"నేను నిద్రపోయాను..." అంది బామ్మ ఉడుక్కుంటూ.
"ఇఅడంతా కోపమే... నిద్రపోయిన బామ్మ ఎలా మాట్లాడుతుంది చెప్మా..." అంది బుగ్గలు నోక్కుకున్నట్టు నటిస్తూ మౌన.
"గోధుమ రవ్వ ఉప్మా ఏం కాదూ" ఉక్రోషంగా అంది బామ్మా.
"ఇదిగో... నువ్విలా అలిగితే ఇప్పుడే ప్లయిట్ ఎక్కి వెళ్లిపోతా... అంది.
"పిచ్చిబామ్మా... నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారే... నీ కోసమే మరో వారం రోజులు వుంటాను సరేనా..." అంది.
బామ్మ నవ్వింది. బామ్మను పడుకావుపెట్టి దుప్పటి సరిచేసి తన గదిలోకి వచ్చింది.
కుర్చీలో కూచుని వెనక్కి వాలి రిలాక్స్ వుతూ ఆలోచిస్తోంది.భస్మ కోసం ఎలా వెతకాలో అర్ధం కాలేదు. భస్మ హైదరాబాదు వచ్చాడని కన్ ఫార్మ్ గా తెలిసింది.
ఒకేసారి పరిచయమైనా వ్యక్తి, ఆ పరిచయం కూడా ఇద్దరి మద్యా కాదు. తను అతడ్ని చూడ్డమే!
ప్రేమ ఇంత బలంగా వుంటుందా?
లవ్ ఎట్ ఫస్ట్ సైట్... అని ఎవరైనా అంటే తను నవ్వుకునేది. మరి ఇప్పుడేంటి?
నిద్రరావటం లేదు. రెండ్రోజులుగా పత్రికలూ కూడా చూడలేదు. టేబుల్ మీద వున్న పత్రిక తిరగేస్తోంది.
రెఫ్ లు, కిడ్నాప్ లు, దొంగతానాలు, రాజికీయ నాయుకుల తిట్ల పూరాణాలు.. నవ్వొచ్చింది మౌనకు.
ఈ పత్రికల్లో ఇలాంటి వార్తలు లేని రోజేప్పుడోస్తుందో? అనుకుంటూ పేపరు మడతపెట్టబోతూ ఆగింది.
ఆమె దృష్టి 'భస్మ ఎన్ కౌంటర్' అన్నా హెడ్డింగ్ మీద పడింది. క్షణంలో కలవరం పెద్ద ప్రకంపనమైంది. ఆమె పెదవులు వణుకుతున్నాయి.
టైం చూసుకుంది. పన్నెండవుతుంది.అదీ అర్దరాత్రి.
వెంటనే లేచి కారు కీస్ తీసుకుంది. బామ్మ ఎక్కడిని అడిగేలోగానే...
"బామ్మ... నువ్వేం కంగారుపడకు... వెంటనే వచ్చేస్తాను" అని చెప్పి... కారు హాదవిడిగా హొటల్ లావెన్ వైపు పోనిచ్చింది.
***
హొటల్ లావెన్
రూమ్ నెంబర్ వన్ త్రీ వన్
ఓ కుర్చీకి హ్యాండ్ కప్స్ తగిలించి భస్మను కూచోబెట్టాడు కౌశిక్. తన ప్లాట్ నుంచి సరాసరి ఇక్కడికే తీసుకువచ్చాడు. ఫోలీసు స్టేషన్ కు తీసుకెళ్తే అది నలుగురీ తెలుస్తుంది. అందుకే సీక్రెట్ గా ఇక్కడికి తెచాడు.
భస్మ దగ్గరకి వచ్చాడు.
"మిస్టర్ భస్మా... నీ మీద నాకు కోపం లేదు. చెప్పు... ఆ ఖాన్ ఎక్కడున్నాడు? నీ ప్లాన్ ఏమిటి? నిన్ను అతనెలా ట్రాప్ చేశాడు?"
భస్మ అతనడిగే ఏ ప్రశ్నకూ బదులివ్వలేదు.
"భస్మా... నా సహనాన్ని పరిక్షించవద్దు. కమాన్ టెల్ మీ... స్పీకవుట్..." అరిచాడు.
"భస్మ మాట్లాడలేదు.
"యూ..." పిడిగిలి బిగించి, భస్మ మూతిమీద గుద్దాడు. పెదవి చిట్లిరక్తం కారింది. చిన్న కేక కూడా భస్మ నోట్లో నుంచి రాలేదు.
సరిగ్గా అదే సమయంలో...
అగర్వాల్, కరంజియాలు వున్న ఓ వ్యాన్ హొటల్ లావెన్ వెనకవైపు ఆగింది. టీవీ స్క్రీన్ మీద చిన్న చిన్న గీతాలు... ఆ మానిటరు చూస్తూ కొన్ని మీటలు నొక్కాడు.
"హాలో.. హలో.. భస్మ.. నువ్విప్పుడు నా రేంజ్ లో వున్నావు. నా మాటలు వింటున్నావు... యూ ఆర్ హియరింగ్ మై వర్డ్స్... నువ్వు అక్కడ గొడవ చేయవద్దు. కాం గా బయటకు రా... డు యూ అండర్ స్టాండ్... నా మాటలు వినిపిస్తున్నాయా... రిపీదేట్ సేం వర్డ్స్ త్రీ... టు.. వన్..!
***
భస్మ ఒక్కసారిగా షేక్ అయ్యాడు. అతని మెదడును ఎవరో ఆజ్ఞాపిస్తోన్న ఫీలింగ్. అతని మెదడులోవుమ్చిన చిప్స్... వర్క్ చేయడం మెదలేట్టాయి.
రిపీటెడ్ సేం వర్డ్స్.. త్రీ.. టు.. వన్.
రిపీడేడ్ సేం వర్డ్.. త్రీ.. టు.. వన్
త్రీ.. టు.. వన్..
***
బలవంతా ఉపయోగించాడు భస్మ. కుర్చీకి కట్టిపారేసిన హ్యండ్ కప్స్ సైతం భయపడసాగాయి ఆ బలానికి
***
హొటల్ లావెన్ ముందు కారాగింది.
కారులోంచి హడావిడిగా దిగింది మౌన. రిసెప్షన్ కోఎతర్ వైపు నడిచింది.
"నేను అర్జెంటుగా మిష్టర్ కౌశిక్ ను కలవాలి?"
"మేడమ్... అయన..."
రిసేషనిష్టు సమాధానం కోసం ఆగకుండా, ఫస్ట్ ప్లోర్ వైపు పరుగుపెట్టింది.రూమ్ నెంబర్స్ చూస్తూ కదులుతోంది.
రూమ్ నెంబర్స్ చూస్తూ కదులుతోంది.
రూమ్ నెంబర్ వన్... త్రీ... వన్... ఆగింది. డోర్ బెల్ ప్రెస్ చేయాలన్న ఆలోచన కూడా మరచిపోయిబలంగా నెట్టింది.
డోర్ లాక్ చేసి లేదు.
వెంటనే తెరుచుకుంది. అదే సమయంలో భస్మ కౌశిక్ ని పైకెత్తి నేలమీద విసిరాడు.
చిన్న శబ్దం... అమ్మా అన్నా కౌశిక్ అరుపు. అది చూసి కెవ్వున కేక వేసింది మౌన.
ఆమెకు అనందం, భయమూ రెండూ ఏక కాలంలో కాలిగాయి. ఓ వైపు తన లవ్.. తన ప్రాణం భస్మ చనిపావులేదన్న నిజం... మరోవైపు అతను కౌశిక్ ని చంపడానికి ప్రయత్నించటం.
కౌశిక్ రివాల్వర్ తీయబోయాడు.
