గార్డ్స్ అటూ ఇటూ పహారా కాస్తున్నారు.
ఓ వ్యక్తి మెల్లిగా గోడ ఎక్కిలోపలకి దిగాడు.
కౌశిక్ లో అనుమానం బలపడసాగింది.
ఆ వ్యక్తి మరెవరో కాదు 'భస్మ'
వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేశాడు.
"ఓ ఆగంతుకుడు లోపలకి వస్తున్నాడు. అతన్ని చూసీ చూడనట్టు వదిలేయండి" అని.
మరుక్షణం అతని ఆదేశం అక్షరాల అమలైంది. సెక్యూరిటీ ఉదాసీన వైఖరి నటించింది. భస్మను ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.
కౌశిక్ లేచి టూబ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ అన్ చేశాడు. ఆ గదిలో చిన్న టీవీ లాంటి స్క్రీన్ వుంది. దాంట్లో భస్మ కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
భస్మ అన్ని గదులు దాటుతూ తన గదివైపే రావడం గమనించిన కౌశిక్ వూపిరి బిగించాడు.
ఇలాంటి సంఘటనలు అతని ప్రోపషనల్ లైఫ్ కి కొత్త కాకపోయినా, అదోరకంగా ఉంది.
భస్మ కౌశిక్ పడగ్గదిలోకి వచ్చాడు.
వూపిరి బిగాపడ్డాడు కౌశిక్.
అతని చేతిలో రివాల్వర్ మెరుస్తోంది. అది ఏ క్షణంలోనైనా పెలవచ్చు.
భస్మ కౌశిక్ మంచం దగ్గరకి వచ్చాడు.
జేబులోనుంచి నైఫ్ తీశాడు.
మంచం మధ్య ఎవరో పడుకున్నట్టు వుంది.
కసిగా ఆ ప్రాతంలో కత్తితో కసకసా పొడిచాడు. ఏ రియాక్షన్ లేకపోయేసరికిదుప్పటి లాగాడు.
వరసగా దిండ్లు పెర్చపడి వున్నాయి.
భస్మ మొహం ఎర్రబడి వున్నాయి.
"హ్యండ్సాఫ్...హ్యాండ్సమ్ మిస్టర్ భస్మా... చాలా ఈజీగా, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. థాంక్యూ... థాంక్యూ...ప్రెండు..." అన్నాడు కౌశిక్.
భస్మ మాట్లాడలేదు. చేతులు పైకి ఎత్తనూలేదు.
"ఓ.కే.. ఇట్సాల్ రైట్... ఫోనీ నేను చెప్పినట్టు చేస్తావా? బుద్దిగా హ్యండ్ కప్స్ నీ చేతులకు తగిలించుకో..." అన్నాడు. డ్రాయర్ సరుగులో నుంచి హ్యండ్ కప్స్ బయటకు తీశాడు.
భస్మ కౌశిక్ వైపు సీరియస్ గా చూశాడు.
భస్మ చేయి గాల్లోకి లేచింది.
ఇక ఆలస్యం చేస్తే బావావుదని అర్దమైంది కౌశిక్ కు. తన బలవంతా ఉపయోగించి భస్మను తన కస్టడీలోకి తీసుకోవాలనుకున్నాడు.
అప్పటికే భస్మ కౌశిక్ ని పట్టుకుని ఓ మూలకు గిరాటు వ్వ౩శాదు.
అతని బలం చూసి కౌశిక్ ఆశ్చర్యపోయాడు. బలవంతా చేతుల్లో తెచ్చుకుని బలంగా ఎటాక్ చేశాడు కౌశిక్.
ఒక్కసారిగా తూలీ పడిపోబోయాడు భస్మ. వెంటనే అదే అదనుగా హ్యండ్ కప్స్ తీసి భస్మకు తగిలించాడు కౌశిక్.
భస్మ వాటి వంక చూసుకున్నాడు. కానీ అతని ముఖంలో ఏ రియాక్షనూ లేదు.
***
"భస్మను కౌశిక్ అరెస్ట్ చేశాడు" లల్లూరామ్ వగరుస్తూ వచ్చి చెప్పాడు ఖాన్ తో.
"యూ స్టుపిడ్... నువ్వేం చేస్తున్నావు? అదోరకంగా అతన్ని తీసుకువస్తే బావుండేది..." అన్నాడు ఖాన్.
"నేను చాలా ట్రైయ్ చేశాను. కౌశిక్ అతని జీపులో ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. నేను ఆ జీపు ఫాలో అవుదామనుకున్నా.... కానీ మరో ఫోలీసు పార్టీ అప్పటికే అక్కడికి వచ్చింది " చెప్పాడు లల్లూరామ్.
ఖాన్ ఆలోచనలో పడ్డాడు.
కరంజయా అగర్వాల్ దగ్గరకి వెళ్ళి...
"వెంటనే భస్మకు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చేయ్. కౌశిక్ చపమని చెప్పు..." అన్నాడు.
"చూప రహో... ఇప్పుడు మనం కౌశిక్ ని చంపేస్తే పడ్డ గోడవైపోతుంది. ఫావులేసులు దండులా వచ్చి ఎటాక్ చేస్తారు.
కౌశిక్ ఏం చేసినా అది మనకే బెడిసి కొడుతుంది."
"మరిప్పుడేలా?" కరంజయా అడిగాడు.
అగర్వాల్ వైపు చూశాడు ఖాన్ అగర్వాల్ గొంతు సవరించుకుని... మనం భస్మ ను బంధించిన ప్రాంతానికి దగ్గర్లో వుండాలి... అప్పుడే ఈజీగా సజెషన్స్ ఇవ్వగలం..." చెప్పాడు.
***
"మౌనా.. ఇంకా ఇఇమోసల్దానిమీదకోపం పోలేద?" బామ్మా మౌన దగ్గరకి వచ్చి అడిగింది.
అటు తిరిగి పడుకుంది మౌన.
తనకు సీరియస్ గా వుందని బామ్మా టెలిగ్రాం ఇవ్వడంతో మౌన కంగారుగా హైదరాబాదు కు వచ్చింది. తీరా వచ్చాక తనని పెళ్ళి చేసుకోమని చెప్పడానికి ఆ టెలిగ్రాం ఇచ్చిందని తెలిసి చిందులేసింది కోపంతో మౌన.
రెండ్రోజులు బామ్మ మీద అలిగింది. అ అలక ఎప్పుడో పోయినా తను మామూలుగా వుంటే మళ్ళా పెళ్ళి చేసుకోమని వెంటపడుతుందని నటిస్తోంది.
"సరేనా మోఎనా... నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకిష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన అబ్బాయిని పెళ్ళి చేసుకో...
'బామ్మా... ఇఅతడే నా పెళ్లికొడుకు' అని ఓ విమానాన్ని తెచ్చి చూపించినా అక్షింతలు వేసి 'బుల్లి హెలికాప్టర్ మనవడ్ని కానీ' నాకివ్వమని ఆశీర్వదిస్తా... కానీ అలకమానవే." బామ్మ అనడంతో...
మౌన ఒక్కసారిగా కదిలిపోయింది.
బామ్మ అంటే మౌనకు పంచప్రాణాలు. ఆక్సిడెంట్ లో అమ్మా, నాన్న చనిపోతే గారాబంగా పెంచింది. తనేదడిగినాకొనిపెట్టేది. తను ఎయిర్ హావుస్తాస్ అవుతానంటే, తనకిష్టం లేకపోయినా ఒప్పుకుంది. అన్నింటి కన్నా, బామ్మలో మౌనకు నచ్చే అంశం... సాధారణంగా వయసుతో, పెద్దరికం ఎక్కువవ్వడం వాళ్ళ వచ్చే చాదస్తం బామ్మకు లేకపోవడం.
మౌన లేచి బామ్మ మంచం దగ్గరకి వెళ్ళింది. బామ్మా అటువైపు తిరిగి దుప్పటి కప్పుకుని పడుకుంది.
"బామ్మా..." పిలిచింది.
