Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 32

   
    "దాసిదాన్ని గమనించావా?" అన్నట్లు కనుసైగ చేశాడు యశ్వంత్ భట్టాచార్య.    
    కీర్తి తలా తాటించింది.    
    "నీవు రెండు రోజులు మాయింట్లో వుండి గాని వెళ్ళటానికి వీలులేదు. రాణి విషయంలో నాకేం భయంలేదు. ఈ రెండు నెలలు చక్కగ చూసుకుంటాను. వీలయితే సంబంధాల విషయం కూడా చూస్తాను. సరీనా బాబాయ్" అంది సతీదేవి.    
    "సరేతల్లీ నీమాటెందుకు కాదనాలి" యశ్వంత్ భట్టాచార్య అన్నాడు.    
    ఆ తర్వాత ముగ్గురూ లేచారు.    
    యశ్వంత్ భట్టాచార్య, కీర్తి వుండటానికి ఓగదిచూపించింది దాసీది.    
    దాసీది వెళ్ళింతరువాత "ఇక్కడబాగుంది తాతయ్య" అంది కీర్తి.    
    "బాగుండటంకాదు. నీవు బుద్దిగ వుండాలి సరేనా"    
    అలాగేవుంటాను. మరి మధ్య ఊళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మర్చిపోకుండా రకరకాల బొమ్మలు తేవాలి. చిన్న పిల్లలాగా బొమ్మలేంటి అంటే మాత్రం వూరుకోను తాతయ్యా!"    
    "తప్పకుండా తెస్తాను. వట్టు సరేనా!"    
    "సరే" అంది కీర్తి.    
    వీళ్ళిద్దరినీ చాటుగ గమనిస్తున్న దాసీది తృప్తిగ తల పంకించి వెళ్ళిపోయింది.    
    అది గమనించిన యశ్వంత్ భట్టాచార్య కీర్తి నవ్వుకున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ క్షేమంగ కోటలో పాగావేశారు. ముందున్నది ముసళ్ళ పండుగమరి.
    
                                       22

    "నా కిష్టం లేదు అంతే."మాధవ్ గురుదేవ్ అన్నాడు.    
    "మీ కిష్టంలేదు సరే. నన్నేంచేయమంటారో చెప్పండి." సతీదేవి కోపంగ అడిగింది.    
    సాధారణంగ సతీదేవి పడక గదిలోకి ఎవరూ వెళ్ళరు. భార్యాభర్త రహస్యంగ మాట్లాడుకోటంయిలా వాదులాడు కోటం ఆగదిలో చేస్తుంటారు.    
    ఇప్పుడు కొత్తగ వచ్చిన తాత మనుమరాలిని పొమ్మని చెప్పు. వాళ్ళు ఈ యింట్లో వుండటం నాకిష్టం లేదు అని మాధవ్ గురుదేవ్, వాళ్ళు వుండటం వల్ల మనకొచ్చిన నష్టం ఏమిటి? అని సతీదేవి వాదులాడుకుంటున్నారు.    
    ఉండమంటే వుంటారు వెళ్ళి పొమ్మంటే పోతారు. మాధవ్"గురుదేవ్ తేలికగ అన్నాడు.    
    "నిజమే." అంది సతీదేవి.    
    "మరింకేం మా యింట్లో కుదరదంటే సరిపోలా!"    
    "సరిపోదు"    
    "అదే ఎందుకు సరిపోదు అంటున్నాను. "గద్దిస్తున్నట్లు అడిగాడు మాధవ్గురుదేవ్.    
    "మీకు తెలియదా!" శాంతంగ అందిసతీదేవి.    
    "తెలియదు. నీకు తెలిసింది చెప్పు."    
    "మన పెళ్ళిరోజున బాబాయి మీతో మాట్లాదినవ్వింధి నందుకు ఆయన చాలా నచ్చారు అంటూ పదే పదే నాతో చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడో రెండు మూడు సార్లుమనింటికి వచ్చాడు. బాబాయి వెంటనే వెళ్ళిపోతుంటే మా యింట్లో  పది రోజులు వుండకుండా వెళితే నాకు బాగుండదు అని బలవంతం చేసింది మీరు కాదా గతం అంతా మర్చిపోయి నన్ను వేధిస్తే నేనేం చేయను. ఎవరికని చెప్పను. ఎలా మసులుకోను ఏ నిర్ణయమని తీసుకోను!" డగ్గుత్తికతో అంటూ కళ్ళతుడుకుంది సతీదేవి.    
    మాధవగురుదేవ్ మంచానికి జారగిలబడి కళ్ళు మూసుకుని క్షణకాలం ఆలోచించాడు. "నాకీ మధ్య వకరిద్దరు మనుషులు ఎక్కువగ కనిపిస్తే చాలు అర్ధం లేని చిరాకు వస్తున్నది." కొద్దిసేపు ఆగిఅన్నాడు.    
    సతీదేవి మాట్లాడలేదు.    
    "మీ బాబాయి ఎల్లుండి వెళతాడా!"    
    "ఉండు అని బలవంతం చేసినా వుండేరకం గాదు మా బాబాయి. ఈ రోజు మనతో అవసరం పడబట్టి మనమాట తీసేయలేక ఎల్లుండి దాకా వుంటున్నాడు."    
    "ఆమహారాణి వుంటుందికదా!" వ్యంగ్యంగ అన్నాడు మాధవ్ గురుదేవ్.    
    "రాణిని చూశారు కదా! వయసుతోపాటు మనసు ఎదగని పిల్ల. రాణి వుండటం వల్ల మన కొచ్చే యిబ్బంది ఏముంది! బస్తాల కొద్దీ ధాస్యం దానం చేసే ఈ యింట్లో గుప్పెడు బియ్యం ఓ మనిషికి కర్చయితే ఆస్తీ తరగదు."    
    "అదీ నిజమేలే." అన్నాడు మాధవ్ గురుదేవ్.    
    సతీదేవి నిట్టూర్పు విడచింది భారంగ.    
    "మంచి తెలివితేటలు చక్కని అలంకరణ వుంటే రాణి బాగుంటుంది."    
    సతీదేవి కోపంగ చూసింది.    
    అదేం పట్టించుకోనట్లు"పిటపిట లాడే వయసు వక్కటే ఆపిల్లలో వుంది వెర్రిచూపులు "తెలివితక్కువమాటలు" మధ్య మధ్యలో నోట్లో వేలు, గజ్జెలు గుర్రంలా ఎదిగిందిగాని దానికి తగ్గ కోరికలు వున్నట్లు లేదు." అన్నాడు ఖుషీగ.    
    సతీదేవి చురచుర చూడటం మినహా ఏమీ అనలేక పోయింది. "భగవాన్" అని గొణిగింది.    
    మాధవ్ గురుదేవ్ మంచం మీదనుంచి లేచి వెళ్ళి తలుపు గడియ పెట్టి వచ్చాడు. వస్తూనే సతీదేవి భుజం చుట్టూచేతులు వేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS