ్రాయింగ్ రూం అందాన్ని, గది గోడలమీద వున్న ఆర్ట్ నీ చూస్తూ కూర్చూన్నాడు.
"ఏంటి మా ఇంటిమీద ఏదయినా ఆర్టికల్ రాయడానికి వచ్చారా?"
భరణి నవ్వాడు. "లేదండీ! మీ ఇల్లు చాలా ఆర్టిస్టుగా వుంది. అందుకే వచ్చిన పనిమర్చి పోయిచూస్తున్నాను."
"జర్నలిస్టులనిపించారు. చెప్పండి కూల్ డ్రింక్ తీసుకుంటారా? కాఫీనా? టీనా?"
"ఇది టీ తాగే సమయం కాబట్టి, టీ ఇస్తే సంతోషిస్తాను."
"ష్యూర్" వీణ లోపలకి వెళ్ళి వెంటనే వచ్చేసింది. దివాన్ మెడ కొద్దిగా వెనక్కివాలి, కుషన్ నానుకుని కూర్చుని "చెప్పండి! ఏదో మాట్లాడాలి అన్నారు."
భరణి గొంతు సవరించుకుని "వీణ గారూ!" అన్నాడు.
"హమయ్య! చెప్పండి వింటున్నాను."
"ఏం లేదు! ఈ విషయం ఆవిడా తో డైరెక్టర్ గా మాట్లాడలేక, మీతో మాట్లాడుతున్నాను."
"ఎవరితో?"
"అదే డాక్టర్ గారితో."
"ఏ డాక్టరు గారండీ?"
"అనూషాగారితో."
"ఓ అనూషా! ఏం మాట్లాడాలి ఆవిడా తో?"
"నా పెళ్ళి విషయామా? ఏంటి, మా అనూష మాకు తెలీయకుండా మ్యారేజ్ బ్యూరో పెట్టిందా?"
"అదికాదు నేను ఆవిడని.... ఆవిడని ప్రేమిస్తున్నాను. ఆవిడా అంగీకరిస్తే వివాహం చేసుకోవాలని వుంది ."
అప్పటి వరకూ చిలిపిగా మాట్లాడిన వీణ అతడి వైపు అభినందపూర్వకంగా చూసింది.
"ఎందుకు కోరుకుంటున్నారు? ఐమీన్ తనలో మీకు నచ్చిన లక్షణాలు ఏమిటి?"
భరణి ఆశ్చర్యంగా చూశాడు. "అదేంటండి? ఆవిడలో అన్నీ నచ్చిన లక్షణాలు ఏంటి? అంటేనన్నా కొంచెం ఆలోచించవచ్చుగానీ, నచ్చిన విషయాలేంటి అంటే ఏం సమాధానం వుంటుంది? ఆవిడలో అన్నీ నచ్చిన గుణాలే."
"మీ వయసు?"
"ముప్పయ్ ఏడు."
"తను బహుశా మీకన్నా మూడేళ్ళు పెద్దది తెలుసా?"
"రాముడికన్నా సీత కూడా పెద్దదే అని విన్నాడు."
