Previous Page Next Page 
మహావృక్షం పేజి 30

"ఆ రిపోర్టులన్నీ వున్నాయా?"
అతను చేతిలో వున్నప్లాస్టిక్ కవర్ లోంచి ఎక్సేరే, కొన్ని కాగితాలు తీసిచ్చాడు. అన్నీ పరిక్షగా చూసింది.
అనూషకి తన చిన్ననాటి సంగతి గుర్తొచ్చింది. సరిగ్గా ఇలాంటి కేసే తనని ఈ నాడు కర్దియాలిజస్టుని చేసింది. మళ్ళీ ఇన్నేళ్ళ కు  అదే కండిషన్ లో  తన దగ్గరకు వచ్చారీ తల్లితండ్రుల దీనావస్థ, వాళ్ళు డబ్బుల కోసం పడిన యాతనా గుర్తొచ్చాయి.
"మీరు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్ళండి. అక్కడికి నేను పోన్ చేస్తాను. మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటారు. నేను ఓ గంటలో  వస్తాను. సరేనా" అంది ఫోన్  దగ్గరకి నడుస్తూ.
"మమ్మలను లోపలికే రానిస్తాడు" అంటూ నంబరు డయల్ చేసింది. అవతల డ్యూటీ డాక్టర్ ఫోన్ తీశాడు. అతడితో వాళ్ళ గురించి చెప్పింది.
"మీరు వెళ్ళండి.ఈ లోపల నేను రెడీ అయి వచ్చేస్తాను" వాళ్ళు దణ్ణాలు పెడుతూ వెళ్ళిపోయారు.
ఆ తరువాత చెప్పిన ప్రకారం గంట తరువాత హాస్పిటల్ వైపు అనూష కారు దూసుకుపోయింది.

                                                        *    *    *    *
ఆమె వెళ్ళేటప్పటికి జనరల్ వార్డులో ఓ పక్కకి నేల మీద టవల్ పరిచి పాపని పడుకోబేట్టి ఆ  భార్యభర్తలిద్దరూ దీన వదనాలతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. బెడ్ లు ఖాళీలేవు. అనూష డ్యూటీ డాక్టరుతో మాట్లాడింది. అ రోజు డిస్చార్జి అవవలసిన పేషెంట్లవరన్న వున్నారేమో చార్జ్ చూసింది.
అదృష్టవశాత్తూ ఇద్దరు పేషంట్లు డిశ్చార్జి అవవలసి వుంది. వాళ్ళనక్కడే కూర్చోమని చెప్పి, రోవ్డ్స్ కి వెళ్ళింది. గంట తరువాత డాక్టరు హరిశ్చంద్ర వచ్చాడు. ఆయనతో మాట్లాడి ఆ పాప రిపోర్టులన్నీ తెప్పించింది.
పాప బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. హరిశ్చంద్ర ఆ రిపోర్టులు చూసి భుజాలేగరేశాడు. "చాలా క్రిటికల్ కదమ్మా! ఎప్పుడో చేయాల్సింది ఆపరేషను. ఇప్పుడు చేస్తే మాత్రం సక్సెస్ అవుతుందా? హొల్ చూశావా ఎంత పెద్దగా వుందో?"
ఎక్సరే చూపిస్తూ అన్నాడు. "పైగా ఈ గ్రూపు బ్లడ్ మన దగ్గర దొరుకుతుందా? చాలా కష్టం కదా" అన్నాడు.
"ఈ కేసు ఏ నిమ్స్ కో పంపిస్తే వాళ్ళు ఏదన్నా సలహా ఇస్తారు"
"వాళ్ళని చూశారుగా, అంత ఆర్దికపరిస్థితి వాళ్ళకుందంటారా?"
"ఏం వుందమ్మా.సి.ఏం. ఫండ్ నించి సాయం చేయమని అడగమందాం. స్వచ్చంద సంస్థలవాళ్ళు చేస్తారుగా" అన్నాడు డాక్టరు హరిశ్చంద్ర.
"అదేమ వద్దు డాక్టర్! మనమే ఆపరేషన్ చేద్దాం."
"రిస్క్ అవుతుందేమో అనూషా. ఏదయినా సాధిస్తే పొగిడే పత్రికలే, రేపు ఈ ఆపరేషన్ ఫెయిల్ అయితే, ఉస్తానియా డాక్టర్ల నిర్లక్షంతో ఓ పసిపాప ప్రాణం బలి అని పెద్ద హెడ్డింగ్ తో మనవీ, మన హాస్పిటల్ నీ బజారుపాలు చేస్తాయి."
అనూష నవ్వింది. "అలాంటివి మనకి మామూలేగా. అయినా నెగిటివ్ గా ఎందుకు ఆలోచించటం? పాప తప్పకుండా బతుకుతుంది. ముందు బ్లడ్ బాంకులన్నీటికి ఈ గ్రుఉపు బ్లడ్ కావాలని ఇన్ ఫాం చేద్దాం. ఈ లోపల ట్రీట్ మెంట్ సాగుతూ వుంటుంది. ఇవాళ మంగళవారం కదా! నేక్త్సవీక్ ఆపరేషన్ పెట్టుకుంద్దాం"
అయన అనూషవైపు చిరునవ్వుతో చూశాడు. ఆమె తన శిష్యురాలిగా వున్న దగ్గరనించీ ఆమె అంటే ఆయనకి ప్రత్యేకమైనా అభిమానం. ఆమె పట్టుదల, పరోపకారపరాయణత్వం, మంచితనం ఆయనకి నచ్చుతాయి. కానీ అయన ప్రాక్టికల్ మనిషి కాబట్టి, అనూష చేసే దానాధర్మాలను అంతగా అమోదించడు.
అప్యాయంగా అన్నాడు. "ఎంతకాలం ఇలా ఇతరులకోసం బతుకుతావు అనూషా! వై డోంట్ యూ గో ఫర్ మ్యారేజ్?"
అనూష తల వంచుకుంది.
"త్యాగానికైనా హద్దుంటుంది కదమ్మా! నీకేం వయసు మించి పోలేదు.ఈ రోజుల్లో ఫార్టీ అంటే పెద్ద   వయసేం కాదు, మంచి వ్యక్తి నేవరినయినా చూసుకొని పెళ్ళిచేసుకో. ఇప్పుడు బాగానే వుంటుంది కానీ ముందు ముందు తోడు కావాలనిపిస్తుంది. మంచీ, చెడూ మాట్లాడుకోడానికి ఓ కంపెనీ కావాలనిపించిందా?"
బలవంతంగా నవ్వింది. "నాకు తోడు చాలామంది వున్నారు డాక్టరు. నా ఆశ్రమంలో వాళ్ళు నావాళ్ళు కాదా?"
"నీ వాళ్ళు కాబట్టేనా ఆ అమ్మాయి ఎవరో వున్నంతకాలం వుండి నీక్కూడా చెప్పకుండా పెళ్ళి చేసుకుని  వెళ్ళిపోయింది"
"ఏమో అనూషా! నాకు మాత్రం నచ్చలేదా అమ్మాయి  పద్దతి. ఎనీవే.... అదంతా వదిలేయ్, నువ్వు మాత్రం పెళ్ళి గురించి ఆలోచించు. పెద్దవాడిని. నీ శ్రేఎభిలాషిగా చెబుతున్నాను."
థాంక్స్ డాక్టరు! ఆలోచిస్తాను. ముందు మనం ఈ ఆపరేషన్ సంగతి..."
అయన నవ్వాడు. "నేను కాదంటే నువ్వాగుతావా? కానీ అలాగే చేద్దాం. ముందు బ్లడ్ కోసం ప్రయత్నించు,"
"అలాగే డాక్టరు" అనూష మోహం వెలిగిపోయింది.
యాదమ్మ కూతుర్ని ఎడ్మిట్ చేయించింది అనూష. బ్లడ్ కోసం బ్లడ్ బ్యాంక్ లన్నిటికి కబురుచేసింది. ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు చాలా తక్కువమంది వుంటాయి. అయిదారుగురు ముందుకు వచ్చినా అందులో ముగ్గురుకి డయాబెటిస్, ఒకళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువుగా వుండటం. అలా ఎవరదీ తీసుకోవాడానికిఅవకాసం దొరకలేదు. అనూశంల్లీ డాక్టర్ హరిశ్చంద్ర తో చర్చించింది. "చిన్న ఐడియా డాక్టర్" అంది సీరియస్ గా ఆలోచిస్తూ.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS