అంకిత్ ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండు గంటలయింది. తాళం తీయబోయి షాక్ తిన్నాడు. తాళం కప్పు కిందపడివుంది. తాళం కప్పు రెండు ముక్కలైంది.
అంకిత్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎవరో దొంగ వెధవ వచ్చివుంటాడు. ఈ పతికి అందినకాడికి దోచుకొని వెళ్ళి వుంటాడు. మెల్లిగా తలుపుతీసి లోపలకి అడుగుపెట్టాడు. లోపల జీరో బల్బు వెలుతురూ తప్ప, పెద్ద వెలుతురు లేదు.
దొంగ యింట్లోనే వున్నాడా? తను స్వీచ్ వేయగానే శాక కొట్టే ఏర్పాటు ఏమైనా చేసాడా? అలా ఆలోచిస్తున్నా మెల్లిగా లోపలకి తొంగి చూసాడు. వీపు భాగం కనిపిస్తూంది. ఎవరో నెలమీద కూచొని వున్నారు. అంకిత్ చూట్టూ తిరిగి అటువైపు వెళ్ళాడు. అక్కడే కిటికీ వుంది. మెల్లిగా కిటికీ రెక్కలు కొద్దిగా ఓపెన్ చేసాడు.
లోపలి దృశ్యం చూసి స్థానువయ్యాడు. లోపల మృదువని వుంది. నెల మీద కూచొని గిన్నెలో వున్న అన్నాన్ని ప్లేటులో గుమ్మరించుకుని, సాంబారు కలుపుకుని, గబగబా అన్నం తింటోంది.
ఎన్నో సంవత్సరాలుగా అన్నం తిన్నట్టు తింటోంది. ఆమె అన్నం తినే పద్దతి చూస్తోంటే, అన్నం ముద్దా మింగడంవల్ల పొలమారింది. చూట్టూ నీళ్ళ కోసం చూసింది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
ఒక్క క్షణం అంకిత్ మనసు ద్రవించిపోయింది. అతనికి ఆకలి బాధ తెలుసు... ఈ ప్రపంచంలో అతనికి తెలిసి, భయపడేది ఒక్క అ..క..లి..కే.. శారీరాన్ని మెలిపెట్టే బాధ... ఆకలి బాధ.
వెంటనే లోపలకి వచ్చి ఓ మూలాన వున్న కుండలో నుంచి మంచినీళ్ళు ఓ గ్లాసులో ముంచి ఆమెకు యిచ్చాడు.
నీళ్ళగ్లాసు అందుకుని గడగడా తగి, ఒక్కక్షణం షాకైంది.ఎదురుగా అంకిత్ తనేవరి నుంచి తప్పించుకుందో అతనే...
"మెల్లగా... నెమ్మదిగా తినండి..." అన్నాడు అంకిత్. ఆమె వెంటనే మళ్ళీ అన్నం తినడంలో నిమగ్నమైంది. ఒక్కో మెతుకు వదల కుండా అన్నం తింది.
చేతులు కడుక్కుని మరో గ్లాసు మంచినీళ్ళు తాగింది. తర్వాత అంకిత్ వైపు చూసింది.
మృదువని అవలిస్తోంది. రెండ్రోజులుగా పూర్తిగా ఆమెను ప్రశ్నంచకూడదని అనుకున్నాడు.
"నిద్రోస్తోందా?" అడిగాడు.
అవునన్నట్టు బుద్దిగా తలూపింది మృదువని.
"అదిగో ఆ మంచంమ్మీద పడుకో" చెప్పాడు.
ఇంకేమి ఆలోచించకుండా అలానే వెళ్ళి మంచంమ్మీద పడుకుంది. రెండు రోజులుగా కంటి మీద కునుకులేదు. నలబై ఎనిమిది గంటలుగా శారీరానికి రెస్ట్ లేదు.
పరుగు...భయం...టెన్షన్... క్షణాల్లోనే హాయిగా నిద్రలోకి జారుకుంది.
రెండు చేతులకు దిండులా పెట్టుకుని పడుకుంది. పసిపాపలా అనిపించిందా క్షణం ఆమె. దగ్గరగా మూడుచుకుని పడుకుంది. చలికి వణుకుతున్నాట్టుంది.
అంకిత్ మనసు కదిలిపోయింది. వెంటనే మూలానవున్న బ్లాంకిట్ తెచ్చికప్పాడు. అయినా వణుకుతూనే వుంది. మరో బ్లంకిట్.... మరో బ్లాంకిట్... అప్పుడు హాయిగా, వెచ్చగా పడుకుంది.
అంకిత్ ఓ సారి మృదువనివైపు చూసాడు. ప్రాశాంతంగా నిద్రపోతోంది. అలానే కిందకి వంగి ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టుకోవాలని అనిపించింది.బలవంతనా తన కోరికకు అదిమిపెట్టి, బయటకు నడిచాడు. తలుపులు దగ్గరగా వేశాడు.
***
అడుగుల శబ్దం దూరంయ్యేక కళ్ళు తెరిచింది మృదువని. ఒక్కక్షణం హాయిగా నిట్టూర్చింది. తను అతగ్ని మోసం చేస్తున్నానేమోనని ఫీలయింది. సరిగ్గా గంట క్రియం, షంషేర్ దాదా మనుష్యుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో, అంకిత్ తో కలసి హొటల్ కు వెళ్ళింది. ఆ తర్వాత అంకిత్ నుంచి ఎలా తప్పించు కోవాలో అర్దంకాలేదు. బాత్రూ వంకతో, మెల్లిగా అక్కడనుంచి జారుకుంది.
ఎలాగైనా రైల్వేస్టేషన్ వెళ్ళి, రాత్రి అక్కడ తలదాచుకుని, తరవాత ఢిల్లీ వెళ్ళాలని అనుకుంది.
కానీ, షంషేర్ దాదా మనుష్యులు టాంక్ బండ్ దగ్గరే తిష్టవేశారు. రాత్రి వేళ జన సంచారం వుండదు. కాబట్టి తనని ఐడెంటపై చేయడం తేలిక.
ఓ వైపు రాత్రి ఎక్కడ తలదాచుకోవాలా? అన్న ఆలోచన... ఇంకో వైపు అ..క..లి శారీరాన్ని మెలిపెట్టే ఆకలి... ఆ ఆకలి ఇంత భయంకరంగా వుంటుందని మొదటిసారిగా అనుభవంలో వచ్చింది ఆమెకు.
అప్పుడు పడింది ఆమె దృష్టి తాళం వేసివున్న ఈ యింటి మీద, ఏదో వూరు వెళ్ళి వుంటారని అనుకుంది. అంతకుమించి గత్యంతరం లేదు.చూట్టూ ఎవరూ తనని గమనించడంలేదు. తప్పనిసరి పరిస్టితిలో, గడిస్తే చాలు అనేలా వుంది ఆమె పరిస్థితి.
తీరా చూస్తే, అంకితే ఆమెకు ఎదురయ్యాడు. అతని సంస్కారం, మంచి తనం, ఆమెకు గంటక్రితమే తెలిసాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలో వచ్చాయి.
ఒక్కక్షణం బాధేసింది. అతని మంచితనాన్ని తను అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నానని... కానీ తప్పదు.
మెల్లిగా మెల్లిగా అలానే నిద్రలోకి జారుకుంది.
***
అర్దరాత్రి ఒంటిగంట.
చేతన్, రాహుల్ సినిమా నుంచి వచ్చారు. ఇంటి ముందు బాసింపట్టు వేసుకొని కూచున్న అంకిత్ ని చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు రాహుల్.
"అదేమిటి భయ్యా... నువ్వింకా మేలికువగానే వున్నావా? ఇంత చలిలో ఏం చేస్తున్నావు భయ్యా?"
"ష్... నెమ్మది... అరవకు... డిస్ట్రబ్ ఏమిటి? లోపల మన ప్రైమినిష్టార్ వాజ్ పీ నిద్రపోతున్నాడా?" అడిగాడు సెటైరిగ్గా.
రాహుల్ బిత్తరపోయాడు. "డిస్ట్రబ్ ఏమిటి? లోపల మన ప్రైమినిస్టర్ వాజ్ పేయ్ నిద్రపోతున్నాడా?" అడిగాడు. సెటైరిగ్గా.
