Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 32

డార్క్ రూమ్ డోర్ కు వున్న చిన్న తలుపు తెరచి, ఆ కాస్త ఖాళీలోంచి చూసిన సుధాకర్ నెత్తిన పిడుగు పడినట్టు అదిరి పడ్డాడు.
అతని ఖంగారు చూసి ధీరజ కూడా బయటకు తీసింది.
కండలు దండిగా పెంచిన వీధి రౌడీలు స్టూడియో లోపలకు వచ్చి వెదుకుతున్నారు.
డోన్ట్ వర్రీ సుధాకర్... నువ్వు లోపలేవుండు.... ఏం జరిగినా, ఎట్టి పరిస్థితులలోనూ బయటకు రావద్దు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను" అంటూనే డార్క్ రూమ్ డోర్ తెరుచుకుని ధీరజ బయటకు వెళ్ళిపోయింది.
ఎదురుగా నలుగురు గూండాలు__ వాళ్ళ నాయుకుడు కబీర్ దాదా.
అందరి చేతులలోనూ మారణాయుధాలు ఉన్నాయి.
అయినా ధీరజ జంకలేదు. ఉన్నట్టుండి ఎగిరి వాళ్ళమీదకు లఘించింది. ఆమెకు కరాటేలో ప్రావీణ్యం ఉన్న విషయం పాపం వాళ్ళకు ఏం తెలుసు....!
కేకలు... అరుపులు ప్రతిధ్వనించాయి అక్కడ.
ఆమె పాదాలు ఉక్కు స్తంభాల్లా ఇద్దరి ముఖాలను తాకాయి.... ఆ ఇద్దరూ రబ్బరు బొమ్మాల్లా చేరోకవైపుకు పడిపోయారు. నేలమీద పాదాలు అనిన మరుక్షణం అరచేతులను కత్తుల్లా బిగించి బలంగా ఒకడి గంటుపై కొట్టి మరొకడి మెడ పక్కన షాట్ ఇచ్చింది.
భళుక్కుమంటూ  బారెడు రక్తం కక్కుకున్నాడు మొదటివాడు.
రెండోవాడు మెడ తెగిన కోడిలా కిందపడి గిలగిలలాడి పోసాగాడు....
ముగిలిన ఇద్దరూ ఒక్కసారిగా ఆమెను కమ్ముకున్నారు. ధీరజ ఏ ఒక్కరికీ ఆయుధాలను ప్రయోగించే అవకాశం ఇవ్వలేదు. ఆ ఇద్దరినీ ఎగిరెగిరి తన్నుతుందామె.
ఒక అడపిల్ల రాక్షసులవంటి రౌడీలతో పోరాడుతుంది పర్యవసానం ఎలావుంటుందోనని జనం దూరంనుంచే చూస్తున్నారు.
ఆ పోరాటంలో మునుగి వున్న ధీరజ__ మెల్లగా డార్క్ రూం వైపు కదులుతున్న కబీర్ దాదాను గమనించలేదు. ఎదురుగా వున్న ఆ ఇద్దరినీ మట్టి కరిపించడంలో నిమగ్నమై వుందామె.
యమ కింకరునిలా లోనికి వచ్చిన కబీర్ దాదాని చూసి వణికి పోయాడు సుధాకర్.
"ఫోటోలు ఎక్కడ వున్నాయి"
"ఫోటోలా....ఏ ఫోటోలు"
కబీర్ దాదా చేతిలో ఛక్ మంటూ బటన్ నైఫ్...
"నాకేం తెలియదు__ నన్ను వదిలేయ్"
"వదిలేస్తా__ ఆ ఫోటోలు ఇస్తే"
సరిగ్గా ఆ క్షణంలోనే పోలీస్ సైరన్ వినిపించింది. ఎవరో పోలీసులకు ఫోన్ చేసినట్టున్నారు. అందుకే వెంటనే వచ్చి పడ్డారు అనుకుంటూ కోపంగా చేతిలోని కత్తితో సుధాకర్ పొట్టలో వెంట వెంటనే నాలుగు పోట్లు పొడిచాడు.
వెంటనే కబీర్ దాదా బయటకు వెళ్ళిపోయాడు.
డార్క్ రూమ్ లో జరిగిందేమిటో ధీరజ కు తెలిసే అవజాశం లేకపోయింది.
అప్పటికే చావు కన్నులు లొట్టపోయినట్టు ఉన్నఅతని అనుచరులు పరుగు లంకించుకున్నారు. కబీర్ దాదా వచ్చిన వెంటనే వాళ్ళు ఎక్కివచ్చిన మారుతీవ్యాన్ వెళ్ళిపోయింది.
పోలీస్ జీప్ ఉరుకుల పరుగులమీద వచ్చింది.
కత్తిపోట్లతో విపరీతమయిన రక్తం పోతుండగా, ఎలాగో పళ్ళ బిగువున  డార్క్ రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు సుధాకర్.
అప్పుడే తలతిప్పి చూసిన ధీరజ అదిరిపడింది. కింద పడిపోబోతున్న సుధాకర్ వడిసి పట్టుకుంది.
జీప్ దిగివచ్చిన సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి వెంటనే ఫోన్ చేసి అంబులెన్స్ ను తెప్పించి సుధాకర్ ను ఎక్కించాడు.
ఆ సమయంలో సయితం ధీరజ పెదవి పొర పడలేదు. ఫోటోల విషయం మరుగుపరిచి అకారణంగా గూండాలు స్టూడియోపై దాడి చేసినట్టు పోలీసులతో చెప్పింది.
స్టూడియోలోనికి వెళ్ళిన సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి కంటికి ఎంతో కష్ట పడకుండానే కావలసిన ఫోటోలు కనిపించాయి.
 కబీర్ దాదా రావడంతో ఆ ఫోటోలను సుధాకర్ ఒక అట్ట పెట్టె కిందకు నెట్టాడు. ఆవేశమే తప్ప ఆలోచనలేని కిరాయిగుండా కావడం వలన ఫోటోలకోసం వెదకాలనే ఆలోచనలే రాలేదు.
పోలీస్ కాప్ తీసి పోఫోలను కాప్ కింద పెట్టుకుని ఏమి ఎరగనివాడిలా సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి అంబులెన్స్ దగ్గరకు నడిచాడు.
ధీరజ కూడా అంబులెన్స్ లో ఎక్కి కూర్చింది. తన వలనే అతను ప్రాణాపాయ స్థితిలో పడినందుకు ఆమె హృదయం భారమైంది.
స్టూడియో లాక్ చేసి జీప్ ఎక్కాడు సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి.
ముందు అంబులెన్స్... వెనుక  పోలీస్ జీప్  రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టు వేగంగా ముందుకు కదిలాయి.
   
                       *    *    *    *
తన మనుషుల ద్వారా జయచంద్ర ఎప్పటికప్పుడు బయట పరిస్థితులను తెలుసుకుంటూనే వున్నాడు.
క్రిమినల్ లాయర్ సత్యమోహన్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే వున్నాడు.
ముఖ్యమంత్రికి తమ మీద అనుమానం రాకుండా జగ్రత్తలు తీసుకున్నారు.
అతినా, ఏదో తెలియని భయం జయచంద్రలో నెలకొని వుంది.
అందుకే మన స్థిమితం కోసం స్కాచ్ తాగుతున్నాడు అతను.
అతనికి  తోడుగా అతని పుత్రారత్నం అభినయ్ కూడా మందు కొట్టడంలో మునిగి వున్నాడు.
అభినయ్ ధైర్యం చెబుతుంటే అతని మనసు సేదతీరుతుంది.
ఎందుకయినా మంచిది అని తమ మద్దతుదారులు అయిన ఎమ్. ఎల్. ఏల    క్వార్టర్స్ వద్ద తమ మనుషులను రహస్యంగా కాపలా వుండమని మేనమామ సత్యమోహన్ ఫోన్ చేసి చెప్పాడు అభినయ్.లాయర్ సత్యమోహన్  ఆ ఏర్పాట్లల్లో మునిగిపోయాడు.
                                                       *    *    *    *
నగరంలో జరిగే అల్లర్లకు సూత్రధారి ఎవరో... ఎందుకో చేస్తున్నారో_ ఏమాశించి విధ్వంసకాండ  మొదలయిందో_ ఏ మాత్రం తెలియక ముఖ్యమంత్రి మధనపడి పోతున్నాడు.
పరిస్థితి అలానే వుంటే హైకమాండ్ చివాట్లు పెడుతుంది.
అదే జరిగితే తన పదవి వూడిపోవడం ఖాయం.
అలా కాకుండా వుండాలంటే అసమ్మతివాదులను మచ్చిక చేసుకోవాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS