Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 31

    "ష్... అరవొద్దని చెప్పానా? అరిస్తే పీక పిసుకుతా" అన్నాడు కోపంగా అంకిత్.

    నువ్వు పీక పిసికితే అరుస్తా..." తిక్కగా అన్నాడు రాహుల్.

    అంకిత్ వాకలి దగ్గర వున్న ఓ కంకరరాయి తీసుకుని పైకెత్తాడు కోపంగా.

    "భయ్యా.... పుసిక్కిన నిజ్జంగానే కొట్టేలా వున్నావు. యింతకీ విషయం ఏమిటో చెప్పు?" అన్నాడు సన్సన్స్  భరించలేనట్టు.

    "నా మృదువని వచ్చింది" చెప్పాడు అంకిత్.

    "అహం.... అలాన... ఎప్పుడు?"

    "ష్... నెమ్మది...ఇప్పుడే, గంటక్రితమే."

    "ఒహో.... యిప్పుడు ఏం చేస్తుందో?" దీర్ఘం తీస్తూ అడిగాడు రాహుల్.

    "నిద్ర... నిద్రపోతూంది."

    "అలాగా. సుష్టుగా తిన్నారా భయ్యా..."

    "హాయిగా తినేసింది. అన్నట్టు సారీరా ప్రెండ్స్. ఇప్పుడు మీ అన్నాలు కూడా తనే తినేసింది."

    "అలాగా... భయ్యా... ఎలా అయిపోయావు? నీ లవ్వర్ కనిపించలేదనియిలా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయన?" సానుభూతిగా చూస్తూ అన్నాడు రాహుల్.

    "అంటే, నేను చెప్పేది మీరు నమ్మడం లేదా?" అనుమానంగా అడిగాడు అంకిత్.

    "ఛ... ఎందుకు నమ్మడం లేడి. జయలలిత అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తుందిట. జర్జిషిట్ యం.ఎల.ఏ.సీటు కావాలని మన తెలుగు కల్పనారాయ్ తో నటించాలని కోరిగ్గావుందిట..." అన్నాడు పిచ్చిచూపులు చూస్తూ రాహుల్.

    అంకిత్ అర్దమైంది. వాళ్ళు తన మాటలు నమ్మడంలేదని... వెంటనే వాళ్ళిద్దర్నీ కిటికీ వరకూ లాకెళ్ళి  కిటికీ రెక్కలు తెరిచి చూపించాడు. లోపల ఆ ప్రమాదాన్ని పసికట్టి అతని నోరు నోక్కేసాడు.

    "భయ్యా.... ఇది నిజమేనా? నన్ను గిచ్చు భయ్యా... ఒరే చేతన్... నువ్వు నన్ను బుగ్గలు బూరెల్లా అయ్యేలా కొట్టు..." అన్నాడు.

    చేతన్ దాన్ని సీరియస్ గా తీసుకుని, బలంకొద్దీ రాహుల్ చెంప చెల్లుమనించి అతని బుగ్గలు బూరేలా అయ్యేలా చేసాడు.

    "చచ్చాన్రోయ్..." అని కేకేసి బుగ్గ తడుముకొని, "బుగ్గ బూరె అయితే అయ్యింది కానీ, నీ లైఫ్ తన్నకుమ్డానే బూరెల గంపలో పడ్డట్టయింది. ఏంటి గురూ... ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందా?" సిగ్గుపడుతూ అడిగాడు రాహుల్.

    "చంపేస్తా... అరిస్తే..." అంటూ ఓ పావుగంటపాటు ప్లే బ్యాక్ చెప్పుకోచ్చాడు.
   
                                                 ***

    ఆదిరా జరిగింది... పాపం మంచి ఆకలిమీద వుంది. తర్వాత మంచి నిద్రమీద వుంది... రేపొద్దున దుతైల్స్ కనుక్కుందాం... ఈ రాత్రికి మరోలా అనుకోకుండా, మీరు కూడా నాతోపాటే, ఈ అరుగుమీద..."

    "హూం... పరుచుకోవాడానికి బెడ్ షీట్లు లేకుండా, కప్పుకోవడానికి బ్లాంకెట్ లేకుండా పడుకోవాలి... అంతేకదా.... అంటే భయ్యా! లవ్వర్ బందరు లడ్డూ ప్రెండ్స్ పాచిపోయిన బిర్యానీ అన్నట్టు... ఏం చేస్తాం... మా బీబీమా తల్లి మావంతు అన్నం కూడా తినేసిందా? మా బ్లాంకెట్లు అన్నీ కప్పుకుందా?వెరీగుడ్ భయ్యా... గాడ్ ఈజ్ గ్రేట్..." అన్నాడు చలికి వణుకుతూ.


                                                  ***
    ఆ ముగ్గురూ రాత్రంతా వణుకుతూనే, ఏ తెల్లవారు ఝామునో నిద్రలోకి జారుకుని, ఏడు, ఏడున్నర ప్రాంతంలో కళ్ళు తెరిచారు. ముగ్గురికి మూడు  బ్లాంకెట్లు కప్పి వున్నాయి. తల కింద దిండ్లు వున్నాయి.

    ఈ దిండ్లు ఎవరు పెట్టినట్టు? ఈ బ్లాంకెట్లు ఎవరు కప్పినట్టు... అనుకుంటూ లోపలకి వెళ్ళి చూశారు.

    అంకిత్ గుండె గుబెల్ మంది... లోపల...

   
                                                     ***
    లోపల...

    ఖాళి మంచం అంకిత్ వెక్కిరిస్తూ కనిపించింది. దిండు దగ్గర ఒక స్లిప్ వుంది. "నన్ను క్షమించండి" అని ఆ స్లిప్ మీద రాసివుంది.

    "ఇదేమిటి భయ్యా... ఇలా హ్యందిచ్చి వెళ్ళింది..." మెల్లగా అన్నాడు రాహుల్. వెంటనే అంకిత్ సీరియస్ గా చూడ్డంతో కామ్  అయిపోయేడు.

    అతనింకా జీర్ణించుకోలేకపోతున్నాడు. తెల్లవారేక డీటైల్స్ గా మాట్లాడోచ్చని అనుకున్నాడు. ఇలా చెప్పాపెట్టకుండా వెళ్తుందని అనుకోలేదు.

    అతని శరీరం, మనమూ రెండూ మొద్దుబారిపోయేయి.

                                                   ***

    "భయ్యా..."

    కళ్ళు తెరిచాడు అంకిత్. ఉదయం నుంచి అతను అలానే గదిలో కూర్చుండేపోయాడు. రాహుల్, చేతన్ లు అంకిత్ ని ఒంటరిగా వదలి వెళ్ళారు. కాసేపు ఒంటరిగా వుంటే అతని మనసు తేలిక అవుతుందనే ఉద్దేశంతో.

    "లైటు కూడా వేసుకోకుండా చీకటిలో వున్నవేమిటి భయ్యా... ఇప్పుడు సాయంత్రం ఆరు దాటింది." అంటూ లైటువేసి, కిచెన్ లోకి వెళ్ళి చూశారు. అన్నం అలానే వుంది.

    "ఉదయం నుంచీ అన్నం కూడా తినలేదు కదూ... ఆ అమ్మాయి ఎక్కడికే వెళ్ళాడు... నిన్ను వెతుక్కుంటూ వస్తుంది భయ్యా..." హానీ ఇచ్చాడు రాహుల్.

    "నాకు నమ్మకం లేదు రాహుల్.... ఈ ప్రపంచంలో మొదటిసారిగా నేను కావాలని అనుకున్నది ఆ అమ్మాయినే..." సిన్సియర్ గా చెప్పాడు అంకిత్.

    "ఆ అమ్మాయి ఎక్కడున్నా వెతికి, నీకు అప్పగించే పూచీ నాది. ముందులే... ప్రేషప్ అవ్వు..." అన్నాడు రాహుల్.

    "ఇప్పుడా... ఎందుకురా..."

    మొన్న వదిలేసినా ప్రోగ్రామ్ యిప్పుడు చేద్దాం... రైల్వేస్టేషన్ లో ప్రయాణీకులు ట్రెయిన్ ని ఎలా క్యాచ్ చేస్తారో, ఘాట్ చేద్దామని మొన్న అనుకుని మిస్సయ్యాం ఈసారి ఖచ్చితంగా మిస్సవ్వకుమ్డా ఘాట్ చేద్దాం. కాకపోతే, 'యాక్షన్...కట్...'లు ననకు అచ్చిరానట్టు వున్నాయి. ఈసారి 'యాక్షన్-కట్' నీ వంతు నేను పరుగెత్తి ట్రెయిన్ క్యాచ్ చేస్తా, నువ్వు 'యాక్షన్-కట్ చెప్పు."

    "వద్దురా... నాకు దేనిమీదా యింట్రస్ట్ లేదు. అంతగా అవసరమైతే, నువ్వూ, చేతన్ వెళ్ళండి" నిరాసక్తిగా అన్నాడు అంకిత్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS