Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 31


     ఆ ఛైర్లో కూర్చుని బల్ల మీద తల ఆనించి పడుకుని వున్నారెవరో?

     "చీకట్లో కూర్చున్నావే?" అన్నాడు ప్రశాంత్. అవతలనించి సమాధానం లేదు.

     "ఇదిగో కొత్త కాసెట్స్. స్టేట్స్ నించి కొత్త రిఫరెన్స్ బుక్స్ తెప్పించాను" నిర్లక్ష్యంగా అన్నాడు.

     టేబుల్ మీద నించి తల ఎత్తి కుర్చీలో సరిగా కూర్చుని "ప్రశాంత్" అని పిలిచాడా వ్యక్తి.

     "ఏమిటి?"

    "నాకు బయట ప్రంపచాన్ని చూడాలని వుంది.

     ప్లీజ్.

     దయచేసి నన్ను విడిచిపెట్టవూ!" దీనంగా అభ్యర్దించిందా వ్యక్తి.

     ఆ మాట వింటూనే ప్రశాంత్ పగలబడి నవ్వేశాడు.

     "ఎందుకలా.. నవ్వుతావు?"

     ఆ గొంతు.. సూరిబాబుది.

     ప్రశాంత్ ఆ ప్రసన్నంగా మారిపోయాడు. సూరిబాబుకేసి చాలా సీరియస్ గా చూస్తున్నాడు.

    "నేను నీ వెల్ విషర్ని సూరిబాబూ! నువ్వు క్షేమంగా వుండాలనే నిన్ను నాలుగు గోడల మధ్య సురక్షితంగా వుంచాను."

    "అవసరం లేదు. నన్ను విడిచిపెట్టు."

     "నేను విడిచిపెట్టడం, నువ్వు బయటికి వెళ్లడం వరకు చాలా సులభమే!"

    కానీ చట్టం నీ చేతులకి సంకెళ్లు వేయడానికి ప్రతి నిముషం నీ కోసం నిఘా వేసివుంది తెలుసా?"

    సూరిబాబు విషాదంగా నవ్వేడు.

     "చట్టం నన్ను దోషిగా భావించి అరెస్ట్ చేసినా, నేను నిరపరాధి నని న్యాయస్థానంలో నిరూపించుకొంటాను!"

    ప్రశాంత్ అతని మాటలకి గొల్లుమని నవ్వేశాడు.

     "నువ్వు క్రిమినల్ కేసులో ఇరుక్కున్నావు సూరిబాబూ! ఆ కేసులోంచి బయట పడాలంటే చాలా గట్టి లాయర్ నీ తరపున వాదించాలి! వేలకి వేలు ఫీజు చెల్లించాలి. ఇది మామూలు కేసు కూడా కాదు.

     రేప్ కేసు.

     ఓ ఆడపిల్ల తనని అమానుషంగా మానభంగం చేశాడని పెట్టిన కేస్ అది."

     "నో!" అరిచాడు సూరిబాబు.

     "నేను.... నేను... తారని రేప్ చెయలేదు.

    అదే.. అదే నా దగ్గర కొచ్చి రెచ్చగొట్టింది."

    "రెచ్చగొట్టిన ప్రతి ఆడదాన్ని అనుభవిస్తావా?" సూరిబాబుని ప్రశ్నించాడు ప్రశాంత్ విలాసంగా సిగరెట్ వెలిగించి.
     సూరిబాబు మాట్లాడలేదు.

     "వెల్. ఏది ఏమైనా నువ్వొక్క విషయం మరచి పోతున్నావు.

    తార నా స్నేహితురాలు.

     అభిమాని.

     ఆమె నా కోసం వచ్చింది.

     అప్పుడు నేను లేను.

     నేను లేని ఆ సమయాన్ని నువ్వు అవకాశంగా తీసుకుని తారని బలవంతంగా అనుభవించి వుంటావని నేనుకూడా  భావించాను!" అన్నాడు ప్రశాంత్.

     "నో!అదే నన్ను..."

     "నిజంగా నువ్వు ఫూల్ వి రా సూరిబాబూ! ఓ ఆడది కోరి మగాడిపక్కలోకి రావాలంటే ఆ మగాడిలో ఏదో ఏ ప్రత్యేకత వుండాలి.

     తార నువ్వంటే పడి చచ్చిపోయి నీ దగ్గర పడుకోడానికి వచ్చి వుంటుందనుకోడానికి నువ్వు అందగాడివి కాదు.
 
     కురూపివి.

     ఒక్కసారి అద్దంలో చూసుకో.

     నీ జుత్తుని చూస్తే అడవిలో తిరిగే ముళ్లపంది గుర్తుకొస్తుంది.

     నీ మొహం మీద మచ్చల్ని చూస్తే కడుపులో వికారం అనిపిస్తుంది.

     ఓ పెళ్లికాని ఆడపిల్ల కలలు కనే వయసులో ఓ ఆరడుగుల అందగాడిని జోడీగా వూహించుకొంటుందే తప్ప నీలాంటి జంతువు పక్కలో పడుకోడానికి స్పృహలో వున్న ఏ ఆడదీ ఒప్పుకోదు.

     ఇకపోతే రెండో పాయింట్.

     ఆడది మగాడి స్టేటస్ ని చూస్తుంది. అది లేదు నీకు. నువ్వు కటిక దురిద్రుడిని. అనామకుడివి. పేరూ వూరులేని ఓ బండలాంటి వాడివి. ఆఖరికి నీ ఒంటిమీద బట్టలు కూడా కుళ్ళు కంపుకొట్టి హీనమైన స్థితి నీది."

    సూరిబాబు తల దించుకొన్నాడు.

     అతని కళ్లనించి రెండు కన్నీటిబొట్లు రాలిపడినాయి.

     "కేస్ చాలా బలమైంది సూరిబాబూ! చట్టానికి దొరక్కుండా ఇన్నాళ్లు తప్పించుకున్నందుకు మరికొంత కలిపి సుమారు పది సంవత్సరాలు కఠినశిక్ష పడుతుంది."

     ప్రశాంత్ మాటలకి సూరిబాబు చివాల్న తలెత్తి చూశాడు.

     అతని కళ్లల్లో రోషం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

     కానీ అతనికి తెలుసు.

     ప్రశాంత్ వేలెత్తి  చూపించిన ఏ పాయింట్ కీ తన దగ్గర సమాధానం లేదు.

     పేదవాడి కోపం పెదవికి చేటు.

     "ఇలాంటి మాటలతోనే నన్ను భయపెట్టి నాలుగేళ్లుగా నన్ను గడపదాటి బయటికి పోకుండా బంధించగలిగావు ప్రశాంత్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS