Home » Chandu harshavardhan » లేడీ కమెండో

దానికి సరయిన సూత్రధారి కావాలి. ఇరుపక్షాలకూ ఆమోద యోగ్యమయిన ఎమ్.ఎల్.ఏ మాత్రమే సంధి రాయభారాన్ని నడపగలడు.
అలాంటి సమర్ధుడు ఎవరు వున్నారా అని తరచిచూస్తే జయచంద్రపై ముఖ్యమంత్రి దృష్టి నిలిచిపోయింది.
వెంటనే అసమ్మతి వాదులను బుజ్జగించే కార్యక్రమం జయచంద్ర భుజస్కంధాలపై పడింది.
లాయర్ సత్యమోహన్ తో జరిగింది చెప్పి విరగపడి నవ్వాడు జయచంద్ర.
అల్లర్లకు ఆజ్యం పోస్తున్న వ్యక్తికే... ఆ అల్లర్లు నిలిపివేసే బాధ్యతను అప్పగిస్తే నవ్వుకోక ఏం చేస్తారు.
తాము ఊహించని డెవలప్ మెంట్ ఎదురుకావడంతో ఫార్మాలిటీగా అసమ్మతివాదులుగా ముద్రపడిన ఎమ్ .ఎల్ .ఏ.లతో విడివిడిగా జయచంద్ర చర్చలు ప్రారంభించాడు.
జయచంద్ర తనను ఎలాగయినా గండం నుంచి గట్టెక్కిస్తాడేమోనని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాడు ముఖ్యమంత్రి.
చర్చల పేరుతో జయచంద్ర మంతనాలు సాగిస్తున్నాడే తప్ప సమస్యను ఒకతోవకు తీసుకురావడంలేదు.
అసమ్మతివాదుల ఆగడాలు మరింత ఎక్కువ అయినాయి.
ఉద్యమంలో గూండాయిజం చోటు చేసుకుంది.
జరుగుతున్నపరిణామాలను చూస్తున్న ముఖ్యమంత్రి గుండెదడ హెచ్చింది.
 
                                                   *    *    *    *
అంబులెన్స్ వేగంగా దూసుకు వెళుతుంది.
సుధాకర్ తలదగ్గర కూర్చుని ఉంది ధీరజ. మరో ఇద్దరు హాస్పిటల్ స్టాఫ్ వున్నారు.
అతను బాధగా మూలిగాడు.
ధీరజ కనులలో కన్నీరు ఉబికింది.
"నా మూలంగానే ఇలా జరిగింది...." బాధగా అందామె.
"నో... కార్యదీక్షా పరులకు ఎప్పుడూ కన్నీళ్ళు రాకూడదు.... నాకు ఇప్పుడు ఏమయిందని __ ప్రాణాలు పోలేదుగా  _నీ కర్తవ్యాన్ని విస్మరించకు_ వెళ్ళి ఫోటోలను హాండోవర్ చేసుకో" అతి కష్టంమీద సుధాకర్ మాటలను కూడా బలుక్కుంటూ మెల్లగా అన్నాడు.
అప్పుడు అసలు విషయం గుర్తుకు వచ్చిందామెకు.
సుధాకర్ మృత్యువాత పడగానే షాక్ తగిలినట్టయింది. అందుకే ఫోటోల విషయం మరచిపోయి అంబులెన్స్ ఎక్కింది.
హాస్పిటల్ లో చేర్చిన వెంటనే వెళ్ళి ఫోటోలను తీసుకోవాలనుకుంటూ కర్టెన్ పక్కకు తొలగించి చూసిన మరుక్షణం ధీరజ ఆశ్చర్యపోయింది.
అంబులెన్స్ అప్పుడే ఆగింది.
"కానీ... అది హాస్పిటల్ కాదు...
ఒక పురాతనమయిన భవంతి!
ధీరజను బలవంతముగా ఆ భవంతిలోకి ఈడ్చుకు వెళ్ళారు. తను శత్రువుల చేతిలో చిక్కినట్టు అర్దమయిందామెకు.
కానీ తను ఏమీ చేయలేని పరిస్థితి... వెంటనే వైద్యం చేయించక పోతే సుధాకర్ బతకడు !
ఫెల్ట్ హాట్ వ్యక్తి ఒకతను కనిపించాడు. ముఖం గుర్తు పట్టడానికి వీల్లేకుండా వెనుదిరిగి నిలుచుని వున్నాడు అతను. ఆ పర్సనాలీటిని చూడాగానే ఎక్కడో చూసినట్టు అనిపించిందామెకు!
ధీరజకు క్షణాలమీద స్పురణకు వచ్చింది.
జయచంద్రకు కుడిభుజంగా వున్న రాజకీయ నాయుకుని చంపి పారిపోతుండగా తను ఫోటో తీసింది. అతనే ఇప్పుడు తన ముందున్న వ్యక్తి అని వెనుకనుంచే గుర్తు పట్టింది.
"వెల్ కమ్ ధీరజా.... నీ ధైర్యసాహసాలకు నా జోహార్లు" గరగరమంటూ పలికింది అతని గంతు.
ఆ కంఠస్వరం మాత్రం ఎక్కడా విన్నట్టు లేదు.
మనిషిని చూస్తుంటే జయచంద్ర కాదు... సత్యమోహన్ కాదు... అభినయ్ కూడా కాదు... మరి ఎవరు? కొత్త వ్యక్తి... కొత్త గొంతు... ఎవరై వుంటాడో అతను!?
"నేను ఎవరో తరువాత తీరికిగా ఆలోచించుకోవచ్చు_ నువ్వు తీసిన ఫోటోలు ఎక్కడ?"
అతని కంఠంలో కరుకుతనం స్పష్టంగా ధ్వనించింది.
"నీకు కావలసింది నేను... మనం తరువాత మాట్లాడుకుందాం_ నా స్నేహితుడు చావు బతుకుల్లో వున్నాడు. ముందు అతనికి ట్రీట్ మెంట్ జరగాలి. అతన్ని హాస్పిటల్ కు తీసుకు వెళ్ళండి" ధీరజ వేడికోలుగా అన్నది.
"అల్ రైట్ అలాగే చేస్తాం... ముందు ఫోటోలు... ఆ తరువాతే హాస్పిటల్"
"యూ బ్లడీ ఈడియట్.... అవతల మనిషి చచ్చిపోతున్నా నీలో చలనం లేదు. నువ్వు మనిషివా రాక్షసుడివా... అవునులే జయచంద్ర ఆశ చూపించిన డబ్బు కోసం నిలువునా ఒక మనిషి ప్రాణాలను తీసినప్పుడే నువ్వు ఎంత కిరాతకుడివో అర్దమయింది. నీకు దయాదాక్షిణ్యాలుంటాయనుకోవడం నా భ్రమ మాత్రమే"
"ఓహో.... గుర్తుపట్టావన్నమాట. అసాధ్యురాలివే కానీ నేనెవరో తెల్సుకోవడం నీ తరం కాదు..."
"ఇంత తెలుసుకున్న దానివి_ అది తెలుసుకోలేనా?"
ఇంకేదో మాట్లాడబోయేంతలో ఫోన్ మోగింది.
అతను రిసీవర్ తీశాడు.
రెండు నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేశాడు.
"ఆల్ రైట్ ధీరజా.... మాకు కావలసిన ఫోటోలు దొరికాయి. అందుకే ప్రస్తుతానికి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాం. ఇక నుంచయినా బుద్ధిగా మసలుకో... లేదంటే ఇప్పుడు నీ మిత్రునికి పట్టిన గతే ఈసారి నీకు పడుతుంది. మేము ఎవరమో ఆలోచించి బుర్ర పగులగొట్టుకునే కంటే ముందు నీ స్నేహితునికి వైద్యం చేయించే విషయం గురించి ఆలోచించుకో. గుడ్ బై... అన్నాడతను.
బ్రతుకు జీవుడ అనుకుంటూ ధీరజ వేగంగా బయటకు పరుగు దీసింది.
అంబులెన్స్ లో సుధాకర్ తప్ప ఎవరూ లేరు.
తనే డ్రయివ్  చేస్తూ అంబులెన్స్ ను హాస్పిటల్ కు తీసుకువెళ్ళింది.
అతనని ఆపరేషన్ ధియేటర్ ను తీసుకెళ్ళేవరకూ ఆమె మనసు కుదుటపడలేదు.
ఆమె కారిడార్ లో పచార్లు చేస్తుంది.
జరిగిన  ఘోరానికి కారకులయిన వాళ్ళను ఎట్టి  పరిస్థితిలోనూ వదలకూడదని అప్పుడే స్థిరమైన నిర్ణయం తీసుకున్నది.
ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి.
   
                                           *    *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra